Girlfriend · Telugu

ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే

Completed | Part 2 of 6 | 2 Likes

Part 2

ఆ రాత్రి గోపాల్ తన వ్యాపార ప్రత్యర్ధిని యెట్లా బ్లాక్ మెయిల్ చేసి తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలా అని రకరకాలుగా ఆలోచించాడు. ముందుగా హరీష్ తో సామరస్యంగా చర్చలు మొదలుపెట్టి తరువాత మాట వినకపోతే అప్పుడు ఆలోచిద్దాం అని నిర్ణయానికి వచ్చాడు.

మరుసటి ఉదయం హరీష్ కి ఫోన్ చేసాడు. అవతల్నుండి "దిస్ ఈజ్ హరీష్. వాట్ కెన్ ఐ హెల్ప్ యు" అన్నాడు. అందుకు ప్రతిగా "హాయ్ హరీష్! దిస్ ఈజ్ గోపాల్ ఐ వాంట్ తో టాక్ విత్ యు ఆన్ ఏన్ ఇంపార్టెంట్ మేటర్. కెన్ యు గివ్ మీ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ ఏన్ హౌర్. ఇట్ షుడ్ బీ ప్రైవేట్" అన్నాడు. దానికి ప్రతిగా హరీష్ "ష్యూర్ ... ఐ విల్ మీట్ యు దిస్ ఈవెనింగ్ ఎట్ సెవెన్ ఇన్ హోటల్ గోల్కొండ" అన్నాడు. ఫోన్ పెట్టేసిన తరువాత ఏం మాట్లాడుకోవాలో నిర్ణయించుకున్నాడు.

ఈవెనింగ్ సరిగ్గా ఏడింటికి గోల్కొండ హోటల్ కి చేరుకున్నాడు. రెస్టారెంట్ లో ఒక కార్నర్ టేబుల్ వద్ద కూర్చుని ఉన్నాడు హరీష్. గోపాల్ ఇంతకు ముందు హరీష్ ని యెట్లా చూసేవాడో కానీ హరీష్ విషయం తెలిసినవాడిగా హరీష్ లోని ఆడతనాన్ని వెదకడం మొదలుపెట్టాడు. వైట్ షర్టు మీద బ్లాకు కలర్ ప్యాంటు ఇన్ షర్టు చేసుకుని ఉన్నాడు. నున్నగా షేవ్ చేసాడో లేక గడ్డం ఇంకా మొలవలేదో తెలీదు కానీ చాలా స్మార్ట్ గా ఉన్నాడనిపించింది గోపాల్ కి.

అంతలోనే సర్దుకుని "హాయ్ హరీష్! హౌ ఆర్ యూ?" అంటూ బిజినెస్ విషయాలు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ యెట్లా ఉందో కాజుఅల్ గా మాట్లాడుతూ అసలు విషయానికి వచ్చాడు. "హరీష్! ఐ యాం బాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ హెల్ప్. మనం కాంపిటీటివ్ ఫైట్ లో ఉండే కంటే ఫ్రెండ్లీ స్పిరిట్ తో బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. త్వరలో వచ్చే రెండు ప్రాజెక్ట్స్ షేర్ చేసుకుంటే బాగుంటుంది. మై బిజినెస్ ఈజ్ డల్ అండ్ మై ఎంప్లాయిస్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ టూ సూప్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది టెండర్స్ ఆర్ నాట్ కన్ఫార్మ్డ్. ఫర్ దిస్ ఐ వాంట్ తో సౌట్ యువర్ హెల్ప్." అన్నాడు. దానికి హరీష్ "గోపాల్! మనం శత్రువులం కాదు కదా! నా చేతిలో ఇప్పుడు టైం సరిపోనంతగా వర్క్ ఉంది. నాకు ఆ రెండు ప్రాజెక్ట్స్ మీద అంత కాన్సంట్రేషన్ లేదు. ఈ విషయం లో మీకు అడ్డు రాను ..... అవసరమైతే మీకేమన్నా హెల్ప్ కావాలంటే అడగండి ... నేను సిద్ధం" అన్నాడు. కథ ఊహించని మలుపు తిరిగే సరికి గోపాల్ ఆశ్చర్యపోయాడు. థాంక్ యు హరీష్ ... నేను ఊహించని విధంగా నాకు సహాయం చేశావు ..... అంటూ కాసేపు కబుర్లు చెప్పుకుని డిన్నర్ ముగించుకుని హోటల్ నుండి బయలు దేరారు.

ఇంటికి చేరుకున్న గోపాల్ తన బెడ్ రూమ్ లో పడుకున్నాడన్న మాటే కానీ నిద్ర పట్టడం లేదు. తన ఆఫీసు బాగ్ తీసుకుని అందులో ఉన్న షీలా తనకు ఇచ్చిన ఫొటోస్ చూడసాగాడు. హరీష్ లో ఉన్న ఆడతనం ముందు తనిప్పుడు అందరికీ కనిపించే మగతనం బలాదూర్ అనిపించింది. ప్రస్తుతానికి ఆ ఫొటోస్ చూపించి బ్లాక్ మెయిల్ చెయ్యవలసిన అవసరం లేకున్నా ఆ ఫొటోస్ చూస్తుంటే ఏదో తెలియని ఉద్విగ్నత గోపాల్ లో కలుగసాగింది.

అప్పటినుండి పని ఉన్నా లేకున్నా హరీష్ ని కలవడమో లేదా తన ఆఫీసు కి ఇన్వైట్ చెయ్యడమో చేసేవాడు. హరీష్ కూడా కాలక్రమేణా గోపాల్ తో ఫ్రెండ్లీ గా ఉండడం మొదలుపెట్టాడు. హరీష్ తనతో ఎంత ఫ్రెండ్లీ గా ఉన్నా తన వీకెండ్ ప్రోగ్రామ్స్ మార్చుకోకపోవడం గమనించాడు గోపాల్. యెట్లా అయినా తన బలహీనత తనకు తెలుసనే విషయాన్ని హరీష్ కి ప్రూవ్ చెయ్యాలనుకున్నాడు గోపాల్. ఆ వీకెండ్ లో హరీష్ కి తెలియకుండా ఫాలో అయ్యి తన ఫార్మ్ హౌస్ కి ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు.

అయితే అంతకు ముందే హరీష్ ఫార్మ్ హౌస్ కి హరీష్ తో గోపాల్ రావడం వాచ్ మాన్ చాలా సార్లు చూసి ఉండటం తో తన కార్ లో హరీష్ కంటే ముందే వచ్చి డ్రైవర్ ను ఇది చాలా సీక్రెట్ మీటింగ్ కాబట్టి తనను డ్రాప్ చేసిన తరువాత కార్ ను పట్టుకుపోమ్మని చెప్పి కార్ దిగి వాచ్ మాన్ తో "మీ సర్ ఇంకా రాలేదా? వచ్చేస్తానన్నారే?" అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వాచ్ మాన్ కి ఇవేమీ తెలీవు కాబట్టి అయ్యగారి స్నేహితుడే కదా .... ఏదో మీటింగ్ ఉండి ఉంటుంది అనుకున్నాడు. వాడి పని గేటు తియ్యడం వరకే ... వాడు ఇక్కడ పనిలో చేరిన 5 సంవత్సరాల్లో ఒకటో రెండు సార్లో హరీష్ వాడితో మాట్లాడి ఉంటాడు. తనకూ ఫార్మ్ హౌస్ ఉంది కాబట్టి తేలిగ్గా గెస్ చెయ్యగలిగాడు గోపాల్ .... లోపలి ఎంటర్ అయినవెంటనే బెడ్ రూం కి ఆనుకుని ఉన్న గదిలోకి వెళ్లి అక్కడ కూర్చున్నాడు ... అక్కడికి ఫిమేల్ గెటప్ లో రావడం జరగదు ఎందుకంటే అది బాల్కనీ కి జాయింట్ చెయ్యబడి ఉంది కాబట్టి హరీష్ అక్కడికి వచ్చే అవకాశం లేదు. అది ఊహించి జాగ్రత్తగా అక్కడ సెటిల్ అయ్యాడు గోపాల్.

తను లోపలి వచ్చిన కాసేపటికి లోపలికి కార్ వచ్చిన శబ్దం వినపడింది. ఎందుకైనా మంచిదని ఆ గదిలో ఉన్న బెడ్ క్రిందకు దూరి నిరీక్షించసాగాడు గోపాల్. కాసేపటికి ప్రక్కగదిలో అంతగట్టిగా కాకున్నా యేవో శబ్దాలు ..... కాసేపటికి నిశ్శబ్దం... ప్రక్కగదిలో ఏమి జరుగుతోందో ప్రత్యక్షంగా చూడాలని కోరిక .... టెన్షన్ తోనే మంచం క్రిందనుండి బయటకు వచ్చి అక్కడ రెండుగదులకూ మధ్య ఉన్న డోర్ కు ఉన్న చిన్న గ్యాప్ నుండి చూడసాగాడు .... బెడ్ రూమ్ లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్నాడు హరీష్ .... అప్పటికే స్నానం చేసినట్లున్నాడు ఆకుపచ్చ లోపలి లంగా, ఆకుపచ్చ జాకెట్టు ధరించి తలపై హెయిర్ విగ్గు అమర్చుకున్నాడు .... కళ్ళకు కాటుక ... ఆర్టిఫిషియల్ నెయిల్స్ .... కాళ్ళకు పట్టీలు .... చేతులకు బంగారు గాజులు వేసుకుంటున్నాడు .... మెడలో అప్పటికే సన్నపాటి గోల్డ్ చెయిన్.... ఎందుకో కానీ ప్రక్కకు తిరిగాడు హరీష్ ... అప్పుడు కనిపించింది హరీష్ ధరించిన ఆడతనం అందం యొక్క అద్భుతం ..... గోపాల్ అయితే స్థాణువులా నిలబడిపోయి చూడసాగాడు ..... పెదవులకు లిప్స్టిక్ తో అచ్చం తెలుగు హీరోయిన్ "అంజలి" లా ఉన్నాడు ... తన ప్రతిబింబాన్ని అద్దంలో తనివి తీరా చూసుకుని అంతా బాగుంది అనుకున్నాడేమో .... లేచి నిలబడి ప్రక్కన బెడ్ మీద ఉన్న ఆకుపచ్చ రంగు గద్వాల్ చీర అందుకుని కట్టుకోసాగాడు . అతను చీరను కట్టుకునే విధానం చూస్తూ ఉంటే అసలు ఆడవాళ్ళు ఎందుకూ పనికిరారు అనిపించింది. అతను చీర కట్టుకున్నాక చూస్తే అసలు తను హరీషేనా ... తను పొరబడ్డాడా అనిపించింది ఒక్క క్షణం గోపాల్ కి. అట్లాగే చూస్తూ ఉన్నాడు ..... కాసేపటికి చీరలో ఉన్న హరీష్ అటూ ఇటూ నడిచిన తరువాత ప్రక్కనే ఉన్న టేబుల్ మీదనుండి "మల్లెపూల దండ" తీసుకుని జడలో అమర్చుకుంటున్నాడు.... తను పూలు పెట్టుకునే విధానం చూస్తే తెలుస్తోంది తనకు ఈ క్రాస్ డ్రెస్సింగ్ ఎంత సుపరిచితమో!

హరీష్ ఇంతకీ ఈ అమ్మాయిని ఫొటోస్ తీయాలన్న మాట! అంటూ గోపాల్ తన దగ్గర ఉన్న ఆపిల్ ఐ ఫోన్ నుండి కొన్ని ఫొటోస్ తీసి హరీష్ కి చూపించాడు. తన ఫొటోస్ చూసుకుని తనలో తానే ఎంతో మురిసిపోతున్న హరీష్ ను చూసి గోపాల్ "ఈ రెండు రోజులూ నేను కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ .... ఈ అమ్మాయితో గడిపేస్తాను .... కెన్ యూ పర్మిట్ మీ టు టేక్ యువర్ ఫొటోస్ మై ప్రిన్సెస్?" అంటూ ఇంగ్లీష్ దొరలా హరీష్ ముందు మోకరిల్లిన భంగిమలో చూసిన హరీష్ కి నవ్వాగలేదు.

గోపాల్, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ ... ఐ ఆమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టూ యూ .... ఈ రెండు రోజులూ నాకు తోడుగా నా అభిరుచిని ... ఇష్టాన్ని గౌరవిస్తూ నాకు తోడు గా ఉంటా అంటూ నువ్వు ముందుకొస్తే నేను నిన్ను కాదనగలనా! అన్నాడు హరీష్.

1427 Views 1 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (1)

Meghana
Meghana 3 days, 8 hours ago

Wow..you are truly amazing...chala vivaram ga rasaru..oka andamaina kadhanu chala andam ga kallaku kattinattu chupincharu chelli. Super.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login