SHAPE SHIFTING

Sandhya_Sri

  | December 16, 2024


Completed |   2 | 1 |   1514

Part 1

ఈ కథ రాయటానికి ముందు మీ అందరికి ఒక్క చిన్న మనవి. మేము మిమల్ని మా కథల ద్వారా ఒక మాయ లోకం లోకి తీసుకొని వెళ్తున్నామనే అని అనుకుంటున్నాము.మీరు మా ఈ కథలను చదివాడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తునందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే మీ సహకారం మాకు ఎల్లపుడు మీ ఈ likes comments share చేయడం ద్వారా ఇస్తారని ఆసిస్తూ ఇట్లు మీ సంధ్య శ్రీ
అందరికి నమస్కారం నా పేరు విమల్ నేను ఎలా కావియా గా మారానో ఎందుకు నేను మరవలసి వచ్చిందో అసలు ఎం జరిగిందో నేను ఈ కథలో మీకు చెప్పదలుచుకున్నాను
నా పేరు విమల్ నేను ఒక్క పురావస్తుశాఖ అధికారిని. నా వయసు 28 ఇయర్స్. నేను కొత్త ప్రదేశాలకు వెళుతూ అక్కడున్న పురాతన వస్తువులపై పరిశోధన చేయడం నా వృత్తి. మా కుటుంబంలో మొత్తం 3 గురం ఉంటాం. అమ్మ నాన్న నేను. మా ఇంటి ఎదురుగా ఒక్క ఫామిలీ ఉంటోంది. అందులో భార్యాభర్తలు వారికి ఒక చిన్న పాప. ఆ ఎదురింటి అక్క పేరు కావియా. తనది తమిళనాడు దగ్గర తిరునల్వేలి. తాను చూడడానికి ఒక్క కుందనపు బొమ్మల పొడుగాటి జుట్టుతో చూడగానే నమస్కారం చేయాలనిపించేత కలగా ఉంటుంది తన ముఖం. ఎపుడు చిరునవ్వుతో ఎదుటి వారిని నవ్విస్తూ ఉంటుంది. బహుశా అందువల్లే ఏమో తనపై ఎదో తెలియని గౌరవం మరియు మమకారం. నేను ఒక్క సారి నా పరిశోధనలకు అని వెళితే రావడానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. ఇక అమ్మ నాన్నలు ఒంటరిగా ఉండడం చూసి కావియా అక్క వాళ పాపతో ఎక్కువ సమయం మా ఇంటిలోనే గడుపుతుంది. మా అమ్మ నాన్నలకు చాల తొందరగానే దగ్గర అయింది. అలా ఒకరోజు నా పరిశోధనలో భాగంగా ఒక్క గుహలోకి వెళ్ళాను గుహ మొత్తం చీకటిగా ఉండడంతో టార్చ్ ఆన్చేసి వెళ్తుంటే కొంత సేపటికి నా టార్చి ఆఫ్ అయింది. మొబైల్ ఓపెన్ చేస్తే వర్క్ కావటం లేదు. నా వెనక చూస్తే నాతో పాటు వచ్చిన వారు కనబడడం లేదు. నేను తప్పిపోయాను అని అనుకుంటూ కంగారులో ముందుకెళ్తుంటే ఒక రాయికి తగిలి కిందపడిపోయా. అలా ఆ రాయికి నీ కాలు తగలగానే ఆ రాయి నుండి విచిత్రంగా వెలుతురు రావడం మొదలైంది. నేను కంగారు పడుతుంటే ఆ వెలుతురు నుండి ఒక పొగ రూపం రావడంతో చాలా బ్యాం వేసింది. ఆ పొగ మెలి మెల్లిగా ఒక మానవ రూపం పొంది ఎదురుగా నిల్చుంది. నేను భయంతోనే ఎవరు అని మీరు అని అడిగాను. అందుకు ఆ రూపం తన పేరు విధక్షుడు అని తాను ఒక్క గంధర్వుడని ఒక ముని శాపం వాళ్ళ నేను ఇలా రాయి ల మారాను అని చెప్పాడు. తనకి కామరూపాని(కోరుకున్న రూపం) దాల్చే శక్తీ ఉందని చెప్పాడు. అంతే కాదు తనని ఈ శాపం నుండి విముక్తి చేసినందుకు గాను నాకు ఆ శక్తీ ఒక్క వరంగా ప్రసాదిస్తాను అని చెప్పి ఆ వరాన్ని ఇచ్చాడు. ఈ వరాన్ని ఎలా ఉపయోగించాలి తిరిగి ఎలా మాములుగా మారిపోవాలి అన్న విషయంతో పాటుగా, ఈ వరాన్ని ఎవరికీ చెప్పకూడదని చెపితే ఈ రూపంలో ఉంది చెప్తావా ఆ రూపంలోనే శాశ్వతంగా ఉండిపోతావ్ అని అలాగే ఆ రూపం లో ఉన్నపుడు వారి చేసే పనులని నువ్వు సునాయాసంగా చేయగలవు అని చెప్పగానే నేను స్పృహ కోల్పోయాను. నన్ను ఆ గుహలో నుండి బయటకు పంపి మాయం అయిపోతారు. కొంత సేపటికి మెలుకువ వచ్చి చూస్తే నా సహచరులు నా తో పాటె ఉండదాం చూసి ఇది ఒక్క కల అని అనుకున్నాను. కానీ నా సహచరులు చెప్పిన విషయం విని నేను ఇది నిజం అని అనుకోని నా కేబిన్ లో వెళ్లి ఒక్క సారి ఈ వారని ఉపయోగిదం అని నా కాలేజీ రోజులో నా ప్రొఫెసర్ రూపం తలుచుకోగానే ఒక వింత శబ్దం నేను లేచి అద్దంలో చూడగానే నన్ను నేను నమ్మలేక పోయాను........
నా కాలేజీ రోజులో నా ప్రొఫెసర్ రూపం తలుచుకోగానే ఒక వింత శబ్దం నేను లేచి అద్దంలో చూడగానే నన్ను నేను నమ్మలేక పోయాను. నేను ఊహించుకున్నది నా ప్రొఫెసర్ సుష్మ గారిని. సుష్మ మేడం అచ్చమైన మరాఠి ఆవిడ ముక్కుకు పెద్ద nose pin వేస్తుంది అలాగే ఆవిడ చీర కట్టు కూడా చాల బాగుంటుంది. ఆవిడను మొదట చూసినపుడు ఎందుకో తెలియదు కానీ ఆవిడలా ఒక్కరోజు ఉండాలి కోరిక. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరింది అలా ఆమెలా మారగానే రూపం తో పాటు నా దుస్తులు కూడా సుష్మా మేడంల మారిపోయింది. ఎందుకో తెలీదు కానీ ఆ చీర కట్టులోనే ఏదో ఒక మత్తు ఉంది. ఆ చీర softness ని చూడగానే నా మదిలో ఏదో ఒక అలజడి. అలా కొంత సేపు నన్ను నేను అద్దం లో చూస్తుండిపోయాను. అలా కొన్ని ఫొటోస్ తీసుకొని కొంత సేపు ఆ ఆడతనాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను ఆ పొడుగు జడ అందులోనూ మల్లెపువ్వులు నన్ను అమ్మాయిలా మారిపో అని ప్రేరేపిస్తున్నాయి. అల కొంత సేపు నాకు కొత్తగా వచ్చిన వారని ఎంజాయ్ చేస్తుండంగా ఏదో అలికిడి నా గదిలో భయం వేసి నా రూపం లోకి నేను మారిపోయాను కానీ నా దుస్తులు మారలేదు నేను నా రూపం లో ఉన్న దుస్తులు మాత్రం సుష్మ మేడం వె ఉన్నాయ్. నాకు ఇలా ఎందుకు జరిగిందో తెలియట్లేదు. ఇంతలో ఆ అలికిడి శబ్ధం ఇంకా ఎక్కువవుతున్నాయి నాకు కంగారు మొదలైంది ఎందుకంటే నేను చీరలో ఉన్నాను. కానీ ఇలా చీరలో నన్ను నేను చూసుకోగానే ఎదో తెలియని ఆనందం నేను ఎప్పటికైనా ఒక్క ఆడదానిలా మారిపోవాలి అనేలా ఉంది ఆ చీర స్పర్శ. నా చిన్నతనం నుండి నేను స్త్రీ గ ఉండాలనే కోరిక ఉన్న ఇంట్లో అమ్మ నాన్నలకు ఒక్కడినే కొడుకుని అవడం వల్ల నా ఆశ కల గానే మిగిలిపోయింది కానీ విదక్షుడి వరం వల్ల న్నా కోరిక తీరిందని సంతోషం ఒక్కవైపు ఉన్న నా గదిలో అలికిడి వల్ల కంగారు..
అలా కంగారు పడుతుందంగా విధక్షుడు మల్లి నా ముందు ప్రత్యక్షమయ్యాడు. తాను నాకు ఒక్క విషయం చెప్పడం మరిచిపోయానని అన్నాడు
నేను : ఏమిటి ఆ విషయం చెప్పండి స్వామి అని అడిగాను
విధక్షుడు : అది ఏమిటంటే మిత్రమా నువ్వు ఎవరి రూపం లో మారుతావో వారి రూపంతో పాటు వారి వేషధారణ, జీవనశైలి, భాషపై పట్టు సాధ్యమవుతుంది, కానీ నువ్వు కంగారులో నీ రూపం పొందామంటే నీ రూపం వస్తుంది కానీ ఎవరిలా నువ్వు మారుతావో వారి వేష ధారణ మాత్రం మారదు అది ఒక్క అరగంట వరకు నువ్వు వారి వేషధారణలోనే ఉంటావు అని చెప్పారు.
నేను : స్వామి ఇప్పుడెలా స్వామి అని అంటుండంగా ఎవరో తలుపుతట్టారు, నేను స్వామి తో స్వామి ఇప్పుడు నేను ఇలా వెళ్ళలేను స్వామి ఎదో ఒక్కటి చేసి నా దుస్తులు నాకు వచ్చేలా చేయండి అని ప్రాధేయ పడ్డాను.
విధక్షుడు : అలాగే మిత్రమా నువ్వు నన్ను నా శాప విమోచనం నుండి నన్ను రక్షించావు కాబట్టి నేను నీకు నీ దుస్తులు వచ్చేలా చేస్తాను అని అన్నాడు. అలాగే మరో విషయం నువ్వు కోరుకున్న రూపంలో నుండి తిరిగి నీ రూపంలోకి మారినప్పుడు కంగారు పడకూడదు. అలాగే నువ్వు ఎన్ని సార్లైనా కోరుకున్న రూపాని పొందవచ్చు ఎవరిలాగైనా మారవచ్చు. అంతే కాకుండా నేను నీ ఆపద సమయం లో నీ వెంటనే ఉంటిని అని చెప్పి మాయమవుతారు.
నేను ఏమి జరగన్నట్టు తలుపు తీసాను ఎదురుగ నాతో పాటు పని చేసే అమ్మాయి తన పేరు జోవిత. నాకన్నా ఒక్క 2 ఇయర్స్ చిన్నది. నన్ను ఎపుడు అన్నయ అని పిలుస్తుండేది. ఆ క్యూట్ గ అన్నయ అని పిలిచినప్పుడు నాకు చెల్లి లేదే అనే భావన నాలో ఉందేది కాదు. నేను జోవితతో
విమల్ : ఎం జోవిత ఇలా వచ్చావు. ఏమైనా కావాలా
జోవిత : అన్నయ రేపు రాఖి కదా నాకు అన్నలు లేరు రేపు మీ ఇంటికి వాదం అని అనుకుంటున్నాను. నీకు తేసు కదా అన్నయ అమ్మ నాన్నలు ఆస్ట్రేలియాలో ఉంటారు నేను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాను అని
విమల్ : నాకు తెలుసు జోవిత నీకు చాలసార్లు చెప్పాను, నువ్వు హాస్టల్ రూమ్ vacate చేసి రమ్మని కానీ నువ్వే రానంటున్నావు ఎలాగో అన్నయ ఇంటికి రావాలని అనుకుంటున్నావు కదా ఇప్పటికే టైం రాత్రి 8 అయింది నువ్వు నాతో పాటు వచ్చే ఈ రోజే మనం రాఖి ని ఎంజాయ్ చేద్దాం
జోవిత : సంతోషం తో అలాగే అన్నయ కానీ నా దుస్తులు ఎలా మరి అని అమాయకంగా అడిగింది.
విమల్ : కొత్తవి కొనిస్తాను అని చెప్పాను
అలా జోవితతో పాటు నేను మా ఇంటికి వచ్చాను. మా ఇద్దరి గురించి మా అమ్మ నాన్నలకు తెలియడం వాళ్ళ నాకు ఇబ్బంది అనిపించలేదు. (నా మనస్సులో జోవిత అమ్మ నాన్నల గురించి చాల బాధపడుతుంది నేను ఒక్కసారి జోవిత అమ్మలా మారి తనతో కొంత సమయం గడిపితే తనకు బాగుంటుందని అనిపించింది).నేను జోవితతో జోవిత మీ పేరెంత ఫొటోస్ ఏమైనా ఉన్నాయామా అని అడిగాను తాను వాళ్ళ ఫోటో నాకు చూపించగాను నేను తనని నాకు పంపించాం మని అడిగాను అలాగే లేట్ అవడంతో ఫ్రెష్ అయ్యి తినేసి వారి వారి గదుల్లో వెళ్లి నిద్రపోయాను. కానీ నాకు జోవిత బాధ దూరం చేయాలనే ఆలోచన మాత్రమే ఉంది. అలా ఆలోచిస్తూ పడుకుండిపోయాము. పొద్దున లేచి ఫ్రెష్ అప్ అవ్వి బయటకు రాగానే జోవిత నాకు రాఖీ కట్టింది. అలాగే గుడికి వెళదాం అని అడిగింది. నేను తనతో నీకో సుర్ప్రిసె ఉంది అని చెప్పి గుడికి తీసుకెళ్ళాను. అలా గుడిలోపలకి వెళ్ళగానే తాను దేవుని సన్నిధిలో ఉంటె నేను గుడి వెనుకకు వెళ్లి ఎవరు లేరని తెలుసుకొని జోవిత వాళ్ళ అమ్మలా మారిపోయాను. కానీ మనస్సులో జోవిత నాన్నగారు ఉంటె బాగుంటుంది అని తలుచుకుంటుండంగా విధక్షుడు ప్రత్యక్షమై జోవిత వాళ్ళ నాన్నల మారిపోయాడు. అంతకు ముందు నేను జోవితకు మెసేజ్ చేశాను ఒక అర్జెంటు పని వాళ్ళ బయటకు వెళ్తున్నాను ఈరోజు నీకు కావలసిన వాళ్ళు నిన్ను కలుస్తారు అని. నువ్వు వారితో పాటు ఇంటికి వచ్చే అని చెప్పాను. కొంతసేపటికి నేను విధక్షుడు జోవిత వాళ్ళ అమ్మ నాన్నల జోవిత ముందు నిల్లబడము. తాను ఏడుస్తూ మమ్మల్ని గట్టిగ వాటేసుకుందు అప్రయత్నాంగా నా కంటిలో నుండి కూడా నీళ్లు వచ్చాయి.తాను నన్ను అమ్మ అని పిలవగానే ఎందుకో తెలియదు నా హృదయం చలించిపోయింది. అలా జోవిత ఏడుస్తుంటే నా చీర కొంగును తీసుకొని ఒక్క అమ్మలా తన కన్నీటిని తుడుస్తునాను. జోవిత నేను ఒకా అమ్మ కూతురిలా కాకుండా ఒక్క స్నేహితురాళ్ళలా చాల సేపు మాట్లాడుకున్నాము. అలా తనకి అమ్మలా ఉన్నంత సేపు ఒక్కో క్షణం అమ్మ ప్రేమ ఇంత గొప్పదా ని అనిపించింది ఆ క్షణం. అలా జోవితతో వాళ్ళ అమ్మ నాన్నల తనతో సమయం గడుపుతునంత సేపు నేను విమల్ అనే విషయాన్నే మరిచిపోయాను. అలా చీకటి పడగానే తనతో నేను జోవిత ఇక మేము వెళ్తామమ్మ ఒక బిజినెస్ మీటింగ్ కు ఢిల్లీ వెళ్తునం అని చెప్పి జోవితాను నా ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు క్యాబ్ బుక్ చేశాను తాను గుడి దగ్గర నుండి నా(విమల్) ఇంటికి వచ్చేంత వరకు నా lap పై అలా పాడుకుండిపోయింది నేను నిజంగా ఆ క్షణం ఎందుకు నేను అమ్మాయిల పుట్టలేదు అనిపించింది. అల్లా జోవితకు ఒక్క అమ్మలా ఉన్నడం చుసిన విధక్షుడు తనలో తాను నవ్వుకుంటున్నాడు ఇంతలో నా ఇల్లు రావడంతో జోవితను అక్కడ డ్రాప్ చేసి మేము అదే క్యాబ్లో కొంత దూరం వెళ్లి తనతో ఇక్కడే డ్రాప్ చేయమని మేము దిగి తిరిగి మా రూపాలను పొందాము. అలా ఈ రోజు ఒక్క ఉపాధ్యురాలిగా అలాగే ఒక్క అమ్మలా ఉండడం చాల నచ్చింది............. అదే నన్ను కవియగా గ మారడానికి ఎలా ప్రేరేపించిందో
అలా జోవితకు ఒక్క అమ్మలా ఉన్నడం చుసిన విధక్షుడు తనలో తాను నవ్వుకుంటున్నాడు. తిరిగి మా రూపాలను పొందిన తరువాత విధక్షుడు నాతో మిత్రమా నీకున్న షహృదయానికి కరిగిపోయాను. జోవిత సంతోషం కోసం నువ్వు చేసిన ఈ పనివల్ల నాకు నువ్వు మరింత ఆప్తుడయేల్ల చేసింది అని చెప్పి మాయమైపోతారు. అలా ఇంటిలోపలికి వచ్చిన నాతో జోవితో ఈరోజు ఎం జరిగిందో చెప్పడం మొదలుపెట్టింది. అవ్వని నేను ఏమి తెలియనట్టు వింటున్నాను. తన కళ్ళలో ఆనందం చూసి నా మనస్సు పరవశించిపోయింది. తనకి అమ్మలా ఉంటూ ఒక మాతృత్వాన్ని కొంత సేపు పొందాను ఆ అనుభూతిని వర్ణించడం కష్ట సాధ్యం. అలా సమయం 9 గంటలైంది ఇక అందరంబొంచేసి పడుకుండిపోయాము.
ఎందుకో తెలియదు ఆ ఆడతనంలోనే ఎదో దాగి ఉంది. ఈ రోజు ఆస్వాదించిన ఆడతనాన్ని గుర్తుచేసుకుంటుంటే అసలు నిద్ర పట్టలేదు. అలా ఆలోచిస్తూ బహుశా నేను అమ్మాయిల పుట్టుంటే ఎంత బాగుంటుందో అని అనిపించింది. ఆ పొడుగాటి జడ, తల నిండా పువ్వులు, చీర కట్టు, చేతి నిండా గాజులు, మెడలో మంగళ సూత్రం, కాలికి మెట్టెలు, పట్టిలు. ఇలా వర్ణించుకుంటూ పోతే ఆడువారిపై గౌరవం పెరగడం మొదలయింది. ఇలా నా మదిని ఒక్క ప్రశ్న తొలిచేస్తోంది నాకేమో ఆడవారిలా ఉండాలనే కోరిక బలపడుతున్న అమ్మ నాన్నలు గుర్తుకు వచ్చి వారికి ఒక్క వంశాకురం ఇవ్వాలి, అని ఆ ఆలోచనను వెనకు నెట్టేసాను. కానీ నాకు ఒక్క చిన్న చిలిపి కోరిక కలిగింది. నేను ఎందుకు అన్ని విధాలైన చీర కట్టును ప్రయత్నించకూడదు అని అంకున్నదే తడవుగా ఒక్క తమిళ్ బ్రాహ్మణ మహిళా చీర కట్టు విధానం గుర్తుకొచ్చింది, నేను అలా మారాలంటే ఒక్క రూపం కావలి గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తే ఎదో ఒక్క ఇమేజ్ కనబడింది. నేను ఆమెను చూస్తూ ఇలాగ మారాలి అని అనుకోగానే ఒక్క శబ్ధం నేను తేరుకొని ఆదాయంలో వెళ్లి చూడగా ఒక అచ్చమైన బ్రాహ్మణా యువతిగా ఆ కట్టు బొట్టు చూసి మంత్ర ముగ్ధుడిని అయ్యాను. అలా ఆ చీరకట్టుతోనే కొంత సేపు నా గదిలో తిరుగుతుంటే చేతినిండా గాజుల శబ్ధం మరియు కాళీ పటియిల శబ్ధం నన్ను ఆడదానిలా మారాలనే కోరిక బలపరిచింది, కానీ పట్టీల శబ్ధం ఎక్కువవడంతో ఇంట్లో వాళ్ళు లేస్తురనే భయంతో కాళీ పటిళ్ళు తీసేసాను. అలా ఆ చీరలో ఉంటూ నా తనివి తీరా ఫొటోస్ తీసుకొని, అలసిపోయి అలా ఆ చీర లోనే పడుకుండిపోయాను. అలా చీరలో పాడుకుంటున్నపుడు ఎదో తెలియని ఒక్క వింత అనుభూతి. చాల బాగా నచ్చింది అలా పొద్దున లేవగానే నేను చీరలో ఉన్న అనే విషయాన్నీ మర్చిపోయాను, లేస్తుంటే గాజుల శబ్ధం నాకు నేను స్త్రీ రూపం లో ఉన్నన్నాని గుర్తు చేసింది. అలా ఈ రోజు బ్రాహ్మణ యువతిగా ఎంజాయ్ చేశాను.
ఇక ఆఫీసుకు వెళ్లడం కోసం తిరిగి నా రూపంలోకి మారిపోయాను. స్నానం చేసి రెడీ అయి బయటకు వస్తుంటే కావియా మరియు కావియా వల్ల పాపా ఇంటికి వచున్నారు. నేను పాపా తో ఆడుకుంటుంటే కావియా అమ్మ నాన్నలతో కబుర్లు చెప్పడం ప్రారంభించింది, అలా కావియా వల్ల పాపను చూడగానే నాలో మల్లి మాతృత్వ ప్రేమ బయటకు వచ్చింది కానీ ఇది సరైన సమయం కాదని, జోవితాని పిలిచాను. మేము ఇద్దరం అలా బ్రేక్-ఫాస్ట్ చేసి ఆఫీసుకి బయలుదేరడానికి సిద్ధమవుతుంటే కావియా నా దగ్గరకు
కావియా : విమల్ నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి నీకు ఎపుడు వీలవుతుందో చెప్పు.
విమల్ : ఏమైంది కావియా ఎందుకలా బాధలో ఉన్నావ్ ఇంట్లో ఏదైనా సమస్య అని అడిగాను. నేను మీ ఇంటికే వచ్చి మాట్లాడతాను అని అన్నాను
కావియా : కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటికి వద్దు విమల్ మనం మీ ఇంటిలోనే మాట్లాడుకుందాం. నాకుఈ హెల్ప్ చెయ్ అని ఏడుస్తుంటే చూడలేక
విమల్ : ఏడవకు కావియా సరే నేను రేపు ఆఫీస్కి లీవ్ పెట్టి వస్తాను నువ్వు morning ఇంటికి వచ్చే మాట్లాడుకుందాం అని అన్నాను.
కావియా : అలాగే విమల్ రేపు పొద్దున 10 గంటలకి వస్తాను అని చెప్పి కంగారుగా వెళ్ళిపోయింది. అసలు నాకు ఎం జరుగుతుందో అర్ధం కావటం లేదు కానీ కావియా ఎదో సమస్యలో ఉంది కానీఆ సమస్యకు కారణం తెలియట్లేదు.
ఇక ఈ విషయం జరిగిన తరువాత నేను జోవిత ఆఫీస్ కు వెళ్ళిపోయాము. నా ద్యాస అంత కావియా గురించే. తాను నా వయసే అయినా తాను మా కుటుంబంపై చూపించే ఆప్యాతను చూసి నేను తనని నా అక్కగా అనుకున్నాను. అలా ఆ ఆలోచనలతోనే సమయం గడిచిపోయింది ఇక నేను జోవిత ఇంటికి వచ్చేసాము. ఇంట్లో ఉన్న కూడా కావియా అక్క ఆలోచనలే. అలా ఈ రోజు కూడా ఎం తోచక పాటలు వింటూ అలానే నిద్రపోయాను. పొద్దున లేవడం ఆలస్యం అయింది. ఇంతలో అమ్మ కావియా వచ్చిందని నన్ను నిద్ర లేపారు. అలా లేచి ఫ్రెష్ అవ్వగానే కావియా నా రూంలోకి వచ్చి ఏడవడం మొదలుపెట్టింది. నేను కావియా తో అసలు ఏమి జరిగింది అని అడగగా తాను నాతో
కావియా : విమల్ నాకు చిన్నప్పటినుండి చదుకోవాలనే ఆశ కానీ మా పెద్దవాళ్ళు నన్ను డిగ్రీ మధయ్లోనే చదువు మాన్పించి నాకు పెళ్లి చేసారు. పెళ్ళైన మొదటి రోజు నుండి నేను నా భర్త తో చాల కష్టాలు అనుభవిస్తున్నాను. అని మౌనం గ ఉండిపోయింది.
విమల్ : అసలు ఎం జరిగిందో పూర్తిగా చెప్పు కావియా నువ్వు చేప్తే నే కదా ఒక్క సొల్యూషన్ ఇవ్వగలం అని చెప్పాను
కావియా : మాకు పెళ్లి జరిగి 3 ఇయర్స్ అవుతుంది. మొదటి సంవత్సరం pregnent అయినపుడు నేను చాల సంతోష పడ్డాను. కానీ నా భర్తకు అప్పుడే పిల్లలు వొద్దు లైఫ్ లో సెటిల్ అవ్వాలని చెప్పాడు నేను అందుకు ఒప్పుకోలేదు. కానీ నా భర్త నాకు తెలియకుండా నేను తాగే పాలల్లో abortion టాబ్లెట్స్ కలిపి ఇచ్చాడు ఆ టాబ్లెట్ ప్రభావం వల్ల నేను నా మొదటి బిడ్డను కోల్పోయాను అంది ఏడుస్తూ.
విమల్ : నాకు ఆ విషయం విన్న తరువాత చాల కోపం వచ్చింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా అని అడిగితే
కావియా : అలా కంప్లైంట్ ఇద్దాం అని వెళ్ళినపుడు నా అత్త మామలు నన్ను ఇంట్లో కట్టేసి నానా చిత్ర హింసలు పెట్టారు. అవ్వని భరించాను ఇంతలో నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను.
అలా నా రెండో ప్రెగ్నెన్సీ టైం లో కూడా నా చేత అన్ని పనులు చూపించేవారు. ఇపుడు అని pass
నేను తనతో తరువాత ఎం జరిగింది అని అడిగితే విమల్ నాకంటూ ఉన్నదీ మీరే నేను నా స్టడీస్ ని కంప్లీట్ చేయాలనీ అనుకుంటున్నాను ఈ విషయం నా భర్తకు చెపితే తాను నన్ను చాల కొట్టాడు. నాకు చనిపోవాలని పించింది కానీ పాపా వల్లే ఇంకా బతికి ఉన్నాను. పైగా నేను పాపని పెట్టుకొని చదివలెను.అలాగని పాపని ఆ రాక్షసుల మధ్య ఉంచలేను. నాకు ఎలాగైనా ఈ విషయం లో సహాయ పడుతావా అని అడిగింది.
నేను (మనస్సులో తనని చదుకోవడానికి పంపించి నేను తన రూపంలో అందరి పని పట్టాలని నిర్ణయించుకున్నాను) తనతో కావియా నువ్వు నిశ్చింతంగా వెళ్లి చదువుకో నేను పాపని చూసుకుంటాను అని భరోసా ఇచ్చాను అలా మరుసటిరోజు నేను తనని మేముంటున్న సిటీ నుండి దూరంగా ఒక్క కాలేజీ లో చేర్పించాము. అలా చేర్పించిన తరువాత నేను ఇంటికొచ్చి అమ్మ నాన్నలతో నేను నా పర్సనల్ పని మీద ఆస్ట్రేలియా వెళ్తున్నానని జోవిత మీకు సహాయంగా ఇక్కడే ఉంటుందని చెప్పి బయల్దేరాను అలా కొంత దూరం వెళ్ళాక. నా ఆట నేను మొదలు పెట్టాను కావియా గ నా రూపం మార్చుకొని తిరిగి మా ఇంటికే వచ్చాను
అలా కావియా ను కాలేజీ లో చేర్పించాను తాను వాళ్ళ భర్తకి ఫిన్ చేసి నేను పుటింటికి వెళ్తున్నాను ఒక 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పింది అలా చెప్తూ కంగారు పడుతుంది నేనేనా చదువుకోవడానికి ఇంత దూరం వచ్చాను నువ్వేమో 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పమన్నావ్ నాకేం అర్ధం కావట్లేదు విమల్ అని అంది నేను అందుకు నువ్వు కంగారు పడకు నేను చూసుకుంటాను అవ్వని నువ్వు ప్రశాతంగా చదువుకో అని హామీ ఇచ్చాను. అలా తనను హాస్టల్ లో దింపేసి నేను ఇంటికి వస్తూ ఉంటె ఒకటే ఆలోచన. కావియా జీవితాన్ని అలా సరిపెట్టాలి అని అలాగే క్రితి ని ఎలా చూసుకోవాలి అని. అన్నటు కావియా ఫామిలీ గురించి పూర్తిగా మీకు చెప్పలేదు కదూ కావియా భర్త పేరు కుమారన్ పాపా పేరు క్రితి. కుమారన్ ఒక్క చార్టెడ్ అకౌంటెంట్. ఇక కుమారన్ కి ఒక్కర్తే తల్లి తన పేరు అనసూయ. పేరు మాత్రం చాల మృదువుగా ఉన్న స్వభావం సూర్యకాంతం ల ఉంటుంది కుమారన్ వాళ్ళది తమిళనాడు దగ్గర రామేశ్వరం. కావియా అంటే ఇంట్లో ఎవరికీ నచ్చదు కారణం వరకట్నం. కావియా వాళ్ళ నాన్నగారు ఒక్క క్లర్క్. బహుశా అందు వల్లే ఏమో కావియా చదువుని మధ్యలోనే ఆపేసాడు. అలా ఆలోచిస్తూ వీళ్లకి ఎలాగైనా గుణ పాఠం చెప్పాలని అనుకున్నాను అదే నన్ను ఇబ్బందులో పడేస్తుందం తెలుసుకోలేక పోయాను.
అలా ఆలోచిస్తూ ఇంటికి వచ్చి అమ్మ నాన్నలకు మరియు జోవిత కు నా పర్సనల్ పని మీద ఆస్ట్రేలియా కి వెళ్తున్నాను రావడానికి ఒక్క 15 రోజులు పడుతుంది అంత వరకు క్రితిని ఇక్కడే ఉండనివండి అని చెప్పి ఇంటి నుండి ఎయిర్పోర్ట్ కు బయలుదేరాను. అలా మా ఇంటి నుండి కొంత దూరంలో ఒక్క రూమ్ బుక్ చేసుకొని కావియా రావడానికి కనీసం 1 1/2 ఇయర్స్ పడుతుంది అంత లోపు నేను ఒక పరిపూర్ణమైన స్త్రీ గ మరియు అమ్మలా మరోసారి మాతృత్వాన్ని ఆస్వాదించచ్చు అని ఆలోచన. అలా ఆలోచిస్తూ నేను కావియా ల మారిపోవాలని అనుకున్నాను వెంటనే ఒక్క శబ్దం నేను కావియాళ మారిపోయాను. అలా తనలా మరీనా నాకు ఎదో తెలియని వింత అనుభూతి కావియా తమిళ్ అమ్మాయి అవడం వాళ్ళ తన కట్టు బొట్టు లో ఉన్న సౌందర్యము వర్ణననితం. తనకు నడుము వరకు తాకే జడ నుదుటిపై కుంకుమ బొట్టు చేతి నిండా గాజులు తల నిండా పువ్వులు వీటన్నిటితో పాటు తన దేహం నుండి ఒక్కటే సువాసన అలాగే తన దేహం బంగారు వర్ణం తో మెరుస్తుంది కారణం పసుపు ఆ సువాసనకు నేను తనలా మారి ఆస్వాదిస్తునాను ఇంతలో నాకొక సందేహం నేను కావియా ల ఇక్కడ 1 1/2 ఇయర్ ఉండాలి అంతవరకు నేను రాలేదంటే అమ్మ నాన్నలకు అనుమానం వస్తుంది ఇలా జరగకుండా ఉండాలంటే నేను కావియా గాను ఉంటూ అలాగే విమల్ గ కూడా ఉండాలి ఇలా ఒకే సారి వేర్వేరు ప్రదేశాల్లో ఉండడం చాల కష్టం. ఇప్పుడెల్ల అని ఆలోచిస్తుండంగా విధక్షుడుని ఒక్కసారి తలుచుకున్నాను వెంటనే ప్రత్యక్షమై ఏమి మిత్రమా అని అడిగాడు. నేను తనతో జరిగిన విషయం చెప్పను అలాగే ఇపుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని అడ్డాగా తాను నాతో నువ్వు కంగారు పడకు మిత్రమా నేను నీ స్థానంలో మీ అమ్మ నాన్నలతో నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేను ఉంటాను అని తాను నా రూపం పొందాడు.
అలా రూపాలు మార్చుకున్న తరువాత నా రూపంలో ఉన్న విదక్షుడితో నాలా అమ్మ నాన్నలకు ఫోన్ చేసి నా ఫీల్ట్ మిస్ చేసుకున్నాను నేను తిరిగి ఇంటికి వచేస్తున్నాను అని చెప్పను ఇక్క కావియా రూపం లో ఉన్న నేను కుమారన్ కి కాల్ చేసి ఇక్క పని అయిపోయింది తిరిగి వచ్చేస్తున్నా అని చెప్పను ఆలా నేను విధక్షుడు రూపాలు మార్చుకొని ఇంటికి బయలుదేరాము. ఆలా ఇంటికి చేరి ఇంటి లోపల వెళ్ళగానే కృతి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అని అనడంతో పరవశించిపోయాను. అసలు ఈ అమ్మతనం అనే మాట ఎంత కమ్మగా ఉందొ. తనను పిలుచుకొని కావియా రూపంలో వాళ్ళింటి తలుపు తట్టాను. అనసూయ తలుపు తీసి లోపాలకి రా అనిప్రేమగా తలుపు తీసింది నాకు ఒక్క క్షణం షొక్జ్ తాను ఏంటి ఇంత ప్రేమగా పిలుస్తుంది అని అనుకోగానే తలుపు వేసి అరవడం మొదలు పెట్టింది ఒక్క మాట కూడా చెప్పకుండా అలా వెళిపోతే ఎలా ఇంటి పనులు ఎవరు చేస్తారు అని అంది. ఈ వార ప్రభావం వాళ్ళ కావియా జీవన సిల్లి నాకు అలవాటు పడింది. నేను వెంటనే అలా ఎం లేదు అత్తయ్య వచ్చేసాను కదా అత్తయ్య అని భయం తో నే అన్నాను. అలా తాను చూపిన ఇంటి పనులనింటిని చక చక చేసే సరికి body pains మొదలయ్యాయి. అలా స్నానం చేద్దాం అని బాత్రూం కి వెళ్ళాను స్నానం చేస్తుండంగా నా చేతులు అప్రయత్నాంగా పసుపు డబ్బా పై వెళ్ళింది నేను కావియా రూపం లో ఉన్న మనసు విమల్ ధీ పసుపు రాసుకోకూడదు అని అనుకుంటూనే ఆ సువాసనకు పసుపు రాసుకోవడం మొదలు పెట్టాను ఆ సువాసానికి నా మతి పోతుంది. అలా స్నానం చేసి ఒక cotton చీరను కట్టుకుంటూ అద్దంలో నన్ను నేను చూసుకుంటుంటే చాల సంతోషం వేసింది. అలా చీర కట్టుకొని జడ వేసుకుంటుంటే ఇక లైఫ్ లాంగ్ నేను ఇక్కడే ఇలానే ఉండిపోవాలి అని పించింది. ఇంతలో కృతి నా దాగరకు అమ్మ అంటూ వస్తే. తాను ముఖం చూసి తాను చెప్పకపోయినా ఆకలి వేస్తుందని అర్ధమైంది బహుశా ఇదే అమ్మ తనం అనుకుంటానేమో. అలా తనకు భోజనం తినిపించి వస్తుంటే కుమారన్ ఆఫీస్ నుండి వచ్చాడు(రు). అలా తనకి భోజనం పెట్టి ఒక్కటే ఆలోచన నేను కావియా తరపు మాత్రమే విన్నాను ఎలాగైనా కుమారన్ తరపున విషయాలు గురించి కూడా తెలుసుకోవాలనుకున్నాను. అది ఎలా తెలుసుకోడం అని ఆలోచిస్తూ ఉండంగా కుమారన్ నాతో ప్రేమగా ఏమైనా తిన్నావా ఏమైంది ఆమె ఏమైనా అంధ అని అనడం తో నాకు కావియా నాకు చూపిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి చాల తేడా ఉంది అని అనిపించింది. అసలు నిజం ఏంటో ఎందుకు నేను శాశ్వతంగా కావియా ల ఉండిపోవాలని అనుకుంటున్నాను..............................
ఆలా కుమారన్ కి భోజనం వడ్డిస్తూ ఉండగా ఎదో తెలియని వింత అనుభూతి ఇన్ని రోజులు అమ్మ నాన్నలు నాకు భోజనం పెడుతుంటే తినేసి వెళ్లిపోయేవాడిని కానీ ఇన్నాళ్లు ఒక్క మగాడిగా ఉన్న నేను ఇప్పుడు ఒక్క స్త్రీ గ మారి ఇలా ఒక్కరికి చీర కట్టుకొని వడ్డిస్తుంటే ఎంతో హాయిగా ఉంది. ఆలా కుమారన్ భోజనం చేస్తునంత సేపు నేను తననే చూస్తుండిపోయాను ఆలా చూడకూడదు అని అనుకున్తున్నా నా కాళ్ళు మాత్రం తననే చూస్తున్నాయి. ఆలా నేను తనని చూడడం గమనించిన కుమారన్ నాకు ప్రేమగా తినిపించడం మొదలు పెట్టాడు. ఇంతలో వాళ్ళ అమ్మ గారు రాగానే ఏమి తెలియనట్టు తినడం మొదలు పెట్టాడు. ఇలా తాను భోజనం చేసి లేచాక నేను తిందామని ప్లాత్రే తీసుకుంటుంటే మా అత్తగారు ఏమిటే కొత్త అలవాటు భర్త తిన్న ప్లేట్ లోనే తినాలని మర్చిపోయావా అని గట్టిగ అంది. ఆ అరుపుకి కుమారన్ వచ్చి సర్ది చెప్తూడంగా మా అత్తగారు కోపం చూసి కుమారన్ నన్ను అరవడం మొదలు పెట్టాడు. నాకు ఈ విషయంలో ఎవరిది తప్పు ఉంది అర్ధం అయింది. నేను అలాగే ఒక్క నిజమైన భార్యల కుమారన్ ప్లేట్ లో నే తింటుంటే కృతి నా దాగరకు వచ్చి నా జడను లాగింది తింటుండంగా లాగడంతో కోపం వచ్చిన అది ఎందుకో తెలియదు తనను చూసి చిన్నగా నవ్వాను. కానీ నా జుట్టు నా ముఖం పై పడుతూఉంటే నేను తినడానికి చాల ఇబ్బంది పడ్డాను. కానీ కుమారన్ నా దగ్గరకు వచ్చి నా జుట్టును కొప్పుల వేసి దానికి క్లిప్ పెట్టాడు. నాకు చాలా సంతోషం వేసింది అలా నేను భోజనం చేసి అన్ని పాత్రలు కడిగి పడుకోవడానికి వెళ్తుంటే మా అత్తయ్య తన మెడిసిన్ కోసం వెతుకుంటుంటే నేను సహాయపడ్డాను ఆలా సహాయ పడినందుకు కూడా తాను నాపై కోపపడింది. అలా అత్తయ్య అనడంతో కావియా రూపం లో ఉన్న నేను ఏడుస్తూ గదిలోకి వెళ్ళాను ఇదంతా చూస్తున్న కుమారన్ కృతి నా దగ్గరకు వచ్చి నన్ను ఓదార్చారు కృతి ఏమో నా కన్నీళ్లను తుడిచింది. ఆ క్షణం నేను కావియా కి ఎంతగానో థాంక్స్ చెప్పాను. అలా పడుకుంటుండగా పొడవాటి జుట్టు నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది దానికి తోడు ఈ మల్లెపువ్వులు వాసనా నాకే మతి పోగొడుతుంది. ఆ మల్లెపువ్వులు సువాసనకు కుమారన్ నా దగ్గరకి వస్తుంటే కొంచెం భయం వేసింది ఇంతలో కృతి మా ఇద్దరి మధ్యలో వచ్చి ఆడుకోవడం మొదలు పెట్టింది. అలా ఈ రోజు కృతి వల్ల తపించుకున్నాను. అలా మరుసటి రోజు పొద్దునే లేచి స్నానం చేసి ఒక్క మంచి కాటన్ చీరను కట్టుకొని ప్రశాంతంగా జడ వేసుకుంటూ అద్దములో నన్ను నేను చూసుకొని మురిసిపోతున్నాను చేతినిండా గాజులు వేసుకొని జడ వేసుకుంటుంటే ఆ శబ్దానికి నాలో ఒక్క చిలిపి ఆలోచన ఎందుకు నేను శాశ్వతంగా కావియాల ఉండిపోకూడదూ అని అనుకుంటూ జడ వేసుకోవడం పూర్తి చేశాను. ఇక నుదుటిపై కుంకుమ బొట్టు ఇవ్వని పెట్టుకుంటుంటే నాలో ఇంకా ఈ ఆశ పెరిగిపోతుంది ఇక నేను రెడీ అయ్యి కుమారన్ కి అలానే అత్తయ్యకు కాఫీ పెట్టడానికి వెళ్తుందంగా ఎవరో తలుపు తట్టారు తెరిచి చూస్తే నా స్నేహితురాలు మధుమతి తనను చూసి దాదాపు ఆరు సంవస్త్సరాలు అయింది. కానీ విచిత్రం ఏమిటంటే తనేమో నా(విమల్) స్నేహితురాలు తాను నా ఇంటికి పోబోయి కావియా ఇంటి తలుపు తట్టింది కానీ ఒక్క క్షణం నేను కావియా లా ఉన్నానని మర్చిపోయి గట్టిగ తనని వాటేసుకున్నాను ఇంతలో నా గాజుల శబ్దం వినగానే ఈ లోకం లోకి వచ్చి క్షమించండి నేను నా స్నేహితురాలు అనుకున్నాను అని అనడంతో తాను ఎం మాట్లాడలేదు ఇంతలో నా రూపం లో ఉన్న విధక్షుడు వచ్చాడు. ఇలా ముగ్గురం కలిసి మాట్లాడుకుంటుండంగా విమల్ నన్ను తనకు అక్క అవుతుందని పరిచయం చేసాడు.
ఇలా ఉండంగా మధుమిత విమల్ తో (అంటే విదక్షుడితో) తనని పెళ్లి చేసుకోమని అడగడంతో నేను విధక్షుడు ఒకరి ముఖాలను ఒకరం చూసుకున్నం. ఇంతలో కుమారన్ రావడంతో నేను లేచి తనని కూర్చోమని చెప్తూడంగా విధక్షుడు చిన్నగా నవ్వు కున్నాడు. అలా నా స్నేహితురాలు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని అడగడం తో ఎం చెప్పాలో తెలియని పరిస్థితి ఎందుకంటే నేనున్నదీ కావియా రూపం లో. అలా కొన్తతసేపటకి నా బాధని అర్ధం చేసుకున్న (విధక్షుడు) విమల్ నా దగ్గరకు వచ్చి ఇక నైనా మించిపోలేదు నువ్వు తిరిగి నీ రూపం లోకి మారిపో నీకు అద్బుతమైన జీవితం ఉంటుందని చెప్పిన కావియాకు ఇచ్చిన మాటకోసం నేను కుదరదు అన్నాను. కానీ తనతో నేను పెళ్ళికి సిద్దమే కాకపోతే ఒక్క ఇయర్ ఆగాలని చెప్పమని చెప్పాను.
అలా నా పెళ్లి గురించి చర్చ జరిగిన నాకు మాత్రం ఇలా కావియా రూపం లో ఉండడం చాల నచ్చింది. అలా ఒక్క నెల రోజులు గడిచిపోయాయి. కానీ నేను అత్తయ్యను కావియా వచ్చేలోపు మారుద్దాం అని అనుకుంటే అయ్యే పనిలా లేదు. ఇలా ఉండంగా ఒక్క రోజు కుమారన్ ఆఫీస్ నుండి త్వరగా వచ్చి నాతో వాళ్ళ ఆఫీస్ లో పార్టీ ఉందని కౌప్లేస్ గ రమ్మన్నారని అనడంతో ఒక్కపక్క సంతోషం వేసిన మరో వైపు నేను తన భార్య రూపం లో ఉన్న విమల్ అని గుర్తుకొచ్చి సైలెంట్ అయ్యాను తాను నాతో రేపు వస్స్తున్నావా అడుగుతుందంగా వస్తానని చెప్పాను. అలా మరుసటి రోజు పార్టీ కోసం అని ఒక లేత గులాబీ రంగు chiffon సారీ ని కట్టుకొని తల నిండా పువ్వులు పెట్టుకొని రెడీ అయ్యాను అలా మేము పార్టీ కి కారులో వెళ్తుందంగా కార్ మొత్తం మల్లెపువ్వులు సువాసన ఇక ఆ క్షణం లో కుమారన్ గాని నాకు గట్టిగా ముద్దు పెట్టడం మొదలు పెట్టాడు ఆపదామని అనుకున్న, తప్పని తెలుసు కానీ నేను తనని నెట్టేయకుండా ఆ ముద్దుని ఎంజాయ్ చేశాను అలా ఒక్క 10 నిమిషాల తరువాత మేము తిరిగి మా లోకం లోకి వచ్చాము. ఇలా ఆఫీస్ కి వెళ్ళగానే పెద్దగా మా ఇద్దరినీ ఆహ్వానించారు తనని ఎంప్లొయెర్ అఫ్ ది ఇయర్ అనౌన్స్ చేయగానే నిజమైన భార్యల నేను చాలా సంతోషించాను. అలా ఆ పార్టీ ముగిందుకొని ఒక్క హోటల్ లో డిన్నర్ చేసి కుమారన్ సంతోషం లో మందు ఎక్కువగా తాగేశాడు. ఇక్క చేసేది లేక నేను తానై మోసుకుంటూ కారులో పడుకోబెట్టి నేను డ్రైవ్ చేయడం మొదలు పెట్టాను అదే నా పై కుమారన్ కి అనుమానం కలిగేలా చేస్తుందని తెలియదు నాకు. అలా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చి తనని పడుకోబెట్టి ఫ్రెషప్ అయి నార్మల్ చీరను కట్టుకొని వచ్చి తన పక్కన కూర్చున్నాను. అలా ఆ మత్తులో కుమారన్ నా వొంటిని ఎక్కడెక్కడో తాకడం మొదలుపెట్టాడు. అలా ఆ క్షణం నేను కంట్రోల్ తప్పి తాను నేను కలిసిపోయాము. కానీ పొద్దున లేవగానే నాలో ఏదో తెలియని తప్పు చేసామేమో అన్న భావన అలా ఆలోచిస్తూ ఉండంగా కృతి మా దాగరకు వచ్చి ఆకలి వేస్తుంది అని అనడంతో నేను ఈ విషయాన్నీ మర్చిపోయి తనకు horlicks కలిపిచాను అలా మూడు నెలలు గడిచిపోయాయి. అత్తయ్య కొద్దీ కొద్దిగా నన్ను అర్ధం చేసుకుంటున్నారు. మేము రోజు రోజుకి అత్త కోడలనుండి అమ్మ కూతుర్లలా మారిపోతునం ఇలా ఉండగా నాకు ఒక్కటే వాంతులు ఎం తినాలని అనిపించలేదు. కళ్ళు తిరిగి పడిపోయాను అలా స్పృహ కోల్పోయిన నన్ను హాస్పిటల్ లో జావోయిం చేయిపించారు. డాక్టర్ కుమారన్ తో congratulations మీరు తండ్రి కాబోతున్నారు అని అంది. అది విన్న నేను చాల సంతోష పడ్డాను.అలా హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంటే నాకు షాక్ ఎందుకంటే..........................
డాక్టర్ గారు ఎపుడు నేను అమ్మవానుతనని చెప్పారో ఆ క్షణం నా ఆనందానికి అవధులు లేవు. అలా PREGNRNT అయినా నాకు చాల సంతోషం వేసింది ఎందుకంటే అమ్మతనం ఒక్క వరం అది నేను ఆస్వాదించ బోతున్నాను అది కూడా కావియా రూపము లో ఉంటూ. ఇదంతా ఆలోచిస్తూ కారులో వస్తుంటే మా అత్తయ్యగారు కుమారన్ తో
అత్తయ్య : నాన్న నాకు డ్రైవింగ్ నేర్పించమంటే నేర్పించలేదు కానీ నీ భార్యకు మాత్రం నేర్పించావు
కుమారన్ : నేను కావియాకి కారు నడపడం నేర్పించలేదు అమ్మ ఎందుకు ఇలా అడుగుతున్నావు
నేను నా మనసులో (అంతే కావియాకు కారు నడపడం రాదా అనే ప్రశ్న)
అత్తయ్య : అదే నాన్న నీకు ఎంప్లొయెర్ అఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిన రోజు కవియనే కారు తొలికుంటూ వచ్చింది అని చెప్పింది
కుమారన్ : కావియా నీకు కార్ నడపడం రాదూ అన్నావ్.. అని అనగానే ఎం లేదండి మన ఎదురింటి విమల్ నేర్పించాడు అని చెప్పి తపించుకున్న .
నాకు ఇంతలో ఒక్క షాక్ ఎందుకంటే కావియా దగ్గరనుండి PHONE (నేను తన కాల్ లిఫ్ట్ చేయలేదు ఇంతలో మెసేజ్ ఏమిటంటే తాను బస్సు స్టాండ్ లో దిగనని మెసేజ్ చేసింది నాకు ఎం చేయాలో అర్ధం కావడం లేదు)
అలా తన దగ్గరనుండి కాల్ రాగానే అమ్మను అవుతునానే సంతోషం కన్నా కావియా వచ్చేసిందని చాల టెన్షన్ పడ్డాను. ఇలా టెన్షన్ పడుతూనే ఇంటికి చేరిపోయాను నేనేమో కావియా కు మాట ఇచ్చినట్టుగానే అత్తయ్యను మార్చగలిగాను. అత్తయ్యకు ఉన్న భయం ఏమిటంటే ఎక్కడ తన కొడుకుని తన నుండి వేరు చేస్తుందేమో అని ఆ భయం పోవడంతో చాల సంతోషపడింది. అలా ఇంటికి చేరుకోగానే నా రూపము లో మారిపోదాం అని అనుకున్న భయం తో కానీ నేను PREGNENT అన్న విషయం గుర్తొచ్చి వెంటనే విదక్షుడిని తలుచుకున్నాను. తనకి నా విషయం చెప్పను అందుకు విధక్షుడు నీ రూపమ్ లో మారితే ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతేంటి అని అందంతో అదే ఆలోచనలో పడ్డాను ఇంతలో విధక్షుడు నువ్వు ఇలానే కావియా దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పు అని అనడంతో అలా చెపితే నేను శాశ్వతంగా కావియా రూపము లో ఉండిపోవాల్సి వస్తుందని చెప్పను కానీ (మనస్సులో నాకు కావాల్సింది కూడా అదే అని అనుకుంటుండంగా మల్లి విధక్షుడు ముఖం లో ఒక్క చిరు నవ్వు)
ఇక చేసేది ఏమి లేఖ నేను కావియాకు మెసేజ్ చేశాను వచ్చి కలుస్తానని. నేను అత్తయ్య కుమారన్ తో ఇప్పుడేయ్ వస్తాను అని చెప్పి వెళ్తుందంగా కుమారన్ కూడా నాతో వస్తానని చెప్పడంతో నాకేం చేయాలో పాలుపోలేదు. అలా నేను కావియా రూపము లో కుమారన్ తో నిజమైన కవియను చూడడానికి వెళ్తుంటే న గుండెల్లో రైలు పరిగెత్తుతుంది ఇలా కొంత బస్సు స్టాండ్ చేరుకోగానే నాకు విపరీతమైన చెమటలు పట్టేసింది. అలా నేను కార్ దిగి చూస్తే నా కళ్ళను నేను నమ్మలేక పోయాను ఎందుకంటే కావియా ఉండవలసిన స్థానం లో విమల్ ఉన్నాడు. అసలు ఎం జరిగిందో అర్ధం అయ్యేలోపు నా రూపము లో ఉన్న కావియా కుమారన్ దాగరకు వచ్చి కంగ్రాట్స్ చెప్పారు. అలా విమల్ ను కారులో తిరిగి ఇంటికి పిలుచుకొచ్చాము.
అలా తాను తన ఇంటిలోకి మేము మా ఇంటిలోకి వెళ్ళిపోయాము నాకు అసలు ఎం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత. అలా ఉండలేక నా రూపము లో ఉన్న కావియా దగ్గరకు పోయి తెలుసుకుందామని తన ఇంటి తలుపు తట్టాను. విమల్(కావియా) తలుపు తీసాడు. నేను తనతో అసలు ఎలా అని అడుగుతుండంగా తాను నన్ను మీద పైకి తీసుకెళ్లి జరిగింది ఎదో చెప్పడం మొదలు పెట్టాడు
నేను ఒక్కరోజు ట్రెక్కింగ్ కి వెళ్ళినపుడు ఒక్క ఆటవి ప్రాంతంలో స్పృహ తప్పి పది ఉన్న ఆవిడకు సహాయం చేశాను. అలా సహాయం చేసిన తరువాత ఎదో అద్భుతంలా తాను ఒక్క దేవకన్యలా మారిపోయింది నాకున్న కష్టాలను ఆమెకు చెప్పుకున్నాను ఆమె న్నా కళ్ళలో చూసి నీకు ఒక్క వారని ఇస్తాను నువ్వు ఎవరి రూపము లోకైనా శాశ్వతంగా మారవచ్చు. అలాగేయ్ నువ్వు వారి జీవితానికి బాగా అలవాటు ఆడిపోతావు అని చెప్పింది నీనుకొంత సేపు అలా కూర్చొని ఆలోచిస్తుండంగా నువ్వు గుర్తొచ్చావ్ వెంటనే నీ రూపము లో మారిపోయాను కానీ నా నిజరూపం లోకి మారలేని పరిస్థితి. ఇలా ఈ విషయం నీకు చెప్తామని వచ్చాను ఇంతలో మధుమతి కనిపించి కావియా ప్రెగ్నెంట్ గ ఉందని చెప్పింది నాకేం అర్ధం కాలేదు నేను ఇక్కడుంటే మరి నా స్థానం లో యున్నది ఎవ్వరు అనే ప్రశ్న తీరా నిన్ను చూసాక నాలో ఎన్నో ప్రశ్నలు.
అం చెప్పి పూర్తి చేయగా నేను నాకు జరిగిన విషయాన్నీ మొత్తం చెప్పను ఇక ఒక్క పెద్దహా శబ్దం విధక్షుడు నుండి ఇకపై నువ్వు కావియాలనే ఉంటావని. ఇలా మా రూపములు మారిపోయానని నాకు సంతోషం లో ఉన్న విమల్ కి మాత్రం ఎప్పుడు కృతి పైనే ఆశ. అలా ఒక్క 7 నెలలు గడిచిపోయాయి. నాకు విపరీతమైన నొప్పులు భరించలేక పోతున్నాను. అలా నన్ను హాస్పిటల్ చేర్చారు కొంత సేపటికి నాకు ఒక్క కొడుకు పుట్టాడు ఆ బిడ్డను ఎప్పుడైతే చూశానో అంత వరకు పెద్దనోప్పులని మర్చిపోయాను. బహుశా అమ్మతనానికి ఉన్న గొప్పతనం ఇదే ఏమో ఆ క్షణాన నేను పరిపూర్ణ మైన స్త్రీగా మారిపోయాననే సంతోషం ఇలా సంతోష పడుతుందంగా ఇంతలో బాబు ఏడుపు వెంటనే అప్రయత్నాంగా పాలు ఇవ్వడం మొదలు పెట్టాను. అలా ఆ క్షణం నాకు ఈ వారని ఇచ్చిన విదక్షుడికి అలానే కావియా కు మనస్సులో కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇలా నేను శాశ్వతంగా కావియాళ ఉండిపోయాను అలానే కొద్దిరోజులకు నా రాపం లో ఉన్న కావియా అదే అదే విమల్ లు మధుమతి కి గానంగా పెళ్లి జరిగింది ఇలా మా ఇద్దరి జీవితాలు సంతోషంగా ముగిశాయి
కథ సమాప్తం.....................................


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Meghana Meghana

Chala baga rasaru Sandhya sri..chinna chinna tappulu vunnai..but I can understand that Telugu typing is not easy.

Sandhya_Sri Sandhya_Sri (Author)

yeah that's true thanks for your support,