వేడి దిగింది (చిన్న కథ)

gvgarima

  | November 29, 2025


Completed |   0 | 0 |   902

Part 1

అది కొల్లం లో చమయ విలక్కు పండుగ. కొట్టంకులంగర శ్రీ దేవి టెంపుల్ ఈ పండుగకి చాలా ప్రసిద్ధి. ఈ పండుగ సందర్భం లో దేశం నలుమూలలనుంచి ఎందరో భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి వస్తారు. ముఖ్యంగా మగవారు స్త్రీ వేషాలలో వస్తారు. ఈ ఆలయానికి చాలా దగ్గరలో హోటల్ విజయ ప్యాలెస్ఉంది. అది 3 స్టార్ హోటల్. అక్కడికి చాలా మంది అఫీసియల్స్ కూడా వస్తుంటారు. ప్రతి సంవత్సరం లాగే అక్కడికి పద్మ కూడా వచ్చింది. చక్కగా పిరుదుల వరకు జడ, తల నిండా మల్లెపూలు, చిలకాకు పచ్చ పట్టుచీర. రెండు చేతులకు నిండుగా గాజులు. ముక్కుకి ముక్కెర. తలలో కొత్త పెళ్లి కూతురు లాగా పాపిడి పిందెలు. కొంగు చాటున మామిడి పిందెలు. కాళ్ళకు పారాణి. ముఖానికి మంచి ఫేషియల్స్. పెదవులకు లిప్ స్టిక్. కనురెప్పలు టప టప లాడిస్తూ బయల్దేరింది పద్మ. చేతిలో వానిటీ బాగ్. మరో చేతిలో కుచ్చిళ్ళు జారిపోకుండా మదనగృహం దగ్గర ఎడమ చేతి బ్రోటనవేలితో నొక్కి పెట్టి నడుస్తోంది.

ఇంతలో హలో మేడం. నా పేరు కోమలి. అంటూ ఒక 50 సంవత్సరాల ఆవిడ తనని తాను పరిచయం చేసుకుంది. కొద్దిగా లావు గా ఉంది. తను కనకాంబరం రంగుపట్టు చీర కట్టుకుని వచ్చింది. తల నిండా కనకాంబరాలు దండలు చక్కగా పెట్టుకుంది. చేతుల నిండా మాచింగ్ గాజులు. ఇలా ఐదారుగురు ముత్తయిదువలు అంతా వచ్చారు. అందరూ కలిసి టెంపుల్ కి బయల్దేరారు. నేను కోమలి ప్రక్కనే నడుస్తున్నాము. అనిత అనే ఆమె కోమలిని పలకరించి మీరు ఎక్కడినుంచి వస్తున్నారు? అని ఆంగ్లం లో అడిగింది. నేను హైదరాబాద్ నించి వస్తున్నాను. అని చెప్పింది. ఇంకా తన గురించి పరిచయం చేసుకుంటూ నేను అక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీసు లో అధికారిని. ఆఫీస్ లో వత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వత్తిడి వేడి తగ్గించుకోవటం కోసం నేను గడచిన పది సంవత్సరాలుగా వస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతో నేను మనస్సును, బుద్ధిని చల్లబరచుకుని వెడుతుంటాను. అనిచెప్పాడు. అందరూ తమ తమ పేర్లను, ఊర్లను చెప్పుకుని అందరూ కలిసి కొన్ని సెల్ఫీ లు, కొన్ని గ్రూప్ ఫోటోలు తీసుకున్నాక వెళ్ళి పోయారు.
ఇంక అక్కడ మిగిలినది పద్మ, కోమలి, ఇద్దరూ నడుస్తున్నారు. అంతకు పది నిముషాలకు ముందే తన ఫోన్ నెంబర్ పద్మకు ఇచ్చింది కోమలి. ఇద్దరూ అలా వేడుతుండగా పద్మ తో కోమలి మీరు ఎక్కడినుంచి మేడమ్? అని అడిగింది. నేను కూడా హైదరాబాద్ నుంచే మేడమ్. అంటూ సెల్ ఫోన్ రింగ్ అవుతుంటే వెంటనే ఒక సారి మొబైల్ ను చూసి సార్ మీ ఇంటినుంచి మేడమ్ గారు సార్. అని చెప్పింది. పద్మ. మా మేడమ్ అని ఎలాచెప్పగలి గారు మీరు? అనగానే పద్మ నేను కూడా మీ ఆఫీస్ లోనే పని చేస్తున్నానండి. మీకు మీ పై వాళ్ళ నుంచి వత్తిడి. మాకు మీ నుంచి వత్తిడి. అందుకని నేను ఆ వత్తిడి తగ్గించుకోవటానికి ఇలా వస్తుంటాను. అని చెప్పాడు. కోమలి తన ఫోన్ లో అవతలినుంచి తన భార్య మాట్లాడుతోంది అని ఆమె తో మాట్లాడటం మొదలు పెట్టాడు. మీ గురించి విశేషాలు, మీ వేడి తగ్గే మాత్ర ఇవన్నీ మీ అసిస్టెంట్ పద్మనాభం చెప్పాడు.వెంటనే ఇంటికి బయల్దేరి రండి. అని చెప్పింది .

అంతలో పద్మ అంటే తన అసిస్టంట్ పద్మనాభం అని తెలిసింది. ఈ ఉదంతం వెంటనే శరీరం లోని వేడిని పూర్తిగా తగ్గించేసింది.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

No comments yet.