Ratnesh: "నేను ఇంకా మార్కోవచ్చా, సాధారణ డ్రెస్ లోకి?"
Prabha: "హా మారుకో...థాంక్స్ నా మాట వినీ నిన్న నించీ చీరలోనే ఉన్నావు."
కొన్ని రోజులు గడిచాయి... రెగ్యులర్ వర్క్ తో అందరం బిజీగా ఉన్నాం.
ప్రియ తన పెళ్లి ఆహ్వానం అందరికీ ఇచ్చింది. నాకూ ఇచ్చింది. ఆహ్వాన పత్రం మీద Mrs. Ratna and Mrs. Prabha అని రాసి ఉంది.
Ratnesh: "ఇది ఏమిటి Mrs. Ratna అని రాసావు?"
Priya:"నీనేవరు రా నన్ను పెళ్లికి పిలవడానికి. రత్నా మరియు ప్రభ తప్పకుండా రావాలి. మంచి చీరలు కట్టుకొని రావాలి. అంతేకాక నా పెళ్లికి మేల్ స్టాఫ్ ని పిలవడం లేదు."
Ratnesh: "చూడాలి మరి."
పెళ్లి షాపింగ్ కోసం ప్రియతో నేను మరియు ప్రభ వెళ్లాం. వాళ్లు చీరలు చూసుకుంటుంటే, నేను మొబైల్ లో ఇన్‌స్టాగ్రామ్ చూస్తూ కూర్చున్నా.
Priya:"రత్నా, ఈ చీర ఎలా ఉంది చూడూ."
Ratnesh: "బానే ఉంది."
Prabha: "ప్రియ, రత్నాకు ఈ చీర బాగా నచ్చింది, తను అదే కట్టుకుంటానంటుంది."
Ratnesh: "ఏంటి, నేను ఎప్పుడన్నా!"
షాపింగ్ అయిపోయిన తర్వాత... టైలర్ దగ్గరికి వెళ్లి మేజర్‌మెంట్స్ ఇచ్చాం. ఒకటికి బ్లౌజ్ కుట్టాలని అన్నారు. నేను సిగ్గుతో కాస్త అటు ఇటు అయ్యా.
టైలర్ మేజర్‌మెంట్స్ తీసుకున్నాడు. మిగతా కావాల్సిన అన్ని యాక్సెసరీస్ తీసుకుని, అక్కడి నుండి ఇంటికి వెళ్ళే ముందుగా హోటల్‌లో డిన్నర్ చేశాం.
ఇంతలో ప్రియ పెళ్లి రోజు వచ్చింది.
Prabha: "రత్నా, నీ ఫ్రెండ్ ప్రియకి ఇచ్చిన మాట గుర్తుందిగా."
Ratnesh: "హ్మ్...కానీ బాగా చేయగలమో తెలియదూ."
Prabha: "బాగానే అవుతుంది, కానీ కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ ఉంటే ఇంకా బావుంటుంది."
నన్ను పార్లర్‌కు తీసుకెళ్లింది. అక్కడ ప్రభా బ్యూటీషియన్‌కి ఏదో చెప్పింది.
బ్యూటీషియన్ నన్ను ఒక రూమ్‌లోకి తీసుకెళ్లి బట్టలు మార్చుకోవమంది. నేను నా బాక్సర్‌లో ఉన్నా. ఇద్దరు అమ్మాయిలు నా ఫుల్ బాడీకి వ్యాక్సింగ్ చేశారు. ఓ అమ్మాయి నా రెండూ చెవులకు పియర్సింగ్ చేసింది. నేను నా ఫ్రెండ్‌కు ఇచ్చిన మాట కోసం నొప్పి భరించాను.
నాకు హెయిర్ స్ట్రైటెనింగ్ చేశారు, ఎక్స్‌టెన్షన్స్ వేశారు, చాలా అందంగా జడ కట్టారు. నా ఫేస్‌కు కూడా వ్యాక్సింగ్ చేశారు, నా చర్మం చాలా స్మూత్‌గా అయింది. తర్వాత నాకు చీర కట్టడం మొదలు పెట్టారు. నేను వేసుకున్న బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. నాకు మేకప్ వేశారు. అంతా జరుగుతుండగా ప్రభా రెడీ అయ్యి వచ్చింది. నన్ను చూసి ఆశ్చర్యపోయింది. నేను కూడా అద్దంలో చూసుకుని ఆశ్చర్యపోయాను. చాలా అందంగా ఉన్నాను.
గిఫ్ట్ కొనడానికి గిఫ్ట్ షాప్‌కి వెళ్లాం. అక్కడ గిఫ్ట్ కొనగానే గిఫ్ట్ షాప్ లో సేల్స్ గాళ్ ప్రభాను అడిగింది.
Sales Girl: "మేడం, మీతో వచ్చిన అమ్మాయి పెళ్లి కూతురు అన్నట్టు ఉంది. చాలా అందంగా ఉన్నారు. దృష్టి చుక్క పెట్టండి."
Prabha: "లేదు, మేమిద్దరం కలసి ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాం అంతే."
ప్రియ పెళ్లి ఫంక్షన్‌కి వెళ్లాం. రిసెప్షన్‌లో గిఫ్ట్ ఇవ్వడానికి స్టేజ్ మీదికి వెళ్లాం. అక్కడ మా కాలీగ్స్ కూడా వచ్చారు. నేను కొంచెం సిగ్గు ఫీల్ అయ్యాను. ప్రియ మా అందరినీ తన హజ్బండ్‌కు పరిచయం చేసింది.
"రత్నా, ఇది రా" అని పిలిచింది. అందరూ ఒక్కసారిగా నన్నే చూసారు. తన భర్తకి నన్ను "నా బెస్ట్ ఫ్రెండ్" అని పరిచయం చేసింది. స్టేజ్ మీద నుంచి కిందికి దిగగానే నా కాలీగ్ సంద్య నా దగ్గరకు వచ్చి...
Sandhya: "ఎంత అందంగా ఉన్నావ్ రత్నేష్...సారీ రత్నా. ప్రియ నువ్వు మా లాగే ఉన్నావంటే అర్థం కాలేదు, ఈ రోజు అర్థమైంది. చాలా బాగా ఉన్నావ్," అన్నది.
అంతలో మిగతా మహిళా స్టాఫ్ కూడా వచ్చి నా అందాన్ని మెచ్చుకున్నారు.
నేను వారికి నా భార్య ప్రభాను పరిచయం చేశాను. అందరం ఆనందంగా పెళ్లి భోజనం చేసి, కొంతమంది సెల్ఫీలు తీసుకుని ఆ సాయంత్రం చాలా ఎంజాయ్ చేసాము.
ఇంటికి అలసిపోయి తిరిగి వచ్చాము. ప్రభ ఎంతో ప్రేమగా ముద్దు ఇచ్చింది. ఆ రోజు నుంచి మా జీవితంలో రత్నా, ప్రభాకు ఎప్పుడు కావాలంటే అప్పుడే రావడం మొదలైంది. రత్నా మా ఇద్దరినీ మరింత దగ్గర చేసింది.
P.S: This story is a joint writing effort by Genderless and Meghana Dixit.