పదమూడేళ్ళకు ఇల్లు విడిచితి
రోడ్లెక్కాను. రోటీ లేదు.
ఆశగ అడిగా ఎవ్వరియ్యలే
ఏం సెయ్యాలో తెలియదాయే
పదమూడేళ్ళకు ఇల్లు విడిచితి
దారీ తెన్నూ ఎరుగనైతిని
మాటలోను తేడా..
నడకలోనూ తేడా
చూపులోనూ తేడా
తీరులోనూ తేడా
చూసి చూసి ఈడు తేడా..
అంటూ ..పకపకా నవ్వినారు
ఒక్క పైస ఇవ్వకుండనే
పట్టుకు అంతా తడిమే వారు
అబ్బా... అబ్బా... అబ్బబ్బా
అబ్బా... అబ్బా... అబ్బబ్బా (Crying )
పదమూడేళ్ళకు ఇల్లు విడిచితి
దారీ తెన్నూ ఎరుగనైతిని
ఇంతలోనా కొందరక్కలు
గురుమా చెంతకు తీసుకెళ్ళిరి
రెండు మూడేళ్ళు బిచ్చమెత్తితిని
బహుచర మాతకు పూజ నేర్పిరి
పదమూడేళ్ళకు ఇల్లు విడిచితి
గురుమా నీడకు నేను చేరితిని
చప్పట్లు... బాగా చప్పట్లు
చప్పట్లు... బాగా చప్పట్లు
హాయి... హాయి.. హాయి...
బలె.. హాయి... హాయి... హాయీ(laughter)
ఈ లోపు నా డ్రెస్సు మారె
నా మాట కుదురు కొనే
నాకు నచ్చిన లంగా కట్టా
పొంగుల చూపే రైకలు తొడిగా
నలభై రోజుల పండుగ జరిపి
గురుమా చూపిన మార్గంలోనా
చేలాలందరి సహకారం తో
కన్నెను చేశారు...నన్ను కన్నెను చేశారు
ఓహొ... ఓహొ...ఓహొ..
హొహొ..ఏమి .. ఏమి...రోజు (laughter of all)
పదమూడేళ్ళకు ఇల్లు విడిచితి
గురుమా దయతో కన్నెనైతిని
చప్పట్లు... బాగా చప్పట్లు
చప్పట్లు... బాగా చప్పట్లు
చేతికి గాజులు... మోము కి బొట్టు
కోకా, రైక, చుడీదార్లు.. బాగా కట్టా
గురుమా ఇచ్చిన మందులతో నా
కన్నె పొంగులన్నీ బాగా పెరిగే
నాకు రేటు బాగా పలికెను
గురుమాకు నే దగ్గరైతిని
పగలు యాచన రాత్రి యాతన
సుఖమడిగేవారే కానీ ... సుఖపెట్టేవారు లేరు
పదమూడేళ్ళకు ఇల్లు విడిచితి
గురుమా దయతో కన్నెనైతిని
నే కోరినట్లు మహిళనైతిని
ఏ తీరానికో పయనమైతిని
ఏ తీరానికో పయనమైతిని
ఏ తీరానికో పయనమైతిని
ఏ తీరానికో పయనమైతిని
Discussion (0)