Family · Telugu

Life of Jhanaki

Life of Jhanaki Cover Image
In Progress | Part 2 of 2 | 2 Likes

Part 2

Part 2 Image

Chapter 2 : నాలో వచ్చిన మార్పు
మరుసటి రోజు ఉదయం 8 గంటలు అవుతోంది. నేను బయటకు వచ్చేంతలో సుధ మరియు రమ్య వచ్చారు. "ఏంటి, నిద్ర బాగా పట్టిందా?" అని అడిగారు. నేను కొంచెం ముఖం చిన్నబుచ్చుకుని, "ఆ.. పర్లేదు" అని చెప్పాను. దానికి సుధ "ఏం కాదులే, అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. సరే, మనం తయారై అలా గుడికి వెళ్దాం జానకి. ఈరోజు మధ్యాహ్నం లోపే మనం పక్క ఊరికి వెళ్ళాలి, మళ్లీ ఇక్కడే అసలు ఏమీ చూడలేదు కదా" అని అంది. సరే అని మేము వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని, ఒకరి తర్వాత ఒకరం వెళ్లి స్నానం చేసి వచ్చాము.
నేను ఇంకా ప్యాంటు, చొక్కా వేసుకుని, తడి జుట్టుతోనే కొప్పు కట్టుకుని అద్దం ముందు ఒక టోపీ పెట్టుకుంటున్నాను. నా వెనకాలే సుధ, రమ్య వచ్చి, "ఏంటి ఇలా వస్తావా గుడికి? లేదు లేదు, అలా కాదు" అని నా టోపీ తీసేశారు, ఆ దెబ్బకి కొప్పు ఊడిపోయింది. "ఏమైంది? ఇలా చేస్తారు ఏంటి? ఎలా వెళ్తాం గుడికి?" అని నేను అన్నాను. సుధ అప్పటికి ఒక బనియన్, లుంగీ మీద ఉంది. నా ముందుకు వచ్చి, "నీకు ఇంకా ఈ ఆడవాళ్ల బట్టలు ఎలా వేసుకోవాలో, జుట్టు ఎలా పెట్టుకోవాలో, ఎలా నడవాలో సరిగ్గా తెలియట్లేదు. నువ్వు ఇలాగే ఉంటే మళ్ళీ అబ్బాయి అయిపోతావు. డాన్స్ కి అది పనికిరాదు. అబ్బాయి అలవాట్లు పోవాలంటే అలవాటు పడేంత వరకు అమ్మాయి లానే ఉండాలి, నడవాలి" అంటూ నా చొక్కా గుండీలు విప్పేసింది.
ఈలోపు రమ్య కూడా వచ్చి, "నువ్వు ఈరోజు మాతో పాటు అమ్మాయి లాగానే ఉంటున్నావు, గుడికి అలానే వస్తున్నావు" అని కొంచెం గట్టిగానే చెప్పింది. వాళ్ల మాటలకి నాకు దెబ్బకి చెమటలు పట్టేసాయి. ఇక ఏం చేయలేక సరే అనేశాను. ముందు ప్యాంటు తీసాను. పసుపు రంగు ప్యాంటీ ఇచ్చారు, అది వేసుకున్నాను. ఇక ప్యాడెడ్ బ్రా ఎవరి సహాయం లేకుండానే నేనే వేసుకోగలిగాను మొత్తానికి. నా ముందే సుధ, రమ్య ఇద్దరూ చీర ఎలా కట్టుకోవాలో చూపించారు. "ఎప్పుడూ మేము ఉండము కదా సహాయం చేయడానికి, నీ చీర నీకు నువ్వే కట్టుకోవాలి" అని చెబుతున్నారు. నేను వాళ్లను గమనిస్తున్నాను.
ఇక మెరూన్ రంగు లంగా పైనుండి వేసుకున్నాను, ఆడవాళ్లలాగా పక్కకి ముడి వేశాను. ఈరోజుకి చీర ఎలా కట్టాలో చూపిస్తూ రమ్య సహాయం చేస్తోంది. ఒక బ్యాగ్ నుండి పసుపు రంగు షిఫాన్ చీర తీసి కట్టింది నాకు. చాలా మృదువుగా ఉంది ఆ చీర. కడుతుంటే నాలో నాకే సిగ్గేస్తోంది. కుచ్చిళ్ళు తీసి బొడ్డు కిందకి లంగాలోకి దోపింది, ఒక పిన్నీసు పెట్టింది, పక్కకి పమిట వేసింది. ఆ చీర కట్టాక చాలా బిగుతుగా ఉండి, భలే అనిపించింది. ఆ నిమిషం నాలో మళ్ళీ ఆడపిల్లలా అయిపోవాలి, అలానే ఉండిపోవాలి అనే భావన మెల్లిగా పుడుతోంది. ఇక మేకప్ పెద్దగా వేసుకోలేదు; చిన్నగా లిప్‌స్టిక్, కాస్త పౌడర్, కళ్ళకు మస్కారా, కాటుక పెట్టుకున్నాము. చేతికి గాజులు, చెవులకు బుట్టలు దగ్గరుండి ఇద్దరూ పెట్టారు.
ఇక నా జుట్టు చిక్కు అంతా తీసింది సుధ అక్క. తడిగా ఉన్న జుట్టును ఆరబెట్టి, మధ్యలో పాపిడి తీసి, పక్కకి రింగులుగా తిప్పుతూ, వెనక ఒక క్లిప్ పెట్టి సగం వదిలేసి, మిగిలినదంతా కింద వరకు మూడు పాయల జడ అల్లేసింది గట్టిగా. నా జీవితంలో మొదటిసారి అలా జడ వేసుకోవడం. జడ తీసి నా భుజం మీద పెట్టింది, చాలా బరువుగా అనిపించింది. నేను ఆ బరువును ఫీల్ అవుతున్నాను. ఇక ఆడవాళ్ల చెప్పులు ఇచ్చారు, నెమ్మదిగా నడుస్తున్నాను. రమ్య మరియు సుధ ఆరెంజ్, ఎరుపు రంగు చీరలు కట్టుకున్నారు. వాళ్లకి నాకన్నా జుట్టు చిన్నగా ఉంది, అందుకే చిన్న పిలకలా పోనీటైల్ వేసుకున్నారు. నాదే పెద్దగా ఉంది జడ.
ఆ గ్రూపులో అలా ముగ్గురం కలిసి కొండ మీద ఉన్న దేవుడి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకున్నాము. పూజారి గారు నాకు పూలు ఇచ్చారు. సుధ అది చూసి వెనక జడలో పెట్టి, "భలే ముద్దుగా ఉన్నావే" అని దిష్టి తగలకుండా నడుము దగ్గర ఒక చుక్క పెట్టింది. అలా అక్కడ చాలా సేపు ఉన్నాము. నాకు బాగా నేర్పించారు; ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, వేదిక (స్టేజి) మీదకు వస్తే ఎలా ఉండాలి అని. నిజం చెప్పాలంటే అదంతా నాకు కొత్తగా ఉంది. అమ్మాయిలా ఉండటం చాలా కష్టమే అనిపించినా, ఆ చీరలో ఉన్నంతసేపు నాలో రామ్ లేడు, నేను ఒక అమ్మాయినే అనే ఊహల్లోనే తేలిపోతున్నాను. అలా ఒక్కరోజులోనే నేను అన్నీ నేర్చుకున్నాను, అలానే చేస్తున్నాను. నాలో ఈ మార్పు ఏంటి అని మళ్ళీ ఆలోచనలో పడ్డాను.
చూస్తుండగానే పక్క ఊరు వెళ్ళాము. రికార్డింగ్ డాన్స్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాము. గ్రూపుకి పెద్ద మొత్తంలోనే డబ్బులు వచ్చాయి. ఇక ఆ తర్వాత వారం ఏ జాతరలూ లేవు కాబట్టి మనకు విశ్రాంతి అని, "మీ ఊరికి వెళ్లి రండి" అని చిన్న సెలవు ఇచ్చాడు మా లీడర్. నేను అన్నీ సర్దుకుని వెంటనే మా ఊరికి బయలుదేరాను. ఇంటికి రాగానే అమ్మ దగ్గరికి వెళ్లిపోయాను, చాలా రోజులైంది కదా మిస్ అయ్యాను అని హత్తుకుందామని వెళ్ళబోతుండగా, మా అమ్మ నన్ను దూరంగా నెట్టేసింది.
"ఈ ఇంటికి, నీకు ఇంకా ఎలాంటి సంబంధం లేదు" అనేసింది. నాకు అర్థం కాలేదు. "నువ్వు ఆడాంగోడిలా డాన్స్ వేస్తున్నావట, మా సర్పంచ్ గారి అబ్బాయిలు చూశారు అని చెప్పారు, నిజమా కాదా?" అని ఒకటే అడిగింది. నేను తల దించేసాను. నేను నిజం చెప్పడానికి ప్రయత్నించాను, కానీ అమ్మ వినలేదు. ఊరంతా వచ్చి తిట్టారు. "నాన్నకి ఉన్న గౌరవం, పరువు అంతా నాశనం చేసావు. ఊరికి నాట్యంతో పేరు తెచ్చింది మన కుటుంబం. మన కళ, మన వంశం ఎలాంటిది? నువ్వు ఇలా కొజ్జాలా జాతరల్లో చేస్తావా డాన్సులు?" అని నిలదీసింది. నేను క్షమించమని వేడుకున్నాను. కానీ మా అమ్మ చాలా కోపంగా ఉంది.
ఇంట్లో జరిగిన గొడవకి గ్రామంలో ఉన్నవాళ్లు చుట్టుముట్టారు. ఊరి వాళ్లంతా నేను ఏదో చేయరాని తప్పుడు పని చేసినట్టు నిలదీశారు. "పరువు తీసావు, నాట్యానికి ఉన్న పేరుని మంటగలిపావు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్లిపో, మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడా కనపడొద్దు" అని గట్టిగా తేల్చి చెప్పారు. మా అమ్మ ఏడుస్తూనే ఉంది. నేను ఇలా ఎందుకు చేశాను, నేను ఇలా కావాలనే ఎందుకు మారాను అని నాకు నిజం చెప్పే అవకాశం రాలేదు అన్న బాధతో, ఎలా వచ్చానో అలానే ఏడుస్తూ గ్రామ పొలిమేర దాటేశాను.

Written by
వసంత లక్ష్మి

అలా నా జీవితంలో ఇది ఒక మలుపు కాబోతుంది అని నేను అనుకోలేదు. ఇక్కడితో అధ్యాయం 2 సమాప్తం. తదుపరి అధ్యాయం త్వరలోనే పోస్ట్ చేయబడుతుంది. దయచేసి ఏవైనా మార్పులు లేదా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ధన్యవాదాలు.

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

Follow the author to be notified when more parts are posted.
965 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login