Girlfriend · Telugu

ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే

Completed | Part 3 of 6 | 2 Likes

Part 3

సరే కానీ నీ శారీ తోనే కడుపు నింపేటట్లున్నావు ... ఆకలివేస్తోంది హరితా అన్నాడు గోపాల్. తన పేరును మార్చి పిలిచిన విషయాన్ని గమనించినా గమనించనట్లు "ఓకే గోపాల్ ... నీకు నేనే నా చేతులతో వండి వడ్డిస్తాను. ప్లీజ్ వెయిట్ ఫర్ 30 మినిట్స్" అంటూ ప్రక్కన ఉన్న కిచెన్ లోకి వెళ్లి కాసేపట్లోనే "గోపాల్! ప్లీజ్ కం ఫర్ డిన్నర్" అంటూ పిలిచాడు.

ఈలోపులో గోపాల్ తన డ్రెస్ మార్చుకుని నైట్ డ్రెస్ లో డైనింగ్ రూంలోకి వచ్చాడు. హరీష్ తన చేతులతోనే వడ్డించి గోపాల్ ముందు చైర్లో కూర్చొని తన తోనే డిన్నర్ పూర్తి చేశాడు.

గోపాల్ తో హరీష్ నా బెడ్ రూంలో సెపెరేట్ కాట్స్ ఉన్నాయి ... నో నీడ్ టు స్లీప్ ఇన్ అథర్ బెడ్ రూమ్ .... నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను ... ఈ సిల్క్ శారీ నిద్రపోయేటప్పుడు సౌకర్యంగా ఉండదు అంటూ తన రూంలోకి వెళ్లి కాసేపటికి స్వచ్ఛమైన పాల తెలుపు రంగు కాటన్ చీరలో ముస్తాబై, జడలో మల్లెపూలు తురుముకొని వచ్చిన హరీష్ ను చూస్తూ హరీష్ లో ఉన్న స్త్రీత్వానికి ముగ్ధుడైపోయి నోరు తెరచుకుని ఉండిపోయాడు గోపాల్. అట్లా ఉండిపోయిన గోపాల్ని తన గాజుల శబ్దంతో ఈ లోకంలోకి తెచ్చిన హరీష్ "కెన్ యూ కాప్చర్ మై పిక్స్ .... ఇట్ ఇస్ బెటర్ వుయ్ మే గో ఆన్ టూ ది టెర్రేస్ ఫర్ ది మూన్ లైట్" అంటూ పైకి దారితీసాడు. హరీష్ వెనుకే వెళ్లిన గోపాల్ ముందు నడుస్తున్న హరీష్ కదులుతున్న నడుము ఆ నడుముపైన పారాడుతున్న జడకుచ్చులను చూస్తూ మైమరచిపోయాడు.

పైకి వెళ్లిన తరువాత చూస్తే పున్నమి వెన్నెల వెలుగులో మరింత అందంగా కనిపించసాగాడు హరీష్ తెల్లని చీరలో రతీదేవిలా. మౌనంగానే హరీష్ లోని స్త్రీత్వాన్ని ఆస్వాదిస్తూ వివిధ భంగిమల్లో హరీష్ ఆడతనాన్ని ఫొటోస్ లో బంధించాడు గోపాల్.

ఫోటోల కార్యక్రమం అయిపోయిన తరువాత తానే మాట్లాడుతున్నాను ... గోపాల్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం గమనించి హరీష్ "గోపాల్ సడన్ గా మౌనవ్రతం ఏమైనా చేపట్టావా ఏమిటీ" అంటూ అడగడంతో గోపాల్ నవ్వుతూ తల ఆడిస్తూ "ఎంతోమంది ఆడపిల్లలను చూసాను కానీ నిన్ను చీరలో చూస్తూ ఉంటే .... ఏదో ఉద్రేకమో ఉద్వేగమో తెలియని ఫీలింగ్స్ తో మాట పడిపోయింది .... ప్లీజ్ డోన్'ట్ థింక్ ఆస్ ఐ యాం టేకింగ్ అడ్వాంటేజ్ .... ఐ యాం టెల్లింగ్ ఫ్రాంక్లీ" అన్నాడు.

దానికి హరీష్ చేతులు జోడిస్తూ "నన్ను మునగ చెట్టు ఎక్కించకండి మాస్టారూ" అంటూ నవ్వేశాడు. సరేకానీ నిద్ర వస్తోంది క్రిందికి వెళదామా అంటూ క్రిందికి వెళ్లిన తరువాత బెడ్ రూమ్ లో తాను ఒక మంచం మీద పడుకొని వేరొక మంచాన్ని గోపాల్కి చూపించాడు హరీష్ . ఆ మంచం మీద పడుకున్నాడన్న మాటే కానీ హరీష్ వైపే చూస్తున్నాడు గోపాల్ .... బెడ్ లైట్ వెలుగులో ఆడతనం నింపిన అందాలతో తెల్ల చీరలో హుందాగా ఎంతో గ్రేషియస్ గా కనపడుతున్న హరీష్ ని తన మొబైల్ కెమెరాలో బంధించాడు గోపాల్.

ఆ వెన్నెల రాత్రిలో చీరలో తన అందాల్ని ఒలకబోస్తూ నిద్రపోతున్న హరీష్ ను చూస్తూనే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియని గోపాల్ నిద్రనుండి మేలుకొని సరికి ఉదయం 10గంటలు కావస్తోంది. ప్రక్క బెడ్ మీద చూసేసరికి హరీష్ కనపడలేదు. లేచి తన కాలకృత్యాలు తీర్చుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి హరీష్ "గుడ్ మార్నింగ్" అంటూ పలకరిస్తూ లోపలి వచ్చాడు.

అప్పటికే తాను స్నానం చేసి మెరూన్ కలర్ పూవులా డిజైన్ ఉన్న చీరను కట్టుకుని చేతిలో కాఫీ కప్స్ ట్రే లో పెట్టుకుని లోపలి వస్తున్నాడు. హరీష్ ను చీరలో చూస్తున్న గోపాల్ కి మనసులో ఏదో ఆలోచన! అవేమీ బయట పెట్టకుండా గుడ్ మార్నింగ్ అంటూ పలకరించి తానూ ఒక కాఫీ కప్ అందుకుని కాఫీ త్రాగుతూ "నైట్ కొంచెం లేట్ గా నిద్ర పట్టింది ..... అందుకే ఈ లేట్ అవేకెనింగ్ " అంటూ నవ్వుతూ "సరే ఈ ముగ్ధమనోహర యవ్వనవతిని ఫొటోస్ తీసి నీకు చూపిస్తా ఉండు" అంటూ తన మొబైల్ ఫోన్ అందుకుని మెరూన్ చీరలో మెరిసిపోతున్న హరీష్ ను కొన్ని ఫొటోస్ తీశాడు. గోపాల్ తీసిన పిక్స్ చూసి తనలో తానే మురిసిపోతూ "థాంక్ యూ గోపాల్ .... యు డిజర్వ్డ్ టు బె మై ఫ్రెండ్ .... హోప్ ఔర్ రిలేషన్ కంటిన్యూస్ లైక్ దిస్" అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు హరీష్.

"ష్యూర్ ... యు విల్ నెవెర్ డిసప్పోయింటెడ్ విత్ మై రిలేషన్ .... యు విల్ బి హ్యాపీ ఫరెవర్ విత్ మీ " అంటూ "మరి ఈ హ్యాపీ మూమెంట్ లో సెలబ్రేషన్ లేదా?" అంటూ గోపాల్ అడిగేసరికి "నీకేమి కావాలో చెప్పు ఈ నీ గర్ల్ ఫ్రెండ్ క్షణాల్లో అరేంజ్ చేస్తుంది "అంటూ ఉత్సవాహం గా హరీష్ అడిగేసరికి గోపాల్ ప్రతిగా ఆఫ్టర్ నూన్ కి కామన్ ఫుడ్ ఏమైనా చెయ్యి .... నైట్ మాత్రం నేను నీకు సర్ప్రైస్ గిఫ్ట్ ఇస్తా అంటూ "లంచ్ తరువాత కొంచెం బయటకు వెళ్లి వస్తా .... నాకు చిన్న చిన్న పనులున్నాయి" అన్నాడు.

ఇట్స్ ఓకే అంటూ హరీష్ క్షణాల్లో లంచ్ ప్రిపేర్ చేసేసాడు.... భోజనం చేస్తూ గోపాల్ "రేపు నీకు ఆఫీస్ ఉందా ... శ్రీరామ నవమి కదా హాలిడే డిక్లేర్ చేసావా ... నేను రేపు ఫ్రీ మా ఆఫీస్ కి సెలవు" అంటే అందుకు హరీష్ "నేను ఇంకో మూడు రోజులవరకు ఆఫీస్ చూసే పని లేదు ... బయటకు వెళ్తున్నా అని చెప్పి ... మా మేనేజర్ కి పనులన్నీ అసైన్ చేసేసాను" అన్నాడు. భోజన ఐన తరువాత హరీష్ "గోపాల్! నా కార్ వేసుకు వెళ్ళు.... ఎట్లాగూ నువ్వు కార్ లో రాలేదు గా. త్వరగా వచ్చెయ్యి ... వుయ్ విల్ హావ్ లాట్ ఆఫ్ ఫన్" అన్నాడు.

"ష్యూర్ ... మై లేడీ" అంటూ హరీష్ బుగ్గ మీద చిటికె వేస్తూ బయటకు వెళ్లిన గోపాల్ సరిగ్గా సాయంత్రం 8గంటలు అవుతుండగా వచ్చాడు. ఈ లోపు హరీష్ ఈవెనింగ్ డిన్నర్ ప్రిపేర్ చేసి స్నానం చేసి తనకిష్టమైన క్రీం కలర్ పూల డిజైన్ కాటన్ చీరలో సింగారించుకుని జడలో పూలు పెట్టుకుని గోపాల్ కోసం ఎదురు చూస్తున్నాడు.

తన దగ్గరున్న స్పేర్ కీ తో డోర్ తీసుకుని లోపలి వస్తున్న గోపాల్ ని చూసిన హరీష్ కి గోపాల్ చేతిలో రెండు సూట్కేస్ లతో రావడం గమనించాడు. తన డ్రెస్సెస్ అండ్ ఫైల్స్ ఏమో అనుకున్నాడు. లోపలి వచ్చిన గోపాల్ సరాసరి బాత్రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయిపోయి పైజామా లాల్చీ వేసుకుని హరితా! డిన్నర్ కి వెళ్దామా? అని అడుగుతూ డైనింగ్ రూమ్ లోకి దారి తీసాడు. ఓకే అంటూ హరీష్ కూడా తన వెనుకే వెళ్లి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ముగించారు. ఇంతలో ఒక ఫోన్ వచ్చింది గోపాల్ కి. అది అటెండ్ అయ్యి "సరే వాచ్ మాన్ కి కీ ఇచ్చి వెళ్ళు ... నేను కలెక్ట్ చేసుకుంటా మార్నింగ్" అన్నాడు.

ఇదంతా వింటున్న హరీష్ రేపేమైనా ప్రోగ్రాము ఉందా నీకు .... కార్ రప్పించుకున్నావు అని అడిగాడు. అందుకు సమాధానమిస్తూ "ఈ మూడు రోజులూ నీతోనే ..... కానీ రేపు నీకు ఒక సర్ప్రైజ్ .... నా మీద నమ్మకముంటే ఏమీ ఎదురు చెప్పకుండా నాతో రా ...." అన్నాడు గోపాల్.

ఓకే బాబా .... సరే కానీ నేను ఈ మూడు రోజులకూ చాలా ప్లాన్ చేసుకున్నా ..... సరే ఏమి చేస్తాం .... నా బాయ్ ఫ్రెండ్ యెట్లా చెబితే అట్లా అన్నాడు హరీష్.

1426 Views 1 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (1)

Meghana
Meghana 3 days, 8 hours ago

Wow..you are truly amazing...chala vivaram ga rasaru..oka andamaina kadhanu chala andam ga kallaku kattinattu chupincharu chelli. Super.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login