Girlfriend · Telugu

ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే

Completed | Part 1 of 6 | 2 Likes

Part 1

ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే....... ?" కథ

ఆరోజు వర్షం కురుస్తోంది. మధ్యాహ్న సమయం. గోపాల్ ఆలోచనలు మాత్రం హరీష్ చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. గోపాల్ బిజినెస్ రైవల్ అతను.

హరీష్ వయసు 25 సంవత్సరాలు మాత్రమే. గోపాల్ కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. మీసాలు కూడా మొలవని తన వ్యాపార ప్రత్యర్ధి గోపాల్ కు ముచ్చెమటలు పట్టించేస్తూ ఉన్నాడు గత రెండు సంవత్సరాలుగా. ఇద్దరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఒక మూడు గోపాల్ చేతికి వచ్చే సమయంలో గద్దలా తన్నుకుపోయాడు హరీష్. కష్టపడి పైకి వచ్చాడు. ముందూ వెనుకా ఎవరూలేని అనాధ అంటారు. ఒకడే ఉంటాడు తన ఫ్లాట్ లో. గోపాల్ రెండు మూడు సార్లు రాజీ ప్రతిపాదనలు తెచ్చినా సున్నితంగా కాదన్నాడు.... అంతే గోపాల్ హరీష్ ను ఆగర్భ శత్రువుగా భావించడం మొదలు పెట్టాడు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సర్కిల్ లో ఇద్దరు పెళ్లవ్వని కుర్రాళ్ళ మధ్య ఈ ఆశక్తి కరమైన పోటీని అందరూ గమనిస్తూనే ఉన్నారు.

గోపాల్ కూడా కష్టపడి పైకి వచ్చిన వాడే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ లో ఉంటారు. అతని వయసు 27 సంవత్సరాలు మాత్రమే. గోపాల్ మంచి హాన్డ్సం గా ఉంటాడు. ఇక ప్రస్తుతానికి వస్తే ....

ఆరోజు తన ఆఫీసు లో టాప్ అఫీషియల్స్ తో స్టాఫ్ మీటింగ్ పెట్టాడు. సబ్జెక్టు మాత్రం హరీష్ ని ఎలా ఎదుర్కోవాలా అని మాత్రమే. ఒకటి రెండు నెలల్లో పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ కోసం టెండర్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్క కాంట్రాక్టు అయినా తనకు కానీ రాకపోతే పెద్ద మొత్తంలో నష్టం వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకోసమే ఈ మీటింగ్.
గోపాల్ ఆఫీసు లో ఉన్న స్టాఫ్ అంతటిలో ఉన్న ఏడుగురు మెరికల లాంటి వాళ్ళు ఈ ఉద్యోగులు. గోపాల్ కి రైట్ హ్యాండ్ అనుకునే వర్ధన్ కాసేపటి మౌనం తరువాత "సర్! హరీష్ గారికి ఉన్న బలాల్నే మనం గమనించాం ఇప్పటివరకూ. బలహీనతల్ని కూడా గమనిస్తే ఆ కంపెనీ ని యెట్లా దెబ్బ కొట్టాలో మనకు ఒక దారి దొరుకుందేమో?" అన్నాడు. నిజమే! ఇప్పటి వరకూ ఆ దిశ లో ఆలోచన చెయ్యలేదు. ఈ మీటింగ్ ని క్లోజ్ చేసేసాడు గోపాల్ ఐడియా దొరకగానే!!

ఆ మరుసటి రోజు ఒక ప్రైవేటు డిటెక్టివ్ ఆఫీసు కి వెళ్ళాడు. ఈ మొత్తం ఆపరేషన్ తనే స్వయం గా పర్యవేక్షించాలనుకున్నాడు గోపాల్. డిటెక్టివ్ చీఫ్ ని కలిశాడు. హరీష్ కంపెనీ డీటెయిల్స్, ఫోటో, కార్ నెంబర్, అడ్రెస్ అన్నీ ఇచ్చి భారీ మొత్తంలోనే ఫీజు ముట్టచెప్పాడు. వాళ్ళ నామ్స్ ప్రకారం 30 రోజుల టైం అడిగారు సరే అన్నాడు. సరిగ్గా ఒక 25 రోజుల తరువాత డిటెక్టివ్ ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది. హరీష్ వేర్ అబౌట్స్ ట్రేస్ చెయ్యమని అసైన్ చేసిన డిటెక్టివ్ "షీలా" ఫోన్ చేసింది. ఈవెనింగ్ 7 గంటలకు నోవోటెల్ హోటల్ లో కలవమని. చెప్పిన టైం కి వెళ్ళాడు గోపాల్. తను తనని పరిచయం చేసుకుని షీలా చెప్పడం ప్రారంభించింది.

సర్! మీరు చెప్పిన హరీష్ తన ఫ్లాట్ లోనే ఉంటారు ఆఫీసు అయిన వెంటనే వెళ్ళిపోతారు. నేను చాలా క్లోజ్ గా గమనించాను. కానీ ప్రతీ శుక్రవారం ఈవెనింగ్ మియాపూర్ లో ఉన్న తన ఫార్మ్ హౌస్ కి వెళ్ళిపోతారు. మళ్ళీ సోమవారం ఉదయమే ఆఫీసు కి డైరెక్ట్ గా వచ్చేస్తారు. ఈ రెండు రోజులూ ఎవరికీ ఫోన్ చెయ్యడం కానీ కలవడం కానీ చెయ్యరు. అర్జెంటు అయితే తన ఆఫీసు లో ఉన్న పర్సనల్ సెక్రటరీ ని అటెండ్ చెయ్యమని చెప్తారు. ఎ రెండు రోజులూ తన ఫార్మ్ హౌస్ లో ఏం చేస్తారో అని క్లోజ్ గా సీక్రెట్ వాచ్ చేశాను. శుక్రవారం తన ఫార్మ్ హౌస్ లోకి వెళ్ళగానే హరీష్ ఇట్లా మారిపోతారు అంటూ కొన్ని ఫోటోలు తీసి గోపాల్ ముందు ఉంచింది. ఆ ఫొటోస్ లో ఎవరో అమ్మాయి చాలా అందంగా ఉంది. పట్టు చీరల్లోనూ, నేత చీరల్లోనూ, పంజాబీ డ్రెస్సెస్ లోనూ, నైటీ లోనూ ఉన్న ఫోటోలు అవి. ఆ ఫోటోలను సరి పోల్చుకుంటే హరీష్ ఒక క్రాస్ డ్రెసర్ అని తెలియగానే షాక్ అయ్యాడు. ఒక బలమైన అస్త్రం దొరికినట్లు అనిపించి రిలాక్స్ అయిపోయాడు. ఎ ఫొటోస్ చూపించిన తరువాత కొన్ని రిసీప్ట్స్ చూపించి ఇవి తన సంపాదనలో చాలా వరకూ అనాధాశ్రమాలకు, ధార్మిక సంస్థలకు ఇచ్చేస్తూ ఉంటాడు అని చెప్పి రిపోర్ట్స్ అన్నీ అందించి సెలవు తీసుకుంది షీలా.

1436 Views 1 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (1)

Meghana
Meghana 3 days, 9 hours ago

Wow..you are truly amazing...chala vivaram ga rasaru..oka andamaina kadhanu chala andam ga kallaku kattinattu chupincharu chelli. Super.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login