Friends · Telugu

మే తొమ్మిది... మరో భయానక అనుభవం

Completed | Part 1 of 4 | 2 Likes

Part 1

మే పదకొండవ తేదీన, పన్నెండవ తేదీన అసలైన పండుగ. భారతక్క, ఖుష్బూ, మేమంతా పండుగ కోసం ఏం, ఏం కొనుక్కోవాలో ప్లాన్ చేసుకుని బజార్ కు వెళ్ళాం. అక్కడ కొనుగోలు చేశాకా ఊరు చివర ఒక ట్రాన్స్ జెండర్ సిస్టర్స్ మీటింగ్ జరుగుతోంది. అక్కడికి మేం చేరే సరికి రెండు వందల మందికి పైగా సిస్టర్స్ ఉన్నారు. అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు. ఆ ఉత్సాహం, సందడి మామా పల్లెటూరి కాలువ గట్టు పై ఉన్న రావిచెట్టు పై సాయంకాలం చేరుకున్న పక్షుల కిలకిలల లాగా ఉంది.
మా పదిమంది బాచ్ అక్కడికి చేరేసరికి భారతక్క ను చూసి గుర్తు పట్టి ఆనందం గా వచ్చి అందరూ అందరినీ కౌగలించుకొని టున్నారు.
అప్పటికి టైం రాత్రి ఎనిమిదిన్నర అవుతోంది.
రాగిణక్క నుంచి ఫోన్ వచ్చింది. నేను ఒక రోజు ముందుగానే వస్తున్నా. ఇంకో గంటలో నువ్వు పెట్టిన అడ్రస్ ప్రకారం నేను హోటల్ లో నీ రూం దగ్గరికి వస్తాను. నువ్వు భారతక్క వాళ్ళ తో ఊరు చివర పార్టీకి వెళ్ళావని తెలుసు. నువ్వు వచ్చెయ్యి. ఇద్దరం కలిశాకా డిన్నర్ చేసి పార్టీకి వెడదాం. అంది. అందుకని భారతక్క కి చెప్పి నేను ఆటో చేసుకుని హోటల్ కి బయల్దేరాను. ఆ కంగారు లో నేను నడుస్తూంటే ఒక ట్రాన్స్ జెండర్ అక్క చూసుకోకుండా నా కుడి కాలి చెప్పు ను తొక్కింది. చెప్పు తెగి పోయింది. నేను ఆటో ఎక్కి వెడుతూ మధ్యలో చెప్పుల షాప్ దగ్గర ఆపమన్నాను. ఆటో డ్రైవర్ మంచి యువకుడు. అయితే పొలైట్ గానే ఉన్నాడు.
ఆటో ఎక్కేటప్పుడే లంగా, ఓణీ లో ఉన్న నన్ను అప్రిషియేటింగ్ గా చూశాడు. ఆటో దారిమధ్య లో రోడ్ కి ఇటు సైడ్ ఆపి మేడం రోడ్ కి అటువైపు చెప్పుల షాప్ ఉంది. కొనుక్కుని రండి. అని చెప్పాడు. నేను వెళ్లిన షాపులో ఫ్లాట్స్ కోసం అడిగాను. ఫ్లాట్స్ మాకు రన్నింగ్ తక్కువ. అందుకని మేం అమ్మటం లేదు. తక్కువ హీలున్న జత తీసుకోండి. అని చెప్పాడు షాపతను.
నేను చెప్పులు కొనుక్కుని రోడ్డు దాటుతుంటే ఒక మోటార్ సైకిల్ వేగంగా నా వేపు వస్తోంది. దాన్నుంచి తప్పు కోవాలి అని మోటార్ సైకిల్ కి ఎదురుగా నిల్చున్నాను. బండి వేగంగా వచ్చి నా రెండు కాళ్ళ మధ్యలో గట్టిగా తాకింది.

1602 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Meghana
Meghana 9 months, 1 week ago

Welcome back akka. I am waiting for your stories for quite some time.

gvgarima
gvgarima Author 9 months, 1 week ago

Thanks chelli. ❣️

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login