Family · Telugu

సంపెంగ తీగ - పాముల పాగా

సంపెంగ తీగ - పాముల పాగా Cover Image
Completed | Part 3 of 3 | 0 Likes

Part 3

Part 3 Image

నేనొక నర్తకిని గాయకురాలిని కూడా. అందుకని నా విషాద భరిత సంతృప్త జీవితాన్ని ఒక పాటగా మలిచాను. నేను ఎప్పుడూ పాడుకునే పాట ఇది.
నేనొక సంపెంగ తీగ
వచ్చెపోయె నాగుల పాగ
ఒకటే సంపెంగ పువ్వు
కాలమెంతైన ఒకటే గంధం

చిన్ననాట ఇష్టపడె బురదగొడ్డులు
వయసులోన ఇష్టపడే కోడె నాగులు
నన్ను చుట్టుకుంటు వచ్చె నోయ్ పెద్ద త్రాచు
తీగె నంత మ్రింగ వచ్చె అనకొండలు

ప్రక్క ప్రక్క రాసుకుంటు కట్లపాములు
చూసి పడగలెత్తలేని వెర్రిపాములు
పాములు కానీ పాములు వానపాములు
తీగె మొదట వాసమెట్టె వాలుదామని

నేనొక సంపెంగ తీగ
వచ్చెపోయె నాగుల పాగ

రెండు తలల పాములొచ్చె
ఎగప్రాకి దిగబ్రాక
రక్తపింజరాలు కూడ విడిచిపెట్టక
కనబడకుండా లోపల నక్కి దాగె

బాటకు ప్రక్కన బండలమాటున
తీగెను మ్రింగె కొండచిలువలు
పట్టు వదలనివి చుట్టు కున్నవి
గట్టిగ పట్టి చుట్టు ముట్టినవి

నేనొక సంపెంగ తీగ
వచ్చెపోయె నాగుల పాగ

కొన్ని పాములు కసిగ కాటేసేవి
కొన్నేమో సత్తు లేక బుసకొట్టేవి
కొన్ని పువ్వు లోన విషము గ్రక్కిపోయినవి
కొన్ని చూడ ఎప్పటికీ లేవలేనివి

ఎనబై ఏండ్లలోన ఎన్నింటినొ చూసినాను
నీతిలేని పాములను తిట్టిపోసినాను నేను
నీటిపాములూ వచ్చె మెట్ట మీద గిట్టిపోయె
బలమున్న పాములకు లొంగి కృంగిపోయినాను

నేనొక సంపెంగ తీగ
వచ్చెపోయె నాగుల పాగ
ఒకటే సంపెంగ పువ్వు
కాలమెంతైన ఒకటే గంధం

నాకు జన్మతో వచ్చిన దేహంలో నా ఆత్మ ఇమడలేదు. ఎంతో పోరాడింది. ఆ పోరాటంలో ఉన్న ఆరాటం మళ్ళీ నాలాంటి వాళ్ళకే అర్థం అవుతుంది. వాళ్ళు వాళ్ళు గా బ్రతకలేక ఒడిపోయేవారు కొందరు. రాజీ పడే వారు కొందరు. ఏకాంతంలో తాముగా, పదిమందిలో తమకు ఇష్టం లేని శరీరంలో జీవించే వారు కొందరు. కానీ నేను గెలిచాను. కేవలం మా అత్త ఇచ్చిన బలం వల్ల. అత్త ఇచ్చిన ఆశ్రయం వల్ల. అత్త నేర్పిన జీవిత పాఠాల వల్ల. అత్త మలిచిన శిల్పాన్ని నేను. ఆడంగి కూడా ఆడపిల్లే అన్న అత్త మాట ప్రపంచం అంతా ఒప్పుకోవాల్సిన మాట. ఆరోజు రావాలని కోరుకుంటున్నాను. అలాగే బాధ ఎందుకు అంటే సమాజంలో చీర చూస్తే చాలు, ఆడతనం ఉందంటే చాలు వదిలి పెట్టని మగ పాములు. అలా బహు సర్ప దష్టను నేను. నన్ను వాళ్ళు కాటువేసినందుకు కాదు. వాళ్ళ కాటు వేసే ఆ దౌర్బల్యానికి. మగ ప్రపంచం ఈ ధోరణి నుంచి బయట పడాలి. అదే నా కోరిక

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

175 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login