Family · Telugu

ఈడు జోడు

ఈడు జోడు Cover Image
Completed | Part 1 of 1 | 2 Likes
Part 1 Image

ఈడు జోడు
(అందరికీ చిన్న విన్నపం. ఈ కథను చివరి వరకూ చదవండి. మీకు ఈ కథ నచ్చితే మీ లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఇవ్వటం మరిచి పోకండి. అందరికీ ముందుగానే కృతజ్ఞతలు)

"అమ్మా, రజనీ ఈరోజు నిన్ను చూడ్డానికి పెళ్ళివారొస్తున్నారు. కొంచెం ఆఫీస్ నుంచి త్వరగా రావమ్మా!" అన్నాడు తండ్రి మాధవ్.
ఆ మాట వినగానే రజినీ కి చాలా ఆనందం కలిగింది. గుండె ఉప్పొంగింది. అయితే వెంటనే మళ్ళీ ఏదో డౌటొచ్చి అడిగింది. నాగురించి చెప్పావా నాన్నా. అలాగే నా కండిషన్స్ ఏమిటో కూడా చెప్పావా నాన్నా?
"చెప్పానమ్మా.... వాళ్ళకి నీ కండిషన్స్ చాలా బాగా నచ్చాయి. నీకు లాగే పెళ్ళికొడుక్కి కూడా సింగిల్ పేరెంట్. అయితే పెళ్ళికొడుక్కి కూడా ఒక కండిషన్ ఉందిట. నేను సరే అన్నాను. ఈ సంబంధం కుదిర్చింది మాలీ పిన్ని. నువ్వు సాయంత్రం త్వరగా వచ్చెయ్. అమ్మా." అని చెప్పాడు.
రజనీ కి మాలీ పిన్ని కుదిర్చింది అనేసరికి చాలా ఆనందం కలిగింది. రజనీ గురించి మాలీకి చాలా బాగా తెలుసు. మాలీకి తనకు నచ్చే సర్కిల్ బాగా ఎక్కువ. అయితే మరి వాళ్ళకండిషన్ ఏంటి నాన్నా? అని అడిగింది. "సాయంత్రం తెలుసుకుందువు గాని. త్వరగా వచ్చెయ్." అని చెప్పాడు. అలాగే అని ఆఫీస్ బయల్దేరింది.
రజనీ తన తండ్రి బాల్య స్నేహితుడు శరత్ కి ఉన్న అయిదు నర్సరీల కామన్ గోడౌన్ స్టాక్ కీపర్ గా పని చేస్తోంది. శరత్ కి కూడా రజనీ గురించి బాగా తెలుసు. రజనికి స్కూల్లో, కాలేజీ లో, డిగ్రీ పూర్తి అయ్యేవరకూ ఏ సమస్యా రాకుండా చూసుకున్నది శరత్తే. వచ్చే పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో? అతని కండిషన్స్ ఏమిటో అని ఆలోచిస్తూ  సాయంత్రం 4గంటలకు శరత్ అంకుల్ తో చెప్పి ఇంటికి చేరేసరికి 4.30 అయ్యింది.
ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మాలీ మాధవి కి (మాధవ్) కి సవరం తో పడేస్తోంది. మాధవి ఉప్పాడ పట్టు చీర కట్టుకుని ఉంది. మాలీ చేసిన మేకప్ కి మాధవి ఎంతో అందంగా కనబడుతోంది. మాలీ "రావే రజనీ, నీకు కూడా మేకప్ చేస్తాను." అంది. రజనీ తన తండ్రిని అలా ఆశ్చర్యంగా చూసింది. తన తండ్రి చీర కొట్టుకోవటం తనకు కొత్త కాదు. కానీ ఇలా "నా పెళ్లి చూపుల్లో నువ్వు చీరకట్టుకున్నావేంటి నాన్నా?" అని అడిగింది. "ఇదేనే పెళ్ళి కొడుకు కండిషన్. నువ్వు సింగిల్ పేరెంట్ డాటర్ వే అని తెలిసి మీ  పెళ్ళి అయ్యే వరకు వీలైతే ఆ తరువాత కూడా పెళ్ళి కూతురుకి తల్లే ఉండాలి కాని. తండ్రి గా కాదు. కారణం పెళ్ళి కొడుకు తల్లి మృదులకి తనకోడలి తల్లిని  వదిన అని పిలవాలనిఎప్పటినుంచో కోరిక. అందుకని ఈ కోరిక." అని చెప్పింది. రజనీ నిట్టూర్చింది.
వెంటనే తను మాలీ సహాయం తో చక్కగా ముస్తాబైంది. 5'4" ఎత్తున్న రజనీ పొడవాటి లెహంగా, చోళీ, దుపట్టా ధరించింది.
పెళ్ళి వారు వచ్చారు. పెళ్ళి కొడుకు తల్లి మృదుల చాలా సౌమ్యురాలు. పెళ్ళి కొడుకు పేరు ప్రేమ్.
ప్రేమ్ 5'6"ఎత్తు ఉన్నాడు. చక్కని గుండ్రని వళ్ళు. ఆకర్షణీయమైన రూపం. నిర్లక్ష్యంతో కూడిన చూపు. మంచి హెయిర్ కట్. నవ్వు ముఖం. ఇద్దరూ కాసేపు విడిగా కూర్చుని మాట్లాడుకున్నారు. ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు.
నెలరోజుల్లో ఇద్దరి పెళ్ళి తగినంత ఘనంగానే జరిగింది. ఈ నెలరోజుల్లో మాధవి, మృదుల వదిన అంటే వదిన అంటే దగ్గరయ్యారు. మాధవ్ మాధవిగా ఉండటంలో సౌఖ్యానికి అలవాటు పడి ఇంక మాధవి గానే ఉండిపోవాలని నిర్ణయం కారణంగా మాధవి మిగిలింది. మాధవ్ మాయమయ్యాడు. పెళ్ళయిన నాలుగు మాసాలకు ప్రేమ్ కి గర్భం వచ్చింది. అలా
ప్రేమ్ ఇద్దరు కవలలకి తల్లి అయ్యాడు. అయినా అదే నిర్లక్ష్యం. ప్రేమ్ మొగుడు. ప్రేమ్ ని తల్లిని చేసిన రజని భార్యే. వియ్యపురారాళ్ళకి ఇద్దరికీ మనవళ్ళతో పండగే పండగ.
ఇక్కడ తెలుసు కోవలసిన రహస్యం. రజని అసలు పేరు రాజు. అయితే చిన్నతనంలో వాళ్ళ అమ్మ బ్రతికి ఉన్నప్పుడు ఆమె ముచ్చట కోసం ఆడపిల్లలాగా పెరిగింది. తల్లి చనిపోతూ ఆడపిల్ల లాగానే పెరగమంది. అలా రాజు రజని అయ్యింది. అయితే ఆమెకు పురుష లక్షణాలు ఉన్న ఆడపిల్ల మొగుడు కావాలి అని కోరిక. మాలి అసలు పేరు మాలిక్. కాలాంతరంలో మాలిగా మారిపోయింది. ఆతరువాత ఇటువంటి పెళ్ళిళ్ళు కుదర్చటం తన వృత్తి గా చేసుకుంది. అలా మాలి వెతికిన సంబంధమే మృదుల కూతురు ప్రేమ. ప్రేమ కి చిన్న తనంనుంచి తను ఒక మగరాయడి లాగా పెరిగి ఆడపిల్ల లా తిరిగే వాణ్ణి పెళ్ళి చేసుకోవాలి. అని. అలా వాళ్ళ పెళ్ళై ప్రేమ్ కి పుట్టిన వాళ్ళు ఆ కవలలు. వాళ్ళు స్కూల్ లో చేరే సమయానికి వాళ్ళిద్దరికీ వచ్చిన ఒకటే సందేహం... మిగిలిన పిల్లలందరూ అమ్మలకి పుడితే మేమిద్దరం తండ్రికి ౠలా పుట్టాం అని.?????

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

368 Views 3 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (3)

Meghana
Meghana 5 days, 4 hours ago

Good one akka.. Koncham story chadavataniki koddiga kastam ga anipinchindi..mee style writing la antha easy ga anipinchaledu..tappuga anukokandi akka..anipinchindi cheppanu

gvgarima
gvgarima Author 5 days, 3 hours ago

మీ ప్రశంసకు కృతజ్ఞతలు చెల్లీ. ఇది స్పష్టంగా నేను వ్రాసినదే. అయితే నేను నిన్న మధ్యాహ్నం వ్రాసే సమయంలో చాలా స్ట్రెస్ లో ఉన్నాను. అందుకని తప్పులు కూడా దిద్దకుండా పెట్టాను. హెల్త్ విషయం లో కొంచెం డాక్టర్లు హెచ్చరించారు. అయినా నిన్న టెస్ట్ లకి వెళ్ళలేదు. చాలా కష్టపడి కథపూర్తిచేసి కావలసిన ఫోటోలు కూడా జోడించి తరువాత వెంటనే నీరసంతో పడిపోయాను. నాకు ఎవరి సహాయం తీసుకునే అలవాటు లేదు చెల్లి.

gvgarima
gvgarima Author 4 days, 17 hours ago

చెల్లి, శుభోదయం. మీరు చెప్పింది నా శైలి గురించి అంటే నేను వ్రాసిన కథలు వంటి కథలా లేదు అంటే.,... ఈ కథను ఇలా వ్రాయటానికి మూడు కారణాలు ఉన్నాయి. 1. ఆయుర్వేదం లో తృతీయ ప్రకృతిలో 56 రకాల భేదాలు చెప్పారు. అందులో ఒకటి వాళ్ళ జీవనశైలిలో దేహానుకూలంగా కాకుండా దానికి వ్యతిరేకంగా ఉంటారు. అంటే పురుషులు గా పుట్టి స్త్రీలలాగే వేష, వ్యవహారాల్లో ప్రవర్తిస్తారు. స్త్రీలుగా పుట్టి పురుషులవలె ప్రవర్తిస్తారు. కానీ వాళ్ళ బయోలాజికల్ దేహ స్వభావం మారదు. అటువంటి వాళ్ళే ఇక్కడ రజనీ, ప్రేమ్. 2. రెండో కారణం.. సమాజంలో ఇప్పుడు తృతీయ ప్రకృతి విషయంలో కొన్ని కొన్ని చోట్ల సమాజంలోకి ఆహ్వానం కూడా ఉంది. కనుక ఒక మాట్రిమోనియల్ వ్యవస్థ ఉంటే బాగుంటుందని అనిపించింది. ఈ ఊహ వల్లనే ఈ కథ వ్రాశాను. మీ అభిప్రాయం నాకు ఎప్పుడూ విలువైనదే.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login