Lucky Charm

Genderless

  | December 06, 2024


Completed |   3 | 3 |   2780

Part 16

Ratnesh:"అవును ప్రియ, మొన్న వీకెండ్ మా ఇంటికి డిన్నర్ కి పిలిచాం కదా, ఎందుకు రాలేదవు?"

Priya:"అవునా, మర్చిపోయాను...సారీ."

Ratnesh:"ప్రభా చాల సార్లు అనుకుంది."

Priya:"నా దగ్గర నీ వైఫ్ ప్రభా నంబర్ లేదు...ఒక్కసారి నీ ఫోన్ లో డయల్ చేసి ఇవ్వు, మాట్లాడతా."

Ratnesh:"ఇదిగో, డయల్ చేశా." ప్రియ వెంటనే ఫోన్ తీసుకుని బయటకి వెళ్లింది.

Prabha: "హై డార్లింగ్...ఏంటి ఈ రోజు వర్క్ మధ్యలో తలుచుకున్నావ్, అంతగా గుర్తొస్తున్నానా?"

Priya:"హలో ప్రభా, నేను ప్రియని...సారీ, రత్న ని ఫోన్ చేసి మీతో మాట్లాడాలని. మొన్న పీరియడ్స్ వచ్చి, అసౌకర్యంగా ఉండి రాలేకపోయాను. ఈ వీకెండ్ మా ఊరు వెళ్తున్నా...నాకు పెళ్ళిచూపులు ఉన్నాయి. ఆ పై వీకెండ్ తప్పక వస్తా."

Prabha: "ఓ సూపర్...అయితే పెళ్ళిచూపులు అయ్యాక ఆ విశేషాలు కూడా మీరు చెప్పచ్చు మనం కలిసినప్పుడు. ఇంతకి మీకేం ఇష్టం చెప్పండి, అవి చేస్తా."

Priya:"ప్రభా, ఏం స్పెషల్స్ అవసరం లేదు...ఏమైనా నాకు ఓకే. ఒక చిన్న రిక్వెస్ట్, అది మీరు అన్నట్టుగా గర్ల్స్ నైట్ అయిలా ప్లాన్ చేయండి."

Prabha: "ఓకే, అర్థం అయ్యింది...ష్యూర్, అలాగే చేద్దాం."

Priya:"ఓకే, బై ప్రభా."

Prabha: "బై."

Ratnesh:"ఫోన్ అయిందా... ఏమంటుంది ప్రభా?"

Priya:"గర్ల్స్ టాక్...చెప్పకూడదు...హె హే."

ఆ రోజు బానే అయింది...ఈవెనింగ్ ఇంటికి వచ్చా.

Part 17

Prabha: "హే రత్నా...ఈ రోజు ఎలా జరిగింది?"

Ratnesh: "ఏంటి ఆ కొత్త పిలుపు...రత్నా అని పిలుస్తున్నావ్."

Prabha: "ఓహ్, నేను పిలిస్తే నచ్చదా బేబీకి...మీ ప్రియ పిలిస్తే సరేనా?"

Ratnesh: "అబ్బా, మొదలు పెట్టావ్...సరే, నేను ఫ్రెష్ అయి వస్తా." ఆ రోజు డిన్నర్ చేసి, టీవీలో జబర్దస్త్ చూస్తున్నాం.

Prabha: "అవును బేబీ, నువ్వు బ్రా మరియు పాంటీ వేసుకుంటే ఇంత లక్ కలుస్తుందంటే, ఒక్కసారి చీరా ట్రై చేయి...ఏం అవుతుందో చూద్దాం."

Ratnesh: "అంతా లేదురా...అలాంటి దేమైనా లేకపోతే అసలు పెట్టుకోకు."

Prabha: "సరే మరి నీ ఇష్టం..."

అలా రెండు వారాలు గడిచాయి...ప్రియ తన పెళ్లి చూపులకు ఊరు వెళ్లింది, వీకెండ్ కల్లా సిటీకి వస్తానంది. నాకు పని బోరింగ్‌గా ఉంది...అప్పుడప్పుడూ లంచ్ టైంలో ఆ లేడీస్ రూమ్‌లో సోడి వినడం అలవాటు అయింది.

చివరికి శనివారం మా వెడ్డింగ్ డే వచ్చేసింది. ప్రభా నాకు బ్రేస్‌లెట్ కొనింది...నేను మామూలుగా మరిచిపోయా. అప్పుడే అడిగాను ప్రభాని, నీకేం కావాలి మ్యారేజ్ డేకి అని.

Prabha: "ఏం కావాలంటే అది ఇస్తావా?"

Ratnesh: "ఖచ్చితంగా...అడిగి చూడు."

Prabha: "సరే, నా కోసం రత్నలా రెడీ అవ్వాలి."

Ratnesh: "అంటే?"

Prabha: "చీర కట్టుకొని, అందంగా ఆడపిల్లలా."

Ratnesh: "చీ...లేదు."

Prabha: "పెద్దగా ఎందుకు? ఏం కావాలంటే అది అడిగి చూడు అని గొప్పలు పోవడం...భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నావా?"

Ratnesh: "అదేమీ కాదు...సరే, నీ ఇష్టం."

"వావ్" అంటూ వెంటనే తన చీరలలోంచి ఒక చీర తీసుకువచ్చింది.

Part 18

Prabha: "నీ డ్రెస్ సిద్ధమైంది."

ప్రభా వీట్ అప్లై చేసింది...ట్వీజర్స్‌తో ఐ బ్రౌస్ షేప్ చేసి, స్వయంగా క్లీన్ షేవ్ చేసింది. బ్రా మరియు పాంటీ ఇచ్చి వేసుకోమంది.

Ratnesh: "నాకు అలవాటు కాబట్టి వెంటనే వేసుకున్నా." ఒక షేప్‌వేర్ వేసింది, జాకెట్ మరియు లంగా వేసింది, లంగా నాకు బాగా సెట్ అయ్యింది. చీర తీసి కట్టడం ప్రారంభించింది. చాలా అందంగా కట్టింది. మేకప్ వేయడం మొదలుపెట్టింది...రోజు లాగా కాదు, ఫుల్ మేకప్ వేసింది, తను ఎలా వేసుకుంటుందో అలా. క్లిప్-ఆన్ ఇయర్ రింగ్స్ పెట్టింది, గాజులు వేసింది, కళ్లకు పట్టీలు పెట్టింది, నెయిల్ పాలిష్ వేసింది. తర్వాత ఒక కాంబ్ తీసి నా జుట్టును దువ్వి, సవరం జోడించి పెద్ద జడ వేసింది, నాలుగు మడులు పువ్వులు పెట్టింది. ఒక బొట్టు పెట్టి నన్ను అద్దం ముందు తీసుకెళ్లింది. నా కళ్లతో నా రూపాన్ని చూసి నమ్మలేకపోయాను...చాలా అందంగా ఉన్నాను.

Prabha: "నువ్వు నీ అందాన్ని చూసుకో...నేను వెళ్లి రెడీ అయి వస్తా."

నేను నా రూపాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్నా...అప్పటికే ప్రభా కూడా రెడీ అయి వచ్చింది.

మేము డిన్నర్ టేబుల్ రెడీ చేస్తున్నాం...ప్రభా మూడు ప్లేట్లు పెట్టింది.

Ratnesh: "మూడు ప్లేట్లు ఎందుకు.. మనం ఇద్దరమే కదా?"

అంతలో కాలింగ్ బెల్ మోగింది.

Part 19

Prabha: "రత్నా వెళ్ళి చూడవేమిటో."

Ratnesh: "నేను లేను బాబోయ్...ఈ వేషంలో."

Prabha: "నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టా..డెలివరీ బాయ్ అయి ఉంటాడు..తీసుకో."

Ratnesh: "తప్పదా?"

Prabha: "తప్పదు.. చూస్తున్నావుగా నేను ఇక్కడ పనిలో ఉన్నానని."

వెళ్లి డోర్ ఓపెన్ చేశా..షాక్ అయ్యా...ప్రియ ఉన్నది డోర్ ముందు. నాకేమీ మాటలు రావట్లేదు.

Priya:"రత్నా ఎంత ముద్దుగా ఉన్నావే."

అని హగ్ ఇచ్చి ఒక పెక్కిచ్చింది.

Prabha: "రా ప్రియ...ఎలా ఉన్నావ్? ఎలా జరిగాయి మీ పెళ్లి చూపులు?"

Priya:"బాగానే అయ్యాయి...వాళ్లు ఓకే అన్నారు."

Prabha: "వావ్...పెళ్లి ఎప్పుడు మరి?"

Priya:"నెక్స్ట్ మంత్...మీరు ఇద్దరూ రత్నా తప్పకుండా రావాలి. రత్నా మాత్రం ఇలాగే రావాలి."

Ratnesh: "నేను షాక్‌లో ఉన్నా...ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు."

Priya:"ప్రభా, నువ్వు నిజంగా గ్రేట్...నేను అడిగినట్టు రత్నాని అబ్బాయి లాగా బాగా రెడీ చేసావ్."

Ratnesh: "ప్రియ, అంటే ఇదంతా నీ ప్లాన్ అ!"

Priya:"మా ఇద్దరి ప్లాన్..." అని ప్రియా, ప్రభా నవ్వడం మొదలు పెట్టారు.

డిన్నర్ స్టార్ట్ చేశాం...ప్రియ తన పెళ్లి చూపుల గురించి చెప్పడం ప్రారంభించింది. ప్రభా ఆ అబ్బాయి ఏం చేస్తాడు...ఎలా ఉంటాడు అన్నీ అడిగింది. నేను కాల్మ్‌గా వింటున్నా. ఫ్యాన్ గాలికి నా పాయింటా ఎగిరింది...జాగ్రత్తగా సరిచేసుకున్నా. అది గమనించిన ప్రభా, ప్రియా నవ్వుకున్నారు.

Part 20

Priya:"నాకు తెలుసు రత్నాలో ఒక అమ్మాయి ఉంది."

Prabha: "అవును, ఈ రోజు బయటకు వచ్చింది..." అని నవ్వుతున్నారు.

నేను డిన్నర్ అయిపోయాక ప్లేట్లు అన్ని సింక్‌లో వేసాను. చీర కుంగుని, బొద్దులో దోపి టేబుల్ క్లిన్ చేశాను.

Priya:"ప్రభా, నీ అనుమతితో నేను రత్నాను ఒకసారి కిస్ చేయవచ్చా?"

Prabha: "ఖచ్చితంగా."

Ratnesh: "నా అనుమతి ఏమీ అవసరం లేదా?"

Priya:"అవసరం లేదు...ఎందుకంటే నువ్వు ప్రభా ప్రాపర్టీ కదా."

అందరూ నవ్వడం మొదలు పెట్టాం.

సినిమా చూస్తూ నెమ్మదిగా మాటలు చెప్పుకుంటూ ఆ రోజు గడిపాము. కాసేపు కార్డులు ఆడాము. అంతా చాలా హ్యాపీగా గడిచింది. ప్రభ మరియు ప్రియ మా బెడ్‌రూమ్‌లో పడుకున్నారు. నేను సోఫాలో పడుకున్నాను.

సండే మార్నింగ్ ప్రియ మరియు ప్రభ లేచేసరికి నేను లేచి ఇంటిని క్లీన్ చేసి, పాలు కాచి కాఫీ పెట్టాను.

Priya:"నాకు అలాంటి మొగుడే కావాలి...నాకు కావాలంటే ఒక అమ్మాయిలా మారి, నాకేమి కావాలో తెలుసుకుని, బిహేవ్ చేసే వాడు.. వస్తాడు అలాంటి వాడే వస్తాడు."

Prabha: "వచ్చేసిన వాడు మంచివాడే వస్తాడు...ఎందుకు టెన్షన్ పడుతున్నావు."

ప్రభ ప్రియకి చీర పెట్టింది ప్రియ మా ఇద్దరి కాళ్లకి దండం పెట్టింది.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Amulya Amulya

Beautiful story

Ladybug Ladybug

Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..

ananya ananya

Super story