నా పేరు మధు. నేను ప్రియ ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. నేను తనని ప్రేమిస్తున్నాను. తనకి చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఒక రోజు ధైర్యం చేసి
చెప్పాను. తాను వెంటనే.. ఒక వ్యక్తిగా నువ్వంటే గౌరవం.. కానీ నేను స్త్రీ పురుష సమానత్వం కోరుకుంటాను. మరి మీరు... అంది. నేను వెంటనే.. నేను కూడా
నమ్మేది అదే.. అన్నాను. అంత ఈజీ కాదు. మీకు ఈ మధ్య కర్నాటకలో జరిగిన పెళ్లి తెలుసుకదా... అబ్బాయి అమ్మాయికి కట్టినట్టే... అమ్మాయి కూడా అబ్బాయి
మెడలో తాళి కట్టింది. అలాగే పెళ్లి చేసుకోవాలని నా కోరిక. ఇది జరిగితే ఇద్దరం సమానం అని ఒప్పుకున్నట్లు అవుతుంది. నేను ఆలోచనలో పడ్డాను. ఎలాగైనా..
పెళ్లి చేసుకోవాలి అని ఓకే అన్నాను. నువ్వు చెప్పడం కాదు... మీ అమ్మానాన్నలతో కలిసి మా ఇంటికి రండి.. అంది.
నేను ఇంట్లో చెప్తే.. నీకు పిచ్చెక్కింది... అని తిట్టారు. నేను తప్పదు అని గొడవ చేశాను. చేసేదేమీ లేక ఒప్పుకున్నారు.. కానీ అమ్మ, అక్క వచ్చి... తాళి
కట్టించుకోవడం అంటే తమాషా కాదు.. అని చెప్తే... నాలుగు రోజులు అయితే అదే దారికి వస్తుంది... ఒకసారి పెళ్లి అవనివ్వు.. అన్నాను. నీ ఖర్మ అన్నారు.
తాంబూలం మార్చుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. వేదమంత్రాల మధ్య... నేను తన మెడలో పసుపుతాడు కట్టి.. మూడు ముళ్ళు వేశాను. తాను నాకు
నమస్కారం చేసింది. మెట్టెలు పెట్టాను. అమ్మయ్య పెళ్లి అయింది... అనుకున్నాను. ఇంతలో మళ్ళీ వేదమంత్రాల మధ్య తాను లేచి నా మెడలో పసుపుతాడు
కట్టి మూడు ముళ్ళు వేసింది. నేను నమస్కారం చేశాను. నేను తేరుకునే లోపే నా కాలివేళ్ళకి మెట్టెలు పెట్టింది. మిగతా తంతు అంత అయ్యాక.. మా ఇంటికి
వెళ్ళాం. ఆ రోజు తొలిరాత్రి ఏర్పాట్లు చేశారు. తాను పాలగ్లాసుతో లోనికి వచ్చి నాకు నమస్కారం చేసింది. నేను తనను దగ్గరకు తీసుకున్నాను. ఆ రాత్రి అలా
సంతోషంగా గడిచిపోయింది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. పొద్దున్నే నిద్ర లేచాను. మెడలో మంగళసూత్రం అలా ముందుకు పడింది. దానిని బనియన్లోకి
వేసుకుని... బాత్రూంకు వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాను. మెట్టెలు కూడా ఇబ్బందిగా వున్నా... బెల్స్ లేకుండా.. చిన్న సింగల్ చుట్టు... కాబట్టి.. ఓకే. అలా వచ్చి కాఫీ
అని అమ్మను అడిగాను. అమ్మ ఒకసారి అలా చూసి.. అదేందిరా... అప్పుడే తాళి తీసేశావ్.. అంది. లేదమ్మ.. ఇదిగో లోపల వేసుకున్నా అని చూపించాను.
అమ్మ నవ్వి... సరే కానీ.. కొంచెం కుంకుమ పెట్టుకోవడం అలవాటు చేసుకో. ఎవరైనా పెట్టుకోవచ్చు.. పెట్టుకుంటే మంచిది. పైగా ఇప్పుడు నువ్వు తాళి
వేసుకున్నావు... బొట్టు పెట్టుకోవడం విధిగా అలవాటు చేసుకో అంది. అలాగే వెళ్లి బొట్టు పెట్టుకుని వచ్చాను. అలా కాఫీ తాగుతూ కూర్చొని అమ్మతో
మాట్లాడుతున్న. ఇంతలో ప్రియ స్నానం చేసి.. వచ్చి దేవుడి గదికి వెళ్లి బొట్టుపెట్టుకొని వచ్చి... అమ్మకి నాకు గుడ్ మార్నింగ్ చెప్పింది. అమ్మ తనకి కూడా కాఫీ
ఇచ్చింది. ఇంతలో నాన్న, కూడా వచ్చి కూర్చొని మాట్లాడుతూ అలా గడిచింది. అమ్మ ఉండి... ఈరోజు గుడికి వెళ్దాం అంటే బయలుదేరాము. కాళ్ళకి సాక్స్
వేసుకుని... మెట్టెలు కవర్ చేశాను. తాళిని షర్ట్ లోపలికి వేసుకున్నా... కానీ అదోలా ఉంది. గుడికి వెళ్ళాం. నేను సాక్స్ విప్పకుండా వెళ్ళాను. అర్చన
చేస్తున్నారు... అమ్మ నాన్నల తరువాత... మా ఇద్దరి పేర్లను అడిగితే... చెప్పాను... ప్రియ ఉండి... ఆగండి.. పంతులుగారు... మా పేర్లు, గోత్రం చెప్పి.. పరస్పర
ధర్మపత్నీ.. అని చెప్పమంది.. ఆయనకు అర్ధం కాక అదేమిటి... అంటే.. మేము స్త్రీ పురుష సమానత్వం కొరకు... ఇద్దరం ఒకరికి ఒకరు మంగళసూత్రం కట్టి..
పరస్పరం భార్య, భర్త అయ్యాము... అంటే వెంటనే పంతులుగారు... ఓహో మొన్న వింతగా పెళ్లి చేసుకుంది మీరేనా... మంచిది... అని అలాగే అర్చన చేశారు.
తాను పసుపు కుంకుమ తాళిబొట్లు కు రాసుకొని, బొట్టు పెట్టుకుని... న వైపు చూసింది. నేను బొట్టు పెట్టుకుంటే.. తాను షర్ట్ లోపాలనుండి తాళి బయటకు తీసి..
పసుపు కుంకుమ రాసి.. ఇలా చేస్తే... మంచిది... అన్నది. నేను విస్తుపోయి... మళ్ళీ తెలివి తెచ్చుకుని... మళ్ళీ లోపల వేసుకున్నా. అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్లి
కూర్చున్నాము. అమ్మ అక్కడ అందరికి పసుపు రాసి.. తాంబూలం ఇస్తోంది. చివరిలో.. అలాగే ప్రియకు ఇచ్చింది. కాసేపు ఆలోచించి... పంతులుగారిని
అడిగింది. ఏదో మాట్లాడి వచ్చి... నన్ను కూర్చోమని.. చెంపలకు కొద్దిగా పసుపు రాసి... నాకు కూడా తాంబూలం ఇచ్చింది. నేను అలా చూసి.. ఏమైంది.. అన్నాను.
ఏమి లేదురా... ఇప్పుడు నీ మెడలో మంగళసూత్రం ఉంది కాబట్టి... నిన్ను కూడా ముత్తైదువగానే చూడాలని పంతులుగారు చెప్పారు. అందుకే నీకు తాంబూలం
ఇచ్చాను.. అంది. నాకు మైండ్ బ్లాంక్ అయింది. నేను ఏమి మాట్లాడకుండా... బయటకు నడిచాను. అందరం కారులో ఇంటికి చేరాం. నేను ఇంటికి వెళ్ళగానే..
కోపంతో చూడు... నీ కోరిక ఎక్కడిదాక వచ్చిందో.... అంటూ తాళి, మెట్టెలు తీసి, తన చేతిలో పెట్టాను.
తాను వెంటనే మీరు తీశారు అని నేను తీస్తే.. ఏమంటారు అని అడిగింది. అది కాదు... అంటూ సర్ది చెప్పబోతే... నేను పెళ్లికి ముందే చెప్పాను.. ఒప్పుకుంటేనే
కదా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మాట తప్పితే.. ఎలా అంది. నేను మారు మాట్లాడలేక పోయాను. తాను నన్ను కూర్చోబెట్టి... మీరు ఎంతో ధైర్యంగా ముందుకు
వచ్చారు. తాళి మెడలో ఉంటె మీరు ఏమన్నా అమ్మాయి అయిపోతారా ... అది మీరు నాకు ఇస్తున్న గౌరవం. నా మెడలో ఉన్న తాళి నేను మీకు ఇస్తున్న గౌరవం.
ఇవన్నీ చిన్న విషయాలు ... అవే సర్దుకుంటాయి... అలవాటు అవుతాయి.... అంటూ.. నా మెడలో తాళి వేసి.. కిందకు వంగి మెట్టెలు పెట్టింది. మరోసారి ఇలా
తియ్యొద్దు... ఇలా తీస్తే... నా ఆశయం ఓడిపోయినట్లే... అంది. నేను తాళిని షర్ట్ లోపలికి వేసుకున్నా. రేపు మనం గోల్డ్ చైన్ కు తాళిబొట్లు చేర్చుకోవాలి... అంటూ
మీకు ఈ చైన్ తీసుకున్నాను.. అని చూపించింది. తన చైన్ లాగా లావుగా లేదు. ఇది వేసుకుంటే... మీకు బయటకు బంగారు గొలుసు వున్నట్లుగా ఉంటుంది
కానీ... పసుపుతాడు చివర్లో ఉన్న రింగు లో కట్టి దానికి తాళిబొట్లు, నల్లపూసలు చేర్చుకుని రెండో చివరలో కట్టుకోవాలి. అది కిందకు ఉంటుంది కాబట్టి...
పసుపుతాడు బయటకు కనపడదు అంది. మెట్టెలు ఎలాగు బయటకు కనపడవు... మీకు ఇబ్బంది ఉండదు.. అంది. ఏదోఒకటిలేవే బాబూ అనుకున్నా
ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, కుంకుమ పెట్టుకుని బయటకు వచ్చి కూర్చున్నాను. ప్రియ కూడా వచ్చి కాఫీ కలిపి అందరికీ ఇచ్చింది. అమ్మ ఉండి... ఈ
రోజు మీరిద్దరూ తాళిబొట్లు బంగారు చైన్ కు మార్చుకోవాలి అంది. నేను ఏమి మాట్లాడలేదు. ప్రియ ఉండి.. నేను చెప్పాను అత్తయ్య గారు... అంది. సరే ఇద్దరం
కూర్చొని... మార్చుకున్నాం. ఇప్పుడు కొంత రిలీఫ్ గా ఉంది. లోపల వేసుకుంటే... బయటకు పసుపుతాడు కనిపించదు. కానీ నడుస్తుంటే అవి షర్ట్ లోపల అటు
ఇటు కదులుతూ.. ఉన్నాయి. అమ్మ, నాన్న వచ్చి ఆశీర్వదించారు. ఒరే మధు నువ్వు ఏమన్నా అనుకో... నీ మెడలో కూడా తాళి ఉంది కాబట్టి... నువ్వు
బాధ్యతలు తప్పకుండా పాటించాలి. లేకపోతే అరిష్టం అంటారు.... అనింది. సరేలే అమ్మా అన్నాను. ఒక్కొక్కటిగా నీకు అలవాటు చేస్తాను. ముందు నిద్ర
లేవగానే తాళి బొట్లు కళ్ళకి అద్దుకోవాలి. ఎప్పుడూ మెడలోనుండి తియ్యకూడదు. ప్రస్తుతం ఇది పాటించు చాలు అంది. నేను గమ్మున ఉన్నాను. ఇది మీ
ఇద్దరికీ చెప్తున్నాను... చేసి చూపించండి అంది. ప్రియ చేస్తే... గుడ్.. ఇప్పుడు నువ్వు చెయ్యాలి అనగానే నేను చేశాను. మళ్ళీ షర్ట్ లోపలికి వేసుకున్నా. నేను
ఇప్పుడే గమనించిన విషయం ఏమిటంటే... ప్రియ తాళిబొట్లు నా కన్నా చిన్నవి. ఇలా ఎందుకు అంటే... మీరు నాకన్నా పెద్దగా ఉంటారు... అందుకే... అంది.
తాను వెంటనే నాతోటి ఈరోజు మనింటికి నా ఫ్రెండ్స్ వస్తున్నారు... అంది. సరే రానివ్వు.. మంచిదే కదా అని అమ్మ అంది. ఆరోజు మధ్యాన్నం వరకు మేమిద్దరం
అలా బయటకు వెళ్లి వచ్చాము. ఈవెనింగ్ అయింది. అమ్మ ఏవో స్నాక్స్ చేసింది. తన ఫ్రెండ్స్ వచ్చారు. తను, నేను రిసీవ్ చేసుకున్నాం. వాళ్లందరూ మాకు
శుభాకాంక్షలు చెప్పారు. నన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ మీరు సూపర్ సార్. మా ప్రియ కోరిక ప్రకారం మీరు తాళి కట్టించుకొని, మెట్టెలు పెట్టించుకొని మీరు స్త్రీ
పురుష సమానత్వంకు సాయపడ్డారు. అయినా ఒక చిన్న డౌట్... అవన్నీ పెళ్లి వరకు మాత్రమేనా ... తరువాత అంటే ఇప్పుడు కూడా ఉన్నాయా... తప్పుగా
అనుకోవద్దు... ఇప్పుడు ఆడవాళ్లు కూడా తీసి పక్కన పెట్టేసి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వేసుకుంటున్నారు.. అన్నారు. ప్రియ వెంటనే అదేం కాదు... మా ఆయన
బంగారం... కావాలంటే చూడండి... అంటూ షర్ట్ లోపలనుండి మంగళసూత్రం బయటకు వేసింది. బంగారు గోలుసుకు పసుపుతాడుతో కట్టి ఉన్న తాళిబొట్లు,
నల్లపూసలు చూసి వాళ్ళు ... వావ్ మీరు నిజంగా గొప్పవాళ్ళు అన్నారు. తరువాత సాక్స్ విప్పి .. చూపించి.. ఇవిగో మెట్టెలు కూడా... ఇంకెప్పుడు మా వారిని
అనుమనించొద్దు. నేనంటే చాలా ప్రేమతో..... నా ఆశయానికి సపోర్ట్ చేస్తున్నారు.... అని అన్నారు. వాళ్ళు మా ఇద్దరితో పాటు ఫోటోలు కూడా తీసుకున్నారు.
వాళ్లంతా వెళ్లిపోయారు. నేను మళ్ళీ సాక్స్ వేసుకుందామని వంగాను. షర్ట్ లోపల్నుండి తాళి బయటకు వచ్చింది. మళ్ళీ లోపల వేసుకుంటూ ఉంటే ప్రియ
వచ్చి... బయటకు ఉంచితే అలవాటు అవుతుంది... ఇప్పుడు ఇంట్లో అందరికీ తెలుసు కదా... అని ఒక పని చెయ్యి.. లోపల వేసుకో.. కానీ చైన్ కనిపించకుండా
లోపలకు సర్దే అవసరం లేదు. చైన్ కనిపిస్తే ఏమి కాదు. అలాగే ఇంట్లో సాక్స్ ఎందుకు? అనగానే అమ్మ కూడా... సపోర్ట్ చేసింది.. చేసేదేమి లేక అలాగే చేశాను.
ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రీ గానే ఉంటున్నాను. కొన్నిసార్లు తాళి కూడా షర్ట్ పైన ఉన్నా పట్టించుకోవడం మానేశా. పైగా ఇంట్లో అందరికీ అలవాటు
అయింది. నేను రోజు నిద్ర లేవగానే కళ్ళకి అద్దుకోవడం... ప్రతి శుక్రవారం, పసుపుతాడుకు పసుపు రాయడం..తాళిబొట్లకు పసుపు కుంకుమ రాయటం
చేస్తున్నాను. తాళి మెడలో కదిలినప్పుడు వెంటనే తాను గుర్తుకు వస్తుంది. అలాగే తనకి కూడా ఉంటుంది అనుకుంటా...
ఇలా ఒక 15 రోజులు గడిచాయి. ఇద్దరం ఆఫీసుకు వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఆరోజు ఇద్దరం రెడీ అవుతున్నాము. నేను బనియన్, షర్టు లోపలకు తాళి
సర్దుకున్నాను. టిఫిన్ చేసి బైక్ లో వెళ్తున్నాం. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు షర్ట్ లొపల తాళిబొట్లు కదులుతూ ఉన్నాయి. నా దృష్టి ఎప్పుడూ అక్కడే ఉంటోంది.
సరే ఆఫీసుకు వెళ్ళాము. అందరూ మాకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. మేము తీసుకున్న నిర్ణయం మంచిదే అని, భవిష్యత్ లో చాలా మంది పాటిస్తారు
అని చెప్పారు. నాకు అర్థం అయింది ఏమిటి అంటే... నా సంగతి అందరికీ తెలిసింది... నేను దాచిపెట్టి ఉపయోగం లేదు అని. నవ్వుతూ థాంక్స్ చెప్పాను
అందరికి. అందరం ఎవరి పనుల్లో వాళ్ళున్నాం. మా ఫ్రెండ్స్ అయితే నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు మాతో మీ 'ఆయన' ఒప్పుకుంటేనే వస్తావా..
అని. నేను ఇది మీకు అర్థం కాదులేరా... అని పంపించి వేశాను.