కొన్ని మార్పులు బయటివాళ్లు బలవంతంగా చేయిస్తారు.
కొన్ని మార్పులు కాలం నేర్పిస్తుంది.
మరికొన్ని మార్పులు ఇంట్లో ప్రేమించేవాళ్లే—అజ్ఞానంతో, భయంతో, ఉపాయమని పెట్టిన చిన్న ఆటలతో—మనిషి మనసులో నెమ్మదిగా నాటేస్తారు.
రమణ కథ అలాంటిది.
రమణ సహజంగా మృదువైన మనిషి. మాటలు తక్కువ. పనులు ఎక్కువ. ఎవరికీ ఎదురు మాట్లాడని స్వభావం. చిన్నప్పటి నుంచే ఇంటిపనులు, వంట, పూజా ఏర్పాట్లు, అతిథి మర్యాదలు—ఏ పనైనా నేర్చుకున్నాడు. అతని తల్లి అనారోగ్యంగా ఉండేది. అక్క చదువుల్లో బిజీగా ఉండేది. ఇంట్లో ఎవరికైనా కాఫీ కావాలంటే రమణ. పప్పు ఉడకలేదంటే రమణ. పండుగకు పాయసం కావాలంటే రమణ.
“మా రమణ అమ్మాయిగా పుట్టి ఉండాల్సింది,” అని పెద్దలు సరదాగా అనేవారు.
రమణ నవ్వేసేవాడు.
అతనికి ఆ మాటలో అవమానంగా వినిపించేది కాదు.
పనిలో తనకు సౌఖ్యం ఉండేది.
పెళ్లి వయసు వచ్చేసరికి రమణకి ఇందిరతో పెళ్లి కుదిరింది. ఇందిర మంచి కుటుంబం అమ్మాయి. చదువు ఉంది. అందం ఉంది. కానీ ఆమె మీద ఆమె నాయనమ్మ ప్రభావం చాలా ఎక్కువ. నాయనమ్మ పాతకాలపు ఆడది. పెళ్లి అంటే ఆమెకు ప్రేమ కాదు—శిక్షణ. కాపురం అంటే సమీపం కాదు—పరీక్ష.
పెళ్లికి ముందే నాయనమ్మ ఇందిరకి ఎన్నో ఉపదేశాలు చేసింది.
“"ఒసేవ్ ఇందు! రేపు నీకు పెళ్ళి అయ్యాక మొగుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మోజు తీర్చేస్తే నాలుగేళ్ళకే నువ్వంటే మొహం మొత్తేంస్తుంది నీ మొగుడుకి. స్త్రీ అంటే ఆదిశక్తి. స్త్రీ అంటే సృష్టి మూలం. ఆ విషయం మొగుడికి తెలియజెప్పాల్సింది మనమే. నేను చూడు. మీ తాతయ్యని ఎలాగుప్పిట్లో పెట్టుకున్నానో!?" అంటూ ఇందిర పదవ ఏటనుంచీ నూరి పోసింది నాయనమ్మ. ఇక్కడ రహస్యం ఏమిటంటే తాతయ్య డెభ్భై ఏళ్ళు దాటాక నాయనమ్మ మాట వింటున్నాడు. ఆయన అరవైల్లో వింటున్నట్టు నటించేవాడు. కానీ ఆవిడ ఇందిరకి చిన్నప్పటి నుంచి పెడబుద్ధులు నేర్పింది. ఇందిర చదువుకున్నా నాయనమ్మనే నమ్మింది కానీ తన చదువును నమ్మలేదు. ఎమ్మెస్సీ అయ్యాకా మాత్రం పెళ్ళికి ముందు ఒక ప్రశ్న వేసింది. "ఒక వేళ మనకి కోరిక పుడితే ఏంచెయ్యాలి నానమ్మా?" అని. "ఓసి మొద్దు! అందుకే ఈ అనాచారపు చదువులు చదివితే ఏంరాదనేది. బక్కెట్ చన్నీళ్ళు నెత్తిన గుమ్మరించుకో. ఇంక ఏ కోరిక పుట్టదు."అంది నాయనమ్మ. మాటలు ఆమెకు వేదమయ్యాయి.
ఇందిరకు అప్పుడు అవి జాగ్రత్తలుగా అనిపించాయి. కానీ అవే తరువాత రమణ జీవితంలో విచిత్రమైన విత్తనాలయ్యాయి.
పెళ్లి అయింది. ఇంట్లో అందరూ సంతోషించారు. రమణ ప్రేమతో దగ్గర కావాలనుకున్నాడు. కానీ ఇందిర కొంచెం చల్లగా ఉండేది. తాను నవ్వాలని అనిపించిన చోట కూడా గంభీరంగా ఉండేది. రమణ ఏదైనా మృదువుగా మాట్లాడితే, “ఇప్పుడే అంత చనువు ఎందుకు?” అని వెనక్కి జరుగు తుండేది.
పెళ్ళయిన నాటినుంచే భర్తని (రమణని) దూరం పెట్టేసింది. మొదట్లో సిగ్గనుకున్నాడు. తరువాత ఆచారం అనుకున్నాడు. కొన్నాళ్ళకు అలసట అనుకున్నాడు. ఇలా అనుకుని అనుకుని తాను అలిసిపోయాడు. ఆడవాళ్ళ కష్టాలు, ఇష్టాలు మీకేం తెలుసు? ఆడదాని కష్టం ఆడది గా పుడితే కానీ తెలియదు. అంటూ నాయనమ్మ మాటలకు యమ్మెస్సీ విజ్ఞానం జోడించి లెక్చర్లు దంచేది. ఇందిర చన్నీళ్ళును ఇష్టపడినట్లు రమణని ఇష్టపడేది కాదు. ఎప్పుడూ ఆడదైతే కానీ ఆడదాని విలువ తెలీదు. అన్నమాటలు చెవుల్లో గింగురుమనేవి. పరాయి ఆడపిల్లలు అంటే అక్కాచెల్లెళ్ళు అని నేర్పిన కుటుంబం నుంచి వచ్చాడు రమణ. అందుకని తన సుఖాన్ని బయట వెతుక్కోలేదు.
ఒకరోజు తన అక్క దగ్గరికి వెళ్లాడు.
విషయం అక్కకి చెప్పాడు. అక్క వేరు కాపురం పెట్టరా. ఇద్దరే ఏకాంతంలో ఉంటే ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా ఉపయోగం ఉండొచ్చు.అంది.
ఆ ప్లాను కూడా ఫలించలేదు. నాయనమ్మ ఫోన్ లోనే ఏంచెయ్యాలో చెప్పేది.
"ఒరేయ్ తమ్ముడూ! ఆడదాని కష్టం ఆడదానికే తెలుస్తుంది. అంది కదా! బజారుకు పద. అని తీసుకుని వెళ్ళి రెండు చుడీ దార్ లు, రెండు చీర, రవిక సెట్లు రమణ సైజ్ కి సరిపోయేలా కొనిపించి ఒక సెలవు రోజున ఇవి కట్టుకుని సర్ప్రైజ్ చేసి చూడు. అంది.
అక్క మాటని అమలు చేసాడు రమణ. వెంటనే కంగారు పడిన ఇందిర నాయనమ్మకి ఫోన్ చేసింది.
Discussion (0)