Family · Telugu

మజిలీ

మజిలీ Cover Image
In Progress | Part 7 of 11 | 1 Likes

Part 7

అవును బేబీ... నీ లగేజ్ లో ఒక కవర్ పెట్టాను.... అది నీకోసమే అన్నాడు

ఓకే చూస్తాను .... ఢిల్లీ చేరుకున్నాక ఫోన్ చేయండి అన్నాను.

ఓకే బేబీ .... సీ యూ సూన్ అని ఫోన్ కట్ చేసాడు సిద్ధార్ధ్

లగేజ్ లో తను చెప్పిన కవర్ కొరకు వెతికాను. దొరికింది. అది కొంచెం లావుగా ఉంది. ఓపెన్ చేసి చూస్తే రెండు రెండువేల రూపాయల కరెన్సీ నోట్ల కట్టలు మరియు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉన్నాయి.

ఒక చిన్న స్లిప్ రాసిపెట్టి ఉంది .... "నీ పర్సనల్ థింగ్స్ కొనుక్కోవడం కోసం ..... నా కొరకు తన జీవితాన్నే చివరికి తన గుర్తింపునే మార్చుకుంటున్న నా కాబోయే లైఫ్ పార్టనర్ కి ఏదీ తక్కువ కాకూడదు .... విత్ లవ్ సిద్ధార్ధ్" అని వ్రాసి ఉంది.

అవి చూసిన నాకు గుండె గొంతుకలోకొచ్చింది . ఏం చేశానని ..... నాలో ఏముందని ఇతనికి నామీద ఇంత ప్రేమ? దీనిని నేను నిలుపుకోగలనా?

ఎట్లాగైనా ఈ ప్రేమను నా చివరి శ్వాస వరకు నిలుపుకోవాలి .... నాకోసం ఇంత చేస్తున్న సిద్ధార్ధ్ కొరకు నా జీవితాన్నిచ్చేయాలి అని స్థిరంగా నిర్ణయించుకున్నాను.

మరుసటి రోజు ఉదయం మా అమ్మానాన్నలు వస్తారని వారికోసం తయారుగా పెందలకడనే లేచి వాళ్ళిద్దరికోసం బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి స్నానం చేసి ఈ రెండురోజుల్లో జరిగిన మార్పుని మాటల్లో చెప్పకుండా చేతల్లో వాళ్లకు చూపించాలని త్వరత్వరగా స్నానం చేసి సిద్ధార్ధ్ కొన్న చీరల్లో మంచి క్రీం కలర్ గద్వాల్ చీర తీసుకుని దానికి మాచింగ్ బ్లౌజ్ వేసుకుని డ్రెస్ చేసుకుని కొంచెం మేకప్ చేసుకొని వాళ్ళిద్దరి కోసం ఎదురుచూస్తుండగానే బయట ఆటో శబ్దం వినిపించింది.

తలుపు తీసి చూస్తే ..... షాక్ ఏమిటంటే అమ్మవాళ్లతో పాటు అక్కకూడా వచ్చింది. ఇద్దరి బస్సులు ఒకేసారి రావడంతో ముగ్గురూ కలసి వచ్చారట.

తలుపు తీసి చూస్తే ..... షాక్ ఏమిటంటే అమ్మవాళ్లతో పాటు అక్కకూడా వచ్చింది. ఇద్దరి బస్సులు ఒకేసారి రావడంతో ముగ్గురూ కలసి వచ్చారట.

నన్ను చూడగానే అక్క "ఏమిటే? రెండు రోజుల్లోనే ఎంత మార్పు? అమ్మానాన్నలు ఊర్లో లేకుండా చూసుకొని మీ ఇద్దరూ చాలా చేసినట్లున్నారే?" అంటూ బుగ్గలు నొక్కుకుంది.

నీకన్నా ఆడతనాన్ని బాగా చూపిస్తాను అన్నాను కదా .... అంటూ ఆమెను చూస్తూ కన్ను కొట్టాను. అమ్మా నాన్నా కూడా ఆశ్చర్యంగా చూస్తుంటే "నాన్నా! ఫ్రెష్ అయిపోండి. బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసేశాను .... ఫ్రెష్ అవ్వండి. మీతో మాట్లాడాలి." అన్నాను.

మా అమ్మ "ఏమిటో అంత ఇంపార్టెంట్ విషయాలు" అంటూ నన్ను క్రింది నుండి చూస్తూ నేను కట్టుకున్న చీరనూ, నా మేకప్ ను చూస్తూ ఆశ్చర్యపోసాగింది.

"షాక్ అయ్యింది చాల్లే గానీ త్వరగా తయారై టిఫిన్ తిను లేకపోతే షుగర్ పెరిగిపోద్ది" అంటూ ఆమెను వాళ్ళ బెడ్ రూంలోకి నెమ్మదిగా నెట్టుకుంటూ వెళ్ళాను.

ఇక అక్కా, నేనూ హాల్లో మిగిలాము. మా అక్క నన్ను చూస్తూ "ఏమిటే .... ఈ రెండు రోజుల్లో ఏమి చేసేశాడు నిన్ను..... ఆ చీరకట్టూ, మేకప్పూ మామూలు ఆడదాన్ని మించిపోయేలా" అంటూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతుంటే ....

ఏమిలేదు నీతో కూడా చాలా విషయాలు మాట్లాడాలి .... నిన్న సిద్ధార్ధ్ వాళ్ళమ్మగారు కూడా కలిశారు. నాకోసం షాపింగ్ కూడా చేశారు. సిద్దార్ధ్ ముఖ్యమైన పని మీద క్యాంపుకి వెళ్లారు. నువ్వుకూడా ఫ్రెష్ అయ్యి రావే .... నేను కూడా ఏమీ తినలేదు... ఆకలి వేస్తోంది అన్నాను.

తను కూడా లోపలి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. నేను టీవీ చూస్తూ కూర్చున్నాను. ఈలోపులో అమ్మా వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు. ఒక పావు గంటలో టిఫిన్ ముగించి హాల్లో కూర్చున్నాము.

నాన్న "ఇప్పుడు చెప్పరా! ఏమిటి సీరియస్ గా మాట్లాడాలి అన్నావు" అని అడిగారు. నేను లేచి వెళ్లి సిద్ధార్ధ్ ఇచ్చిన డాక్యుమెంట్స్ మా నాన్నగారి చేతికి ఇచ్చాను.

ఏమిట్రా ఇవి? అన్నారు మా నాన్న. నేను "ఏమో సిద్ధార్ధ్ ఇచ్చారు... మీకిమ్మని. చిన్న కవర్లో చెక్ ఉందట. ఆ అమౌంట్ తో అప్పుల్ని తీర్చెయ్యమన్నారు .... " అన్నాను . అక్క అమ్మ ఇద్దరూ షాక్ తో చూస్తున్నారు.

నాన్న కవర్ తెరచి చూశారు. అందులో డాక్యుమెంట్స్ చూసి, ఆ చెక్ మీద తాను వేసిన ఫిగర్ చూసి ఆయన కూడా షాక్ అయ్యారు. కాసేపటికి తేరుకుని "మా అమ్మతో వాళ్ళు ఏదో వాళ్ళబ్బాయి సరదా తీర్చడానికి ఎంతో కొంత ముట్టచెబుతారు అనుకున్నాను. వీడి పేరున విల్లా కొనేసి రిజిస్టర్ చేయించారు.. ఇక ఆ చెక్ విలువ 50లక్షలు." ఇక మన కష్టాలు తీరిపోయినట్లే. కాకపోతే ఇక మనవాడిదే భారమంతా... ఆ ఇంట్లో యెట్లా ఇమడగలుగుతాడో? అదీ ఒక ఆడదానిలా.... వాళ్ళమ్మగారికి ఇష్టం లేకున్నా వాళ్ళబ్బాయి కోసం ఒప్పుకున్నట్లుంది. ఆమెకు ఇష్టం లేని వ్యక్తి అదీ ఒక మగాడు ఆడదానిలా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆమె యెట్లా వేగనిస్తుందో మనవాడిని" అన్నారు.

ఆయన అట్లా అనగానే మా అక్క "ఆవిడ ఎప్పుడో మీ చిన్నమ్మాయిని కోడలిగా అంగీకరించేసింది.... నిన్న కాబోయే కోడలి కోసం దగ్గరుండి చీరలూ, నగలూ షాపింగ్ చేసిపెట్టింది. మీరేమీ కంగారు పడనక్కరలేదు" అంటూ "ఏమే! చెప్పవే .... నాన్న అంత కంగారు పడుతుంటే" అంటూ నా వీపు పైన చిన్నగా చరిచింది"

అమ్మ కూడా తక్కువ తినలేదన్నట్లు "వచ్చినప్పటి నుండి చూస్తున్నాను.... ఆ చీర కట్టుకోవడం, మనకోసం టిఫిన్ చేసి ఉంచడం, ఆ కట్టూ బొట్టూ రెండురోజుల్లోనే మార్చేసింది... ఇక తన పెళ్ళైన వెంటనే మనల్ని మర్చిపోతుందేమో" అంటూ వేళాకోళంగా మాట్లాడుతుంటే

నాన్న మాత్రం గంభీరంగా "మనం ఉన్నంత వరకు ఇట్లా మగవాడు ఆడదానిలా ఉంటాడు ... ఆ సిద్ధార్ధ్ పెళ్లి చేసిన తరువాత యెట్లా ఉంటాడో .... తరువాత ఒక మగవాడిని ఆడదానిలా మార్చిన తరువాత సరదా తీరిపోయింది వదిలేస్తే వీడి భవిష్యత్తేమిటని ఇప్పటివరకు భయపడుతూనే ఉన్నాను. కానీ సిద్ధార్ధ్ వీడికి ఆర్ధిక భద్రతని చూపించాడు నా భయాన్ని తొలగించేసాడు" అన్నారు.

అక్క మాత్రం "నాన్నా! ఇక వీడు నీ కొడుకు కాదనే విషయం గుర్తుంచుకోండి. సిద్ధార్ధ్ మనకోసం అంత చేసిన తరువాత మనవాడు తనకోసం ఇంతగా మార్చుకున్న తరువాత మనం వాడిని అమ్మాయిలాగానే చూడాలి. ఒక్కటి మాత్రం చెప్పగలను నా చెల్లి అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరు. అంత బాగా చూసుకునే అత్తగారు, భర్త ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఏమి కావాలి?" అంది.

నేను ఇదే మంచి సమయం అనుకొని "నాన్నా! నిన్న రాత్రి నన్ను వాళ్ళ ప్రాపర్టీస్ చూపించడానికి సిద్ధార్ధ్ నన్ను బయటకి తీసుకెళ్లారు. అదే విధంగా ఈ డాక్యుమెంట్స్, చెక్ అన్నీ ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు షాపింగ్ కి తీసుకెళ్లి నాకు చీరలు, నగలూ, ఇతర డ్రెస్సెస్ కొనిపెట్టారు. ఆమె నన్ను మనస్ఫూర్తిగా కోడలిగా అంగీకరించినట్లే. తను ఈ ప్రాపర్టీ అంతా నా పేరునే రిజిస్టర్ చేశారు. అంతే కాక తనను భర్తగా అంగీకరించినందుకు నా పేరున కొంత బ్యాంకు డిపాజిట్స్ కూడా వేశారు. నాకోసం ఇంత చేసిన వాడికోసం నేను కూడా ఖచ్చితంగా ఒకటి చేయాలనుకొంటున్నాను. నేను సర్జరీ చేయించుకొని శాశ్వతంగా స్త్రీగా మారిపోవాలనుకుంటున్నాను. ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. సిద్ధార్ధ్ తో చెబితే మీ అంగీకారం కూడా తీసుకోమ్మన్నార. మనకోసం ఇంత చేసిన ఆ కుటుంబానికి నన్ను నేను ఆడదానిగా మార్చుకొని నిజంగానే ఆ ఇంటి కోడలిగా ఉండాలనుకుంటున్నాను. ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్నాను" అని చెప్పి వాళ్ళ రియాక్షన్ కోసం చూసాను.

4657 Views 1 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (1)

NPBOY72
NPBOY72 1 month, 1 week ago

Write about nose piercing scene with as if yourself are being pierced

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login