Girlfriend · Telugu

ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే

Completed | Part 4 of 6 | 2 Likes

Part 4

మార్నింగ్ 7కల్లా నిద్ర లేచిన హరీష్ గోపాల్ ను కూడా నిద్ర లేపి తయారు అవ్వమని తాను కూడా వేరే బాత్రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయిపోయి ప్యాంటు షర్ట్ వేసుకుని బయటకు వచ్చిన హరీష్ ని చూసి గోపాల్ "నా ఫ్రెండ్ హరీష్ ని ఎక్కడికీ తీసుకు వెళ్లడం లేదు ..... కేవలం నా గర్ల్ ఫ్రెండ్ హరిత ని మాత్రమే తీసుకు వెళుతున్నా .... హరీష్! నేను నీకు మాటిచ్చాను ... కలలో కూడా ఎవరికీ నీ విషయం తెలియదు .... ఈ మూడు రోజులూ నువ్వెలా ఉండాలనుకున్నావో అట్లానే ఉండు .... నీ కలలన్నీ తీర్చుకో ..... అట్లానే రా .... ఫిలిం కంట్రోల్ గ్లాస్ వేయించిన నా ఆడి కార్ రప్పించాను .... ఆడరూపంలో ఊరంతా చుట్టి వద్దాం .... నో నీడ్ టూ వర్రీ ... వెళ్లి నీకిష్టమైన చీరలో రా ..... నా మీద నమ్మకముంచు" అన్నాడు.

మనసులో ఏదో అనుమానమున్నా గోపాల్ అంత నమ్మకం గా చెప్పేసరికి సరే ఒక్క అరగంట అంటూ లోపలి వెళ్లిన హరీష్ లేత పసుపు రంగు చెట్టినాడ్ సిల్క్ చీర కట్టుకుని చేతికి గాజులు, అరవంకీలు, నడుముకు కందోళీ అలంకరించుకుని వచ్చేసరికి అరగంట అయ్యింది .... ఈ లోపు వాచ్ మాన్ ని పాలు తీసుకు రమ్మని ఇంటర్ కామ్ లో పురమాయించాడు గోపాల్ .... పాలు తీసుకు రావాలంటే మినిమం 20 నిమిషాలు పడుతుంది ..... అందుకే ఆలోచించి ఆ పని చేసాడు.

చీరలో ముస్తాబై వచ్చిన హరీష్ ని "త్వరగా రా .... మీ వాచ్మాన్ ని మిల్క్ తెమ్మని చెప్పి పంపాను . వాడు వచ్చేలోపు మన కార్ బయటికి వెళ్ళిపోతే ఎవరూ నిన్ను గమనించరు" అంటూ బయటికి నడిచాడు గోపాల్. సరే అంటూ హరీష్ కూడా తన వెనుకే వెంబడించాడు.

కార్ ఎక్కి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ప్రక్క సీట్ లో హరీష్ ని కూర్చుండబెట్టుకుని బయటికి వచ్చి సిటీ పొలిమేరల్లో ఉన్న హరీష్ ఫార్మ్ హౌస్ నుండి యాంటీ డైరెక్షన్ లో సిటీ కి ఇంకా దూరంగా పోనివ్వసాగాడు గోపాల్. ఇది గమనిస్తున్న హరీష్ కి లోలోన భయంగానే ఉంది కానీ గోపాల్ తనకు అంత నమ్మకంగా చెప్పాక ఇక భయపడి లాభం లేదనుకుని మౌనంగా కన్నులు మూసుకుని నిద్రకు ఉపక్రమించాడు.

అత్యంత అధునాతనమైన ఆ కార్ ముందుకు దూసుకుపోసాగింది..... సుదీర్ఘంగా ప్రయాణం చేసిన తరువాత బెంగళూరు నగరం లో ప్రవేశించేటప్పటికి హరీష్ నిద్ర మేలుకొన్నాడు .... సిటీ లోకి ప్రవేశించాక అధునాతనమైన ఒక భవంతిలోకి తన కార్ ను పోనిచ్చి పోర్టికో లో కారుని ఆపి గోపాల్ ముందు తాను దిగి నాటకీయంగా "వెల్కమ్ టు మై స్వీట్ గర్ల్ ఫ్రెండ్" అంటూ తలవంచి డోర్ తీసాడు. కొంచెం సందిగ్ధం తోనే హరీష్ కార్ దిగి నిలబడ్డాడు.

"ఇక నిన్ను హరీష్ అని పిలవను ..... ఇక్కడ ఉన్న ఈ రెండు రోజులూ నీ పేరు హరిత ..... నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు ..... నీకిష్టమైన రీతిలో తయారు అవ్వచ్చు .... ఇంకా నీకు నచ్చే బోలెడు సర్ప్రైజెస్ ఉన్నాయి .... నా ఆత్మీయ స్నేహితురాలికి ఈ బాయ్ ఫ్రెండ్ ఇచ్చే బహుమానం ఇది" అన్నాడు గోపాల్.

"థాంక్యూ వెరీ మచ్ గోపాల్ ... యూ అర్ ఏ ట్రస్టువర్దీ ఫ్రెండ్ టు మీ" అంటూ గోపాల్ కి ఒక హగ్ ఇచ్చాడు చీర ధరించి ఉన్న హరీష్ ..... గోపాల్ లో ఏదో తీయని అనుభూతి.

ఇద్దరూ లోపలికి వెళ్లేసరికి ఒక సర్వెంట్ మెయిడ్ ఎదురు వచ్చింది ..... తన పేరు మాలతి గా పరిచయం చేసాడు గోపాల్ .... తనే ఈ రెండు రోజులూ నీ కేర్ టేకర్ అంటూ నో నీడ్ల్ టు ఫీల్ షైయ్ ..... షీ నోస్ ఎవెరీథింగ్ అబౌట్ యూ ..... ది సీక్రెట్ విల్ బి వితిన్ దిస్ హౌస్ ఓన్లీ ..... అన్నాడు గోపాల్.

మాలతి నవ్వుతూ విష్ చేసి మేడం! ఇన్ ది ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ యువర్ రూమ్ ... గోపాల్ సర్ అరేంజ్డ్ ఎవరీ థింగ్ ..... మీరు ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ రెడీ చేస్తా అంది. హరీష్ కి ఇదంతా ఆశ్చర్యము గా ఉంది . మాలతి వెంట వచ్చి చూపించిన రూమ్ లో ప్రవేశించి ఆ రూమ్ ను పరీక్షగా చూసాడు హరీష్ ..... ఎంతో సుందరంగా తీర్చి దిద్ది ఉంది ..... వాల్ పెయింటింగ్స్ ..... మధ్యలో అందమైన బెడ్ ..... శాండ్లియర్స్ వెలుగులో ఆ రూమ్ అందం మరింతగా కనపడుతోంది ..... మాలతి వెంట వచ్చి హరీష్ కి వార్డ్రోబ్ చూపించి .... "మీరు ఏది వాడుకోవాలనుకున్నా మీ ఇష్టం .... సర్ నిన్న ఫోన్ చేసి అన్నీ కొనిపించారు ..... మిమ్మల్ని ఈ రెండురోజులూ ఆనందంగా ఉంచే బాధ్యత నాదన్నారు ..... అని మీరు ఫ్రెష్ అవండి ... నేను వస్తా" అంటూ తాను బయటికి వెళ్ళింది ....

అసలే షాక్ లో ఉన్న హరీష్ వార్డ్రోబ్ తెరచి చూసేసరికి ఎంతో అందమైన డిజైనర్ శారీస్, కాటన్ శారీస్, పంజాబీ డ్రెస్సెస్, నైటీస్, ఇన్నర్ వేర్ అన్నీ అందంగా అమర్చి ఉన్నాయి .... ఇక అన్నీ తెలిసిన మాలతి, గోపాల్ ముందు భయపడి వ్యర్థం అనుకుని ఆ చీరల్లో నుండి అందమైన పింక్ కలర్ సిల్క్ చీర తీసుకుని .... ప్రక్కన ఉన్న రాక్ లో ఏమున్నాయో చూద్దామనుకుని ఓపెన్ చేసిన హరీష్ మరింత ఆశ్చర్యపోయేలా రకరకాల హెయిర్ విగ్గులు, అక్రిలిక్ నెయిల్స్, రకరకాల నగలూ ఉన్నాయి.

మార్నింగ్ నుండి ఒక్కటే ప్రయాణం లో తన అలంకరణ కొంచెం కరిగిపోవడం గమనించుకుని ఒక అరగంట పాటు బాత్రూమ్ షవర్ క్రింద నిలబడి తనివితీరా స్నానించి .... అట్లాగే నగ్నము గానే బయటికి వచ్చి ఆ రాక్స్ లో ఉన్న పింక్ కలర్ పాడెడ్ బ్రా, పాంటీ లు తీసుకుని వేసుకుని ప్రక్కనే ఉన్న విగ్స్ లో తనకు సూట్ అయ్యే హ్యూమన్ హెయిర్ విగ్ తీసుకుని అమర్చుకుని .... నింపాదిగా లంగా, జాకెట్ వేసుకుని ఆ తదుపరి చీర సింగారించుకుని అద్దంలొ చూసుకుంటూ ఉండేసరికి తలుపు శబ్దం చేస్తూ మే ఐ కమిన్ మేమ్ అంటూ మాలతి లోపలి వచ్చి "మేమ్ కెన్ ఐ గివ్ ఫినిషింగ్ టచెస్ ఫర్ యువర్ బ్యూటీ" అంటూ ఒక స్టూల్ మీద హరీష్ ని కూర్చుండబెట్టి కొన్ని కాస్మెటిక్స్ మరియు క్రీమ్స్ హరీష్ మొఖం మీద అప్లై చేసి .... హరీష్ కు కొన్ని ఆర్నమెంట్స్ చూపించి తనకు నచ్చినవి హరీష్ కి తొడిగి .... నౌ యూ కెన్ వాచ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది మిర్రర్ మేమ్ అంటూ హరీష్ ని అద్దం ముందుకి నడిపించింది మాలతి.

అద్దంలో తనని తాను చూసుకున్న హరీష్ ఇది కలా నిజమా అద్దం లో కనపడేది తానేనా అనే ఆశ్చర్యమ్ తో కాసేపు అట్లా నిలబడిపోయి "థాంక్యూ మాలతీ .... ఐ రియల్లీ గ్రేట్ఫుల్ టూ యు " అంటూ మాలతి కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు .

అంతలో మాలతి మేమ్! క్రింద ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ని అరెంజ్ చెయ్యమని సర్ ఆర్డర్ .... మీ కోసం ఫోటోగ్రాఫర్ వెయిటింగ్ ..... అంది .

నింపాదిగా పింక్ కలర్ చీరలో తన ఆడతనాన్ని ఒలికిస్తూ క్రింది ఫ్లోర్ కి వెళ్ళాడు హరీష్ . అక్కడ ఫోకస్ లాంప్స్ తో కెమెరా తో రెడీ గా ఉంది ఒక లేడీ ఫోటోగ్రాఫర్ .... హరీష్ ని చూడగానే మేమ్! థిస్ ఈజ్ భార్గవి .... ఐ అం రెడీ ఫర్ ది ఫోటోషూట్ ... ఆర్ యు రెడీ అంటూ వివిధ భంగిమల్లో యెట్లా నిలబడాలి ... యెట్లా కూర్చోవాలో చెబుతూ ఒక అరగంట సేపు ఫోటోషూట్ కొనసాగించి ఎన్నో ఫొటోస్ తీసి ... మేమ్! మీది ఫొటోజెనిక్ పేస్ .... ఫొటోస్ చాలా బాగా వస్తాయి .... ఈ ఫొటోస్ అన్నీ ఒక ఆల్బమ్ గా చేసి ఇవ్వమన్నారు గోపాల్ సర్ .... రేపు ఉదయం వస్తాను .... ఇంకా మీకు ఇష్టమైన చీరల్లో ఫొటోస్ తీశాక ఆల్బం చేసి ఇస్తాను .... గుడ్ నైట్ మేమ్! అంటూ వెళ్ళిపోయింది భార్గవి.

ఇంతలో మాలతి మేమ్! మీరు రెడీ అయితే డిన్నర్ కి క్రిందికి వస్తా అన్నారు సర్ .... రమ్మని చెప్పేదా అని అడిగితే .... కొంచెం రిలాక్స్ అయిన హరీష్ కూడా ష్యూర్ మాలతీ ప్లీజ్ టెల్ గోపాల్ టు జాయిన్ ఫర్ డిన్నర్ అన్నాడు....

మాలతి గోపాల్ కి ఫోన్ చేసేసరికి ఒక రెండు నిమిషాల్లో వైట్ లాల్చీ లో హుందాగా నవ్వుతూ క్రిందికి వచ్చాడు గోపాల్ ... మాలతి వడ్డించగా ఇద్దరూ భోజనం చేశారు . భోజనం అయ్యిన తరువాత మాలతికి గుడ్ నైట్ చెప్పిన హరీష్ గోపాల్ తో పైకి వెళ్లి బాల్కనీ లో కూర్చుని ఆ వెలుగులో నగరాన్ని చూస్తూ "థాంక్యూ గోపాల్ .... నేను కన్నా కలల్ని ఇన్నాళ్లకు నువ్వు నిజం చేసావు ..... ఎప్పుడూ అనుకుంటూ ఉండే వాడ్ని .... ఇట్లా ఫోటోషూట్ తీయించుకోవాలని ..... ఒకరి సహాయం తీసుకుని నాలో ఉన్న ఆడతనాన్ని మరింత పెంచుకోవాలని ..... నీ వల్ల ఇది సాధ్యమైంది థాంక్యూ" అన్నాడు .

1434 Views 1 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (1)

Meghana
Meghana 3 days, 9 hours ago

Wow..you are truly amazing...chala vivaram ga rasaru..oka andamaina kadhanu chala andam ga kallaku kattinattu chupincharu chelli. Super.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login