ట్రాన్స్ జెండర్ కావాలంటే . . . . పరీక్ష

gvgarima

  | November 26, 2025


Completed |   0 | 1 |   812

Part 1

నేనొక మ్యూజిక్ టీచర్ ని. నా పేరు గంగయ్య. మా సంగీతం గురువుగారి దగ్గర అంతా ఆడపిల్లలే. నేను ఒక్కడినే మగ పిల్లవాడిని. నాకు చిన్నతనం నుంచి శాస్త్రీయ సంగీతం బాగా నేర్పారు మా గురువు గారు. అయితే చాలా మంది ఆడపిల్లలకు సంగీతం అంటే పెళ్లి సంగీతమే. అంటే నాలుగు అన్నమయ్య కీర్తనలు. రెండు భావగీతాలు. మరి రెండు పురందర దాసు కీర్తనలు. ఇవి నేర్చుకుని వెళ్లిపోతుండేవారు. అయినా మాస్టారు దగ్గర చాలా మంది విద్యార్థినులు ఉండే వారు. గడచిన ఏడు సంవత్సరాల నుంచి నేను గురువుగారి దగ్గర ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను. నాకు గమకాలు చాలా బాగా పలికేవి. అటు పురుష స్వరం తో ఇటు ఆడ గొంతుతో కూడా పాడగల నేర్పు సంపాదించాను. ఇలా ఉండగా గురువుగారి మేనల్లుడు మధు ఒక సినీ ఆర్కేష్ట్రా ను నిర్వహిస్తున్నాడు. అందులో సినీ క్లాసికల్ .పాటలు పాడటానికి గాయనీ, గాయకుల కోసం వెదుకుతున్నాడు. ఆ సమయం లో నేను అతనికి దొరికాను, నా చేత తన బృందంలో పాడించాలి అనుకున్నాడు.. . .నన్ను అడిగాడు. నేను క్లాసికల్ సంగీతానికే పరిమితం అవుతానని చెప్పను. సినిమా పాటలు పాడనని చెప్పాను. కానీ మా గురువుగారిని ఒప్పించి తనతో తీసుకుని వెళ్ళాడు. అప్పటికి నాకు పదహారేళ్ళు. ఇంకా మీసాలు రాలేదు. వంటిమీద వెంట్రుకలు లేవు. ఇదిగో గంగయ్య నీకో రిక్వెస్ట్. ఒక మగపిల్లవాడు స్త్రీ గాయనీ మణుల పాటలు పాడుతున్నాడు అంటే ఆదరించేవారు తక్కువ. అదే ఒక ఆడపిల్ల పాడుతుంటే చాలా మంది చూస్తారు. . .. అని ఒక్క క్షణం చెప్పటం ఆపాడు. నాకు కుతూహలం పెరిగింది. అయితే?!?!?! అని అడిగాను. ఏం లేదు. నీకు పరికిణీ, జాకెట్టు తెచ్చాను. అవి కట్టుకుని స్టేజ్ ఎక్కాలి. ఇక పై స్టేజ్ మీద నీ పేరు గంగ. నేను స్టేజ్ మీద పాడిన మొదటి పాట "నీ లీల పాడెద దేవా" ఇక అక్కడి నుంచి గురువుగారికే దూరం అయ్యాను. మధుకు, ఆర్కేస్ట్రా కి దగ్గర అయ్యాను. చూస్తూ ఉండగా నాలుగు సంవత్సరాలు గడచి పోయాయి. ఏదో పాడినప్పుడల్లా కొద్దిగా డబ్బులు వచ్చేవి. అలాగే నాలోని ఆడతనాన్ని మధు నాకు తెలియకుండా పెంచాడు. నాకు ఇచ్చే పానీయాలలో స్త్రీ హార్మోన్ టాబ్లెట్లు కరిగించి తాగించేవాడు. ఫలితంగా నాకు రొమ్ములు, పిరుదులు బాగా పెరిగాయి. .నా నడక, మాట, వ్యవహారం, ఇవన్నీ స్త్రీలాగే. ఇది అనుకరణ కాదు. సహజమైన క్రమం. మా కచేరీలు రాత్రి రెండింటిదాకా, మూడింటి దాకా సీజన్ ను బట్టి సాగుతూ ఉండేవి. గొంతు బాగా రావటానికి మా గ్రూప్ లో ఉండే మగ గాయకులు, ఇన్స్ట్రుమెంటలిస్టులు బాగా మత్తు పానీయాలు త్రాగే వారు. ఆ సమయంలో వాళ్ళకి దొరికిన ఉమ్మడి ఆడదాన్ని నేనే. అలా నన్ను బాగా వాడుకోవటం మొదలు పెట్టాను. అంతేకాదు. ఎవరైనా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నవాళ్ళు ఆర్కెస్ట్రా లతో పాడితే ఇక వాళ్ళ శాస్త్రీయ గాన పక్కీ నాశనమే. నా విషయం లో జరిగినది అదే. అటు సంగీతం, ఇటు శీలం రెండూ పోయాయి. నా నాలుగేళ్ళ ఆర్కెస్ట్రా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆర్కెస్ట్రాలకు గిరాకీ తగ్గింది. కొద్దిగా ఎక్కువ డబ్బు పెడితే సినీ గాయకునే వస్తున్నారు. కనుక లోకల్ ఆర్కెస్ట్రాలకి పల్లెటూళ్ళలో కూడా డిమాండ్ లేదు. ఈ పరిస్థితులలో నన్ను ఏదో ఊరుకు తీసుకు వెళ్ళి ఆ రోజు రాత్రి నాతో పడుక్కుని మధు "గంగ నువ్వు అటు ఆడదానివి కాదు. ఇటు మగాడివి కావు. నాలుగేళ్ళు నాతో ఉన్నావు. ఇదిగో ఈ ఇరవై వేలు ఉంచుకో,. నీకు నచ్చిన చోటికి వెళ్లిపో. నేనూ నిన్ను ఇంక పోషించలేను". అనిచెప్పి పొద్దున్నే నన్ను ఆ ఊళ్ళో వదిలేసి మిగిలిన వాళ్ళందరితో మధు వెళ్ళి పోయాడు. నేను నా బాగ్, బట్టలతో మాత్రమే మిగిలాను. ఏదో రైలు వస్తే రైలు ఎక్కాను. అది చెన్నై వేపు వేడుతోంది. నాకు ఆకలేసింది. నేను మధు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా రైల్లో పాటలు పాడుతూ ఆకలికి సహాయం చేయమని అడుక్కోవటం మొదలు పెట్టాను. నలుగురైదుగురు ఇచ్చిన డబ్బులతో నేను కడుపు నింపుకున్నాను. తరువాత చెన్నైకి చేరింది బండి. నేను బండి దిగాను. ఎటు వెళ్లాలో తెలియటం లేదు. ఇంతలో నా భుజం మీద ఒక చెయ్యి పడింది. (సశేషం)

Part 2

ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. మా అమ్మ, నాన్న కూలి చేసుకుని బ్రతికే వాళ్ళు. నా తొమ్మిదవ. ఏట నన్ను సంగీతం గురువు గారికి అప్పగించి వాళ్ళిద్దరూ బీహార్ కు వలస వెళ్ళిపోయారు. అక్కడ నుంచి గురువు గారి రక్షణ లోనే పెరుగుతూ పదిహేను ఏళ్ళకే నేను గురువు గారు చెప్పిన స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా చేరాను. ఒక సంవత్సరం గడిచాక అంటే నా పదహారేళ్ళ వయసులో మధు నన్ను ఆర్కెస్ట్రా కి పరిచయం చేసాడు. అప్పటి తో నాలోని మ్యూజిక్ టీచర్ ఉద్యోగానికి స్వస్తి పలికాను. కారణం ఆర్కెస్ట్రా లో పనిచేసే వాళ్ళు మాకు టీచర్స్ గా వద్దన్నారు వాళ్ళు. .... అటువంటి గతంలోంచి వర్తమానం లోకి వస్తే ... నేను చెన్నై రైల్వే స్టేషన్ లో. నా భుజం మీద ఎవరిదో చెయ్యి. నేను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక 26 ఏళ్ళ యువతి నవ్వుతూ నిలబడి ఉంది. కాటన్ చీర కట్టుకుని చాలా సింపుల్ గా ఉంది. గొంతులో మార్దవం ఉన్నా స్త్రీ గొంతు లా లేదు. అప్పుడు ఆమె చెప్పింది. నా పేరు రామనాయకి. నేను తమిళ నాడు ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలిని. (సశేషం)

Part 3

నిన్ను ట్రైన్ లో ఉండి చూస్తున్నాను. నువ్వు చాలా తియ్యగా పాడుతున్నావు. నీ డ్రస్సు మరీ పేదగా లేదు. కానీ నీవు ఇలా యాచన చెయ్యవలసిన అవసరం ఏమొచ్చింది? నీ కష్టం ఏమిటి? నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? అని అడిగింది నన్ను. అప్పుడు నేను గంగయ్య నుంచి గంగ గా నా మార్పు విశేషాలు, ఆర్కెస్ట్రా వాళ్ళు భౌతికంగా నన్ను ఎలా వాడుకున్నారో, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో అంతా వివరించి చెప్పాను.
రామనాయకి ఒక్క క్షణం ఆలోచించి నీకు రక్షణ కావాలి కదా? నాతో వస్తావా? మా కమ్యూనిటీ సిస్టర్స్ అందరికీ సంగీతం నేర్పుదువు గాని" అని అడిగింది.
నేను వెంటనే ఒప్పుకున్నాను. టాక్సీ లో తనతో పాటు సైదా పేటలో ఒక సందు చివర ఉన్న అపార్ట్ మెంటు కు తీసుకుని వెళ్ళింది. అక్కడ ఆమె పరిరక్షణలో 25 మంది ట్రాన్స్జెండర్ సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళలో 15 ఏళ్ల వాళ్ళనుంచి 40, 50 సంవత్సరాల వయస్సు వాళ్ళ వరకు ఉన్నారు. రకరకాల స్త్రీ వస్త్రాలలో ఉన్నారు వాళ్ళంతా. కొంతమంది చీరలు, పరికిణీ, జాకెట్లు ధరించి ఉన్నారు. కొందరు ఫ్రాక్లు, కొందరు చుడీ దార్ లు కట్టుకుని ఉన్నారు. ఇలా ఉన్న వాళ్ళందరికీ నన్ను ఈ అమ్మాయి గంగ. మనలాంటిదే. మంచి గాయకురాలు. మన అందరికీ పాటలు నేరపటానికి వచ్చింది.. అంటూ తమిళంలో చెప్పింది. నాకు తమిళం అర్థం అవుతుంది, కానీ తిరిగి మాట్లాడలేను. ఇక అక్కడ నుంచి నా కొత్త జీవితం వాళ్ళకి సంగీతం నేర్పటం తో మొదలైంది.
నన్ను నేనెవరు అనే ప్రశ్న? ఎప్పుడూ చాలా లోతుగా బాధిస్తోంది. నేను - అతడా? ఆమె? లేక ట్రాన్స్ జెండరా? తెలియలేదు. ఈ ప్రశ్నలతో ఒక నెల గడిచింది. నాయకి నాకు కొన్ని దుస్తులు తెచ్చి ఇచ్చింది. అందరికీ నేను దగ్గర అవుతున్నాను. నాకు వాళ్ళందరితో కలిసి తిరిగటంలో నేనూ కూడా వాళ్ళలా మారితే బాగుంటుంది అనిపించింది. రామనాయకితో ఏకాంతంలో నా మనసులోని మాట చెప్పాను. నువ్వు ఇప్పుడు మాతోనే కదా ఉన్నావు!? అని అడిగింది. నిజమే. అయితే మీలాగే మారిపోవాలి అని ఉంది. లోపల ఒక వ్యక్తి, బయటకి ఒక వ్యక్తి గా ఉండటం నాకు ఇష్టం లేదు. అన్నాను. నాయకి మౌనంగా తల పంకించింది. ఆ రోజు ఉదయం 8.00 గంటలకి ఒక పదిహేను మందితో కలిసి బయటకు పనిమీద వెడుతూ నన్ను కూడా వాళ్ళటో రమ్మంది. (సశేషం)

Part 4

రామనాయకితో ఆ పదిహేను మందితో కలిసి నేనూ 16 వ దానిగా బయల్దేరటం నాకు ఎంతో ఆనందం కలిగించింది. సైదాపేటలో లోకల్ రైలెక్కాం . మిగిలిన సిస్టర్స్ అంతా రెండు చేతులూ జోడించి గట్టిగా చప్పుడు చేస్తూ ట్రైన్ లో అందరి దగ్గరకి వెళ్ళి యాచన చేస్తున్నారు. నేను ఎందుకో కూర్చోవాలి అనిపించి అక్కడ ఆడవాళ్ళ మధ్య కాళీ ఉంటే కూర్చో బోయాను. వెంటనే ఒక మామీ నన్ను గట్టిగా తోసి అక్కడ కూర్చోవద్దు అని నన్ను, మిగిలిన సిస్టర్స్ ని అందరినీ తమిళం లో తెగ తిడుతోంది. ఆమెతో జత కలిపి మిగిలిన ఆడవాళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ తిడుతున్నారు అప్పుడు దూరం నుంచి చూస్తున్న నాయిక నన్ను కూర్చోవద్దని సైగ చేసి తన దగ్గరకు రమ్మని పిలిచింది. చూశావా మన కమ్యూనిటీకి ప్రజలలో ఉన్న స్పందన. ఆడా, మగ లతో సమానంగా మనకు కూడా సమాజంలో జీవించే హక్కు ఉండాలని మన TN ట్రాన్సజెండర్ వెల్ఫేర్ సంస్థ కృషి చేస్తోంది. అంత వరకూ మనకు భిక్షాటన తప్పదు. అయితే ఇక్కడ ఒక విషయం మనం ట్రైన్ లో ఎక్కితే టిక్కెట్ అడిగేవాడు ఎవ్వడూ ఉండడు. అని చెప్పింది. ట్రైన్ మాంబలం, కోడంబాక్కం, నుంగంబాక్కం, చెట్ పేట, ఎగ్మోర్ స్టేషన్లు దాటి చెన్నై పార్క్ స్టేషన్ వచ్చింది. అందరం పార్క్ స్టేషన్ లో దిగాం. ఇంక అక్కడ అక్కడి నుండి అందరం అండర్ గ్రౌండ్ వాకింగ్ పాత్ లో నడుస్తున్నాం. వచ్చి పోయే వాళ్ళను చిన్న, పెద్ద దుకాణదారుల్ని కూడా యాచన చేస్తున్నాం. ఈ సారి నేను కూడా యాచన చేస్తున్నాను. నన్ను చూశాకా నాయకి కళ్ళు మెరిశాయి. అయితే నేను చాలా శ్రావ్యంగా తెలుగు, హిందీ, తమిళం పాటలు పాడుతూ చిన్న చిన్న డాన్సు చేస్తూ షాప్ షాప్ కే వెళ్ళి అడుగుతున్నాను. నా పాటలకి మెచ్చుకుని అందరూ డబ్బులు ఇస్తున్నారు. ఇలా వంటి గంట వరకూ ఆ బజార్ లన్నింటిలో తిరిగాం. అంత తక్కువ టైమ్ లో నాకు ఇంచుమించు గా రెండు వేలు వచ్చాయి. మిగిలిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదొందలు చొప్పున వచ్చాయి. అవచ్చిన డబ్బులు వచ్చినట్లు చేతివేళ్ళ ,మధ్యలో పెట్టుకుని మరీ అందరినీ అడుగుతూ ముందుకు వెళ్తున్నాం. అలా మధ్యాహ్నం ఒంటి గంటకి అందరం మళ్ళీ చెన్నై పార్క్ స్టేషన్ కి వచ్చాకా డబ్బులన్నీ రామ నాయకి ఇచ్చేశాం. ఒక చెలా ని పంపించి అందరికీ బిర్యానీ పాకెట్లు తెమ్మంది. బిర్యానీ పాకెట్లు వచ్చాకా మేమంతా పార్క్ స్టేషన్ లో బిర్యానీ తినేసి అక్కడి నించి లోకల్ ట్రైన్ లో బీచ్ స్టేషన్ కి చేరుకున్నాం. అక్కడ చాలా సేపు అందరం డాన్స్ చేశాం. నేను పాటలు నేర్పుతుంటే నాతో పాటు అందరూ ఆడుతూ పాడుతున్నారు. ఆటలు, పాటలు నాలుగింటిదాకా అయ్యాకా అక్కడి నుంచి బీచ్ లో మళ్ళీ యాచన మొదలు పెట్టాం. అయితే ఈ సారి మాలో కొంతమంది కనబడటం లేదు. అటు ఇటు వెళ్లిపోయారు. కొంత మందిమి మాత్రమే యాచన చేస్తున్నాము. నాయకి వయస్సు ఒక నలభై ఏళ్లు ఉంటాయి. ఆమె నా దగ్గరకు వచ్చి “గంగ నువ్వు గమనించే ఉంటావు. మనలో కొందరు కనబడటం లేదు. కారణం వాళ్ళ కోసం ఆశ పడి వచ్చే ఒక రోజు మొగుళ్లు వాళ్ళని అటు ఇటు తీసుకుని వేడుతుంటారు. అలాగే నీకోసం కూడా అక్కడ ఒకడు ఎదురు చూస్తున్నాడు. వెడతావా? గంటకు నీకు మూడువేలు ఇస్తాడంట. చూడు. మీకు అల్లా వచ్చే డబ్బులో నాకు మూడవ వంతు ఇస్తే చాలు. మిగిలినది మీరే అట్టే పెట్టుకోవచ్చు. వెడతావా? మళ్ళీ ఒక గంట లో ఇక్కడికి రావాలి.” అని అడిగింది. నాయకిని నేను అక్క అని పిలవటం అలవాటు. అందుకని “అక్క, నేను నాలుగు సంవత్సరాలు బాగా నలిగి పోయి ఉన్నాను. నన్ను ఈ వృత్తి కి బలవంతం చేయకు. యాచన మాత్రం చేస్తాను.” అన్నాను. “నీ ఇష్టమే గంగ” అని చెప్పింది నాయకీ. ఒక గంట సమయం లో అందరూ మేము ఉన్న చోటుకి వచ్చేశారు. ఆ తరువాత వాళ్ళు సంపాదించిన సొమ్ములు నాయకి కి ఇచ్చేశారు. మళ్ళీ అందరం బీచ్ నుంచి పార్క్ స్టేషన్ కు అక్కడి నుంచి సైదాపేట కి లోకల్ ట్రైన్ లో వచ్చేశాం. అక్కడి నుంచి నెమ్మది గా ఇంటికి చేరుకున్నాం.
అప్పుడు నీ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఈ రోజు పరీక్షలో నువ్వు నెగ్గావు. నిజానికి మేం మన ఇంటిలో ఉండే వాళ్ళకి కొన్ని స్కిల్స్ లో ట్రైనింగ్ ఇస్తున్నాము. సమాజం లో ట్రాన్సజెండర్లు పడుపు వృత్తి మీద బ్రతకకూడదు. అని మా నియమం. నిన్ను పరీక్షించటానికి వాళ్ళు అలా వెళ్లారు అని చెప్పాను. అలాగే నీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. అని చెప్పాను. నువ్వు ఆశ పడలేదు. అయితే యాచన లో కొత్త పద్ధతి చూపించావు. పాడుతూ యాచించటం. అది నెమ్మదిగా అందరికీ అలవాటు చేద్దాం. ఇక పై నువ్వు వీళ్ళకి మ్యూజిక్ టీచర్ వి మాత్రమే కాదు. మన కమ్యూనిటీ లో మెంబర్ వి కూడా. ఇక్కడికి వచ్చిన చెలాలకి పాత దేశవాళీ పద్ధతులలో మగ అవయవాలను కోసేసి లేక చితక బాది తొలగించి తరువాత స్థానిక వైద్యుల సహాయం తో స్త్రీ అవయవాల ఆకృతిని ఏర్పరుస్తాం. అప్పుడు అల్లా శస్త్ర చికిత్స తరువాత నలభై రోజులకు ఒక మంచి ఉత్సవం చేస్తాం.” అంది అక్క. వెంటనే నేను నువ్వు ఎప్పుడు నిశ్చయిస్తే అప్పుడు ఆ శస్త్ర చికిత్స చేయించుకుంటా. అన్నాను. ఆ రోజు అక్క పెట్టిన పరీక్షలో నెగ్గినందుకు ఎంతో ఆనందించాను.
000000000


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

No comments yet.