మేము కూర్చున్న ఫస్ట్ క్లాస్ కూపే లో మా రెండు బెర్త్ లకి ఎదురుగా ఉన్న రెండు బెర్త్ లలో ఒక అరవై ఏళ్ల ఆవిడ, ఇరవై ఏడేళ్ళ ఒక యువకుడు వచ్చి కూర్చున్నారు. బామ్మ అంటూ పిలిచి ఆవిడకి చెవిలో మాకు వినబడనంత మెల్లగా ఏదో చెబుతున్నాడు.. మా అత్త గమనిస్తోంది. బామ్మ చాలా చక్కని పట్టుచీర కట్టుకుని, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టుకుని శాలువ కప్పుకుని వాళ్ళ మనవడు చెబుతున్న మాటలు వింటోంది. ఆ యువకుడు వాళ్ళ బామ్మ కి చెప్పే విధానం చూసి అత్త నాతో నెమ్మదిగా కుర్రాడికి గుంభనం ఎక్కువేనేవ్. అంటే ఒబ్బిడైన వాడన్న మాట. అంది. ఇంతలో బామ్మ అందుకుని "నా పెంపకం మరి." అంటూ "మీ అమ్మాయి గురించి చెబుతున్నాడు. ఆమె మంచి పేరున్న సింగర్ మరియు కథక్ డాన్సర్ ట కదా. ఈరోజు స్పాన్సరర్స్ లో మా అబ్బాయి కూడా ఉన్నాడు. పర్పుల్ సిగ్మా అనే పేరు తో తానొక సాఫ్ట్ వేర్ కంపనీ ప్రారంభించాడు. రెండేళ్లలో మంచి ప్రాఫిట్స్ లో నడుస్తోంది. తనకి మంచి ఐటీ కంపెనీలలో ఆఫర్ లు వచ్చినా వెళ్ళకుండా తనే ఒక కంపనీ ప్రారంభించాడు. మొదట 25 మందితో మొదలైన వీడి కంపనీ ఈ రెండు ఏళ్లలో దేశం ప్రధాన నగరాలలో 750 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. అందుకని నేటి మీ అమ్మాయి కార్య క్రమానికి తను కూడా స్పాన్సర్ చేశాడట. మేం ఈ రైల్లో ఎక్కడానికి కారులో బయల్దేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ గురించే చెబుతున్నాడు. పిల్ల పేరు రాఘవి ట కదా. కుందనపు బొమ్మలా ఉంది. .. .. అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. మా అత్త కల్పించుకుని చూడండి పిన్ని గారు... అంది. పిన్ని గారేమిటి? ఆయాం జస్ట్ సిక్స్టీ. అంది. ఇంతలో మా అత్త నెమ్మదిగా నా చెవిలో "అండ్ ఆల్సో సెక్సీ." అంది. నేను నవ్వు తున్నాను. 'ఏంటి? ఏంటి?" అంటూ అడుగుతోంది ఆవిడ. ఇంతలో వాళ్ళ మనుమడు ఆవిడతో కొద్దిగా గొంతు పెంచి నన్ను ఓరగా చూస్తూ "నిన్ను సెక్సీ గా ఉన్నావంటున్నారే" అన్నాడు. నేను కూడా అతని వైపు చూసి చూడనట్లు చూశాను. "ఇదిగో ఇదగో నేను నిండా కప్పుకుని ఉంటే సెక్సీ అంటావా? ఏవమ్మా! ఇది న్యాయమా? ఇందాకా పిన్నీ అన్నావు. ఇప్పుడు సెక్సీ అంటున్నావు.?" అంటూ చిలిపి కయ్యానికి దిగింది. మా అత్త కూడా ఊరుకోలేదు. మీరు ఆ అబ్బాయికి బామ్మ గారు. మీ అబ్బాయి మా అమ్మాయిని వదలటం లేదు. ఈ జంట కుదిరిందనుకోండి. మీరు నాకు పిన్ని అవరా? అలాగే మీరు చూడటానికి 60 ఏళ్లు వయస్సు లో ఉన్నా చాలా బలంగా చూడ చక్కని రూపం తో ఉన్నారు. కప్పుకుంటే సెక్సీ గా ఉండరని ఏముంది. మీ మనుమడి కంటే మా అమ్మాయి మీద మీకే ఆకలి ఎక్కువగా కనబడుతోంది. నాకు." అంది.ఆవిడ కూడా తక్కువేమీ కాదు. అవునమ్మా. వీళ్ళిద్దరి కీ కలిసింది అనుకోండి వినయ్, రాఘవి అని మంచి జోడీ అవుతారు. అలాగే రాఘవి జానకీ కూడా ఒక జత అవుతాము. కారణం అప్పుడప్పుడు మీ రాఘవిని ఈ జానకి కూడా తింటుంది." అంది. నలుగురం నవ్వుకున్నాం. మాటల మధ్యలో అతని పేరు వినయ్ అని తెల్సింది. ఆ తరువాత వాళ్ళు కూడా భువనేశ్వర్ కే వస్తున్నారని తెలిసింది. మా మాటలు కలిశాయి. ఆ అబ్బాయికి నాకు చూపులు కలిశాయి. ఇద్దరం ఒకళ్ళకి నచ్చినట్టున్నాం. కబుర్లలో తెలిసింది. ఘనపాఠీ గారికి వీళ్ళు చుట్టాలేనని. శారదమ్మ నీగురించి చెప్పింది రాఘవి. మావాడు రెండేళ్ల క్రితం నిన్ను చూశాడట. అప్పటినుంచి మౌనారాధనం. ఈరోజు బయట పడ్డాడు. అంది. ఆవిడ పేరు జానకమ్మ. అందరం అల్లా కబుర్లు చెప్పుకుంటూ మారునాటి ఉదయం పది గంటలకు భువనేశ్వర్ చేరుకున్నారు. నెమ్మదిగా స్టేషన్ కు వచ్చిన మా కార్ లో అందరం ఇంటికి వెళ్ళాం. ఆ తరువాత ఒక రోజుకి ఘన పాఠీ గారు. శారదాంబ, జానకమ్మ, వినయ్ నలుగురు వచ్చారు. వాళ్ళు కాసేపు ఆ మాట ఈ మాట చెప్పి పెళ్లి ప్రస్తావన చేశారు. మా వాడంటే మాకున్న యజ్ఞ విధుల వల్ల మేం అంగీకరించ లేక పోయాం. మాకు తెలుసు రాఘవి బంగారం అని. అయితే బంగారానికి ఒక జాతి రత్నం లాంటి వాడు మా చెల్లెలి కొడుకు వినయ్. అన్నారు ఘనపాఠీ గారు., మా అత్త కల్పించుకుని "మీ మాట కాదనలేను కానీ ,, ,," అంది. ఆ మాటలకు అడ్డు వచ్చి ఆయన "ఆ విషయం కూడా చెప్పామమ్మా" అసలు రాఘవిని ఎలాగైనా మా ఇంటికి కోడలిగా తీసుకునిరావాలని మా శారద పట్టు. అయితే మా ఇంట కుదరలేదు. మా చెల్లెలి కుమారుడికి ఇచ్చి చెయ్యాలి అని మా కోరిక." అన్నారు. ఆ తరువాత ఒక మంచి ముహూర్తం లో మేమిద్దరం ఒకటయ్యాము. ఇదీ వినయరాఘవీయం.
రాఘవుడే రాఘవి
Completed
|
0
|
1
|
1044
Part 6
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
|
Comments
No comments yet.