నడకలో వయ్యారం 2

gvgarima

  | November 28, 2025


Completed |   2 | 1 |   613

Part 1

(సోదరీమణులందరికీ వందనం. నిజానికి నా మొబైల్ లో ఏదో సమస్య ఉంది. అలాగే ఇప్పుడు డెస్క్ టాప్ లో కూడా ఆ సమస్య కనబడుతోంది. టైప్ చేసిన కంటెంట్ మొబైల్ లో రెండు సార్లు disappear అయిపోయింది. డెస్క్ టాప్ లో టైపింగ్ కొంత ఇబ్బంది పెడుతోంది. అందువల్ల ఈ కథ ముగింపు సరిగ్గా రాలేదు. టైపు చేసింది నిలవ లేదు. అందుకని ఇక్కడ చిన్న ముగింపు ఇస్తున్నాను.)

శాంతి నడకను చూసిన హేమ నువ్వు ఇలా మెలికలు తిరుగుతూ జగదేకవీరుడి కథలో దేవకన్యల లాగా నడిస్తే ఏ సినిమా వాళ్ళో, నాటకం వాళ్ళో నిన్ను ఒక చెలికత్తె వేషానికి తీసుకుని వెళతారేమో కానీ సమాజం మెచ్చుకోదు. మంచి నడక అంటే ఫిజికల్ గా నడవటం కాదు. నడవడిక లేక ప్రవర్తన హుందాగా ఉండాలి. అప్పుడు అమ్మాయి ఎలా నడిచినా ఎవరు పట్టించుకోరు.. అర్థమైందా శాంతి. ఇది నీకు అర్థం కావాలనే పొద్దున్న చెన్నై అంతా చూసి రమ్మన్నాను.
నువ్వు చేయవలసిన పనులు .. ..
ఉంటే సుశాంత్ లాగా ఉండు. లేక పోతే శాంతి గా మారు. నీకే నిశ్చయం లేదు అంటే నువ్వు ఆకర్షణ లో ఉన్నావు. కనుక నీ వయస్సు ను పాడుచేసుకోవద్దు. నువ్వు సుశాంత్ గా ఉంటే ఆడవాళ్ళను గౌరవించు. శాంతిగా మారితే హుందా గా వస్త్ర ధారణ చెయ్యి. అంతే కానీ సెక్సీగానో వెకిలిగానో డ్రస్ చేసుకోకు. నీ వస్త్రధారణే నీకు గౌరవాన్ని తెస్తుంది. నువ్వు చేసే పనిని బట్టి నీ వస్త్ర ధారణ. నీ వస్త్ర ధారణను బట్టి నీ నడక ఉంటాయి. చాలా మంది స్త్రీలు ఇప్పుడు తమ లక్ష్యం జీవితంలో ఒక ఉన్నతమైన స్థానం వైపు పయనించటమే కానీ కులుకుతూ నడవటం కాదు అని తెలుసుకున్నారు. కనుకనే నగరాలలో ఆడవాళ్ళకి హొయలు తో నడిచేంత సమయం ఉండటం లేదు. అదే నువ్వు చూసిన పళ్ళు, పూలు అమ్మే ఆడవాళ్ళు చక్కగా చీరలు కట్టుకుని ఉంటారు కనుక వాళ్ళు ఆ చీరల్లో చక్కగా ఆకర్షణీయంగా నడవటానికి అవకాశం ఉంటుంది. కనుక నీ నడవడిక మార్చుకో. నువ్వు హుందాగా స్త్రీ గా మారుదాం అనుకుంటే నీకు ఈ సి. డి సప్పోర్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అనిచెప్పింది. శాంతికి ఏదో అర్థం అయ్యింది. ఒక సంవత్సరం పాటు శాంతి హేమ దగ్గరకు ప్రతివారం వచ్చి ఎన్నో మెళకువలు నేర్చుకుని చక్కని స్త్రీ గా తనను తాను మలచుకుంది. ఇదీ నడకలో వయ్యారం.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Meghana Meghana

Simple story but very message oriented. Good one akka.

gvgarima gvgarima (Author)

మీకు కృతజ్ఞతలు చెల్లి