Girlfriend · Telugu

ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే

Completed | Part 5 of 6 | 2 Likes

Part 5

అందుకు గోపాల్ హరితా! ఈ రెండు రోజులూ నువ్వు మగాడివన్న విషయం మర్చిపో..... చేసేవాడిని ... అనుకుంటూవుండేవాడిని ... అనే పదాలు మర్చిపో చేసేదానిని ... అనుకుంటూ ఉండేదానిని ... అనుకుంటూ అసలు సిసలు స్త్రీగానే నీకిష్టం వచ్చినట్లు ఉండు ..... అన్నాడు .

ఓకే బాబా ..... ఈ సిల్క్ శారీ కంఫర్ట్ గా ఉన్నా నలిగిపోయేట్లు ఉంది .... ఉండు వస్తా అని లోపలికి వెళ్లి సిల్క్ చీర విప్పేసి ..... ఆ స్థానంలో కాటన్ నైటీ వేసుకుని బయటికి వచ్చాడు (సారీ వచ్చింది) హరిత ... ఇక మనం కూడా అట్లానే పిలుద్దాం!

బయటికీ నైటీలో వస్తూ వస్తూ గోపాల్ ని గమనించడం మొదలు పెట్టాడు హరీష్ ..... బాల్కనీ లో ఉన్న కేన్ చైర్ లో హుందాగా లాల్చీ లో కూర్చొని చంద్రుని వెలుగును ఆస్వాదిస్తూ ఏదో ఆలోచిస్తున్న గోపాల్ని చూస్తూ ఉంటే ఏనాటిదో జన్మజన్మల బంధం తామిద్దరి మధ్యా ఉందేమో అన్నట్లు అనిపించింది.

తెల్లని రంగు మీద పచ్చని మరియు లైట్ రెడ్ కలర్ పూల డిజైన్ ఉన్న నైటీ వేసుకున్న హరీష్ కాలి పట్టీల సవ్వడికి ఆలోచనల నుండి బయట పడ్డ గోపాల్ హరీష్ వైపు చూచి చిరునవ్వుతో "నేనిచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ యెట్లా ఉంది హరితా ...."అనగానే

"నాలో ఆడతనాన్ని నేను అద్దము లో చూసుకుని మురిసిపోయేవాడిని అంతే కానీ వేరొక మనిషి ఉండగా నేనెప్పుడూ ఇట్లా తయారవ్వలేదు ..... చాలా హ్యాపీ గా ఉంది ..... అంతేకాక ఎల్లప్పుడూ ఇట్లానే ఉండిపోవాలనుంది. కానీ అటు కంపెనీ వ్యవహారాలు , అంతే కాక నన్ను పెంచి పెద్దచేసిన అనాధాశ్రమం బాగోగులూ ఎవరు చూసుకుంటారు గోపాల్ .... ఈ జన్మకు ఇక ఇంతే .... మళ్ళీ జన్మ అంటూ ఉంటే అందమైన ఆడదానిగా పుట్టాలని కోరుకుంటా.... ఎనీ హౌ థాంక్యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రాండ్ ట్రీట్..... మళ్ళీ ఎప్పుడైనా నాకు ఇట్లా ముస్తాబు అవ్వాలంటే తప్పకుండా ఇక్కడికే వస్తాను" అన్నాడు హరీష్.

అందుకు గోపాల్ నువ్వూ నేనూ మళ్ళీ జన్మ ... ఇక అంతే అనే మాటలు మాట్లాడకూడదు హరితా .... ఎనీ వే ఐ యాం హ్యాపీ ఇఫ్ యూ హ్యాపీ అంటూ కాసేపు తమ తమ బాల్యం యెట్లా గడిచిందీ కాలేజీ కబుర్లు అవీ ఇవీ పిచ్చ పాటీ కబుర్లు చెప్పుకుని నైట్ ఒంటి గంటకు కానీ నిద్రకు ఉపక్రమించలేదు.

తన బెడ్ రూమ్ కి వెళ్లిన హరీష్ బెడ్ పైన పడుకుని సీలింగ్ రూఫ్ కి అంటించిన మాజికల్ స్టార్స్ ని చూస్తూ ప్రశాంతంగా నిద్రపోయాడు .. ఆ నిద్రలో తాను అందమైన యువతిగా, గోపాల్ని తనను రక్షించడానికి వచ్చిన హీరోగా కలల్లో విహరిస్తూ ఉన్నాడు.

మరునాడు ఉదయం 10గంటలకు మాలతి అవెకెనింగ్ కాల్ ... మేడం! ఇట్స్ 10 ఓ క్లాక్.... భార్గవి ఆన్ ది వే తో టేక్ యువర్ ఫోటోగ్రాఫ్స్ .... కెన్ ఐ హెల్ప్ యూ? అంటూ ......

బద్ధకంగా లేచిన హరీష్ త్వరత్వరగా స్నానంచేసి తనకి నచ్చిన లావెండర్ కలర్ చీర తీసుకుని ఆ కలర్ మాచింగ్ బ్రా పాంటీ వేసుకుని .... బ్లౌజ్.... లోపలి లంగా వేసుకుని చీర ధరించి మాలతిని ఇంటర్కమ్ లో పిలిచినా వెంటనే మాలతి వచ్చి హెయిర్ విగ్, ఫేసియల్ మేకప్ పూర్తి చేసి ఓకే మేమ్ అనగానే క్రిందికి వెళ్లేసరికి భార్గవి సిద్ధంగా ఉంది .... వెంటనే వేర్వేరు ఫోజుల్లో ఫొటోస్ తీసుకుని ... మేమ్! కెన్ యూ ట్రై అదర్ శారీస్ అనగానే వెంటనే పైకి వెళ్లి గద్వాల్ హ్యాండ్లూమ్ చీర ఒకటి కట్టుకుని వచ్చి ..... ఆ తరువాత ఒక కుంకుమ రంగు పట్టు చీర లోనూ ఫొటోస్ తీయించుకుని .... చివరలో బ్లూ కలర్ చుడిదార్ లో కూడా ఫొటోస్ తీయించుకున్నాడు హరీష్.... మేమ్! టుమారో మార్నింగ్ ఐ విల్ డెలివర్ యువర్ ఆల్బమ్ మేమ్! గోపాల్ సర్ పెయిడ్ ది బిల్ .... అంటూ వెళ్ళిపోయింది.

ఆ రాత్రి స్కైబ్లూ కలర్ కాటన్ శారీ కట్టుకుని ఎక్కడికో వెళ్లిన గోపాల్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడసాగాడు హరీష్ .... కాసేపటికి రాత్రి 10గంటలు అవుతూ ఉండగా గోపాల్ వచ్చాడు .... సారీ! ఏదో అర్జెంటు పని .... లేట్ అయింది ... భోజనం చేసావా లేదంటే నాకూ ఆకలిగా ఉంది పదా! అంటూ వెళ్లి 5నిమిషాల్లో ఫ్రెష్ అయిపోయి వచ్చేశాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించి మునుపటిలానే బాల్కనీ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా హరీష్ రేపు ఎన్నింటికి బయలుదేరుదాం హైదరాబాద్ కి అన్నాడు. రేపు ఆఫ్టర్నూన్ 4 గంటలకి స్టార్ట్ అవుదాం .... నీ ఇష్టం లేకుంటే ఎల్లుండి మార్నింగ్ స్టార్ట్ అవుదాం అన్నాడు గోపాల్....

నాకూ ఉండాలనే ఉంది ... కానీ అర్జెంటు పనులున్నాయి రేపు నైట్ స్టార్ట్ అవుదాం ఎల్లుండి మార్నింగ్ కి హైదరాబాద్ చేరుకుంటాం కదా! అన్నాడు హరీష్ ......

ఆ నెక్స్ట్ డే భార్గవి వచ్చి ఒక డిజిటల్ ఆల్బమ్ ఇచ్చి వెళ్ళింది ..... అందులో ఫోటోలను చూసి వాటిల్లో ఉన్నది తానేనా అన్నట్లు ఆశ్చర్యముగా చూస్తున్న హరీష్ ను .... అందులో ఉన్నది నా ఫ్రెండ్ హరీష్ కాదు .... నా గర్ల్ ఫ్రెండ్ హరిత అంటూ గోపాల్ ఆటపట్టించాడు.

మరుసటి ఉదయం ఆఫీస్ కి వెళ్లాల్సి ఉండటం తో ప్యాంటు షర్ట్ ల్లో తయారైన హరీష్ ని చూసిన మాలతి సర్! మీరు షర్ట్ పాంట్స్ కంటే చీరలోనే అందంగా ఉన్నారు అంటూ ఉండగానే గోపాల్ క్రిందకు దిగుతూ ఉండటంతో హరీష్ ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ థాంక్యూ మాలతీ ! సి యు అగైన్ అంటూ కార్ వైపు దారితీసాడు. అట్లా సాగిన వాళ్ళ బెంగుళూరు ట్రిప్ మరుసటి ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో పూర్తయింది.

ఆ తరువాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటంతో ఇద్దరికీ కలవడానికి ఒక నెలవరకూ ఎవరికీ కుదరలేదు. సరిగ్గా నెలతరువాత హరీష్ గోపాల్ కి ఫోన్ చేసి కొంచెం ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది వస్తావా అని అడిగాడు. ఈవెనింగ్ 7 గంటలకల్లా హరీష్ ఫార్మ్ హౌస్ లో కలుద్దాం అని ప్లాన్ చేసుకున్నారు. నైట్ కూడా అక్కడే స్పెంట్ చేసి నెక్స్ట్ డే ఈవెనింగ్ రావాలనుకున్నారు.

హరీష్ ముందుగా సాయంత్రం 5గంటలకల్లా ఫార్మ్ హౌస్ కి వచ్చేసాడు. సెక్యూరిటీ గార్డ్ కి ఆఫీస్ నుండే ఫోన్ చేసి "ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను ఈ మూడు రోజులూ ఇక్కడే ఫార్మ్ హౌస్ లో ఉంటాను నువ్వు ఎప్పటినుండో సెలవు అడుగుతున్నావు కదా సరిగ్గా మూడురోజులు లీవ్ ఇస్తున్నా" అని చెప్పడంతో హరీష్ వచ్చేటప్పటికే అతను గేట్ కి తాళం వేసి వెళ్ళిపోయాడు.

గోపాల్ ఫార్మహౌస్ కి చేరుకునే సరికి చీకట్లు అలుముకుంటున్నాయి. గేట్ తెరచి ఉండాల్సిన సెక్యూరిటీ లేకపోయేసరికి బయట నుండి హరీష్ కి ఫోన్ చేసాడు. పైన రూమ్ నుండే తన దగ్గర ఉన్న రిమోట్ తో గేట్ డోర్ ఓపెన్ చేసాడు హరీష్. లోపల కార్ పార్క్ చేసి గేట్ క్లోజ్ చేసి పైకి వెళ్లిన గోపాల్ కుంకుమ రంగు నేత చీరలో నగలను అలంకరించుకుని జడలో మల్లెపూలతో చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్న హరీష్ ని చూసి సంభ్రమాశ్చార్యాల్లో మునిగి పోయాడు

1435 Views 1 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (1)

Meghana
Meghana 3 days, 9 hours ago

Wow..you are truly amazing...chala vivaram ga rasaru..oka andamaina kadhanu chala andam ga kallaku kattinattu chupincharu chelli. Super.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login