ఇది నాకు నిజంగా జరిగింది. నా లైఫ్ లో కొన్ని సందర్భాల్లో నేను కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను. అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేసేవారో కామెంట్లో చెప్పండి.
Let's begin with an intro...
నా పేరు భరత్. ఇంటిపేరు ఇటికెల. మాది హైదరాబాద్. ఎప్పుడో మా తాత ఊర్లో ఉన్నదంతా అమ్మేసి 1970s లో ఇక్కడికి మైగ్రేట్ అయ్యాడు. ఎందుకో తెలీదు గానీ ఊర్లో వాళ్ళతో మాకు పెద్దగా సంబంధాలు లేవు. మా తాతకు 3 కొడుకులు, 2 కూతుర్లు. వాళ్ళు అంతా కూడా హైద్రాబాద్ లోనే ఉండటం వళ్ళ ముందెన్నడూ నేను సొంత ఊరికి వెళ్లలేదు. మా తాత పిల్లలు, వాళ్ళ పిల్లలు... ఇదే మా (నాకు & మా అక్క కు) లోకం.
నాకు మా ఇంటిపేరు నచ్చేది కాదు. స్కూల్లో అందరూ ఎక్కించే వాళ్ళు. అందుకే 10th లో "మీ పేర్లు, DOB లు, caste లు మీ పేరెంట్స్ తో మీ డైరీ లో రాపించుకుని రండి" అని స్కూల్ వాళ్ళు అంటే ఆ మాత్రం డీటెయిల్స్ నాకు తెలీవా అని సింపుల్ గా BHARATH I అని నేనే రాసి ఇచ్చేసాను. సో అన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ సర్టిఫికెట్స్ లో పేరు అలాగే వచ్చేసి నా ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్ లో కొట్టిన జాబ్ ఆఫర్ లెటర్ కూడా అలాగే BHARATH I అనే రికార్డు అయ్యింది. పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్ కూడా అలాగే తీసుకున్నా.
ఇంజనీరింగ్ 1st year వరకు మా నాన్న నా ఫేస్ పై కత్తి పడనివ్వలేదు. రెగ్యులర్ గా షేవ్ చేస్తే స్కిన్ ముదిరిపోతుందని only trim చెయ్యించుకోమ్మనే వాడు. నాకు కూడా అలాగే అలవాటు అయ్యింది. చిన్నప్పుడు అమ్మా నాన్నలు ఇద్దరు ప్రైవేట్ లో చిన్న చిన్న ఉద్యోగాలు (నాన్న ఒక కాంట్రాక్టర్ దగ్గర supervisor గా, అమ్మ ఏమో ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా) చేస్తుండడం వల్ల నన్ను ఎక్కువగా నాన్నమ్మ చూసుకునేది. తనకు ఎందుకు అలా అనిపించిందో ఏమో కానీ నాకు 3-4 years age వచ్చే వరకు నాకు మా అక్క ఫ్రాకులు వేసేదట. అది నాకు గుర్తు లేదు కానీ మా ఇంట్లో చాలా ఫొటోలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల మేము మా జాయింట్ ఫ్యామిలీ నుండి దూరం అయ్యాం. నాన్న ఉద్యోగం పోయి చాలా కష్టాలు చూసాం. తాత మాకోసం తాను కట్టుకున్న ఇండిపెండెంట్ ఇంటిని డెవలప్మెంట్ కి ఇచ్చి అదే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఒకటి, కొంత క్యాష్ ను తన landlord షేర్ కింద తీసుకుని తన పిల్లలందరికీ పంచేశాడు. మా పెదనాన్న & బాబాయి లు సిటీ లో వేరు వేరు చోట్ల ఫ్లాట్లు కొనుక్కున్నారు. మా నాన్నేమో అప్పులు తీర్చుకుని చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. అందులో కూడా లాస్ వచ్చి మళ్ళీ ఆర్థికం గా చాలా ఇబ్బంది పడ్డం.
ఎలాగోలా ఇల్లు గడవాలి కాబట్టి డబ్బులు చాలా పొదుపుగా వాడేది మా అమ్మ. చుట్టాలు చాలా మంది దగ్గర అప్పు చేసాము కాబట్టి మొఖం చాలక మేము ఎవ్వరింటికీ వెళ్ళే వాళ్ళం కాదు. మంచి ఏరియా లో రెంట్లు కూడా పెరుగుతూ ఉండడం తో మేము ఒక లోయర్ ఇన్కమ్ గ్రూప్ (LIG) area లో ఉండే వాళ్ళం. సో మా అమ్మా నాన్న లు మమ్మల్ని ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళి ఆడుకోవడం, వాళ్ళని మా ఇంటికి రానివ్వడం, అలా చేయనిచ్చి వాళ్ళు కాదు. దాంతో నాకు మా అక్కకు (నా కన్నా 18 మంత్స్ పెద్ద) పెద్దగా ఫ్రెండ్స్ ఉండే వారు కాదు. Most of the time ఇంట్లో ne ఉండే వాళ్ళం. చదివేది అమ్మ పని చేసే స్కూల్ లోనే కాబట్టి నేను & మా అక్క అమ్మతో పాటే వెళ్ళి వచ్చేసి ఇంట్లోనే చదువుకోవడం ఆడుకోవడం చేసేది.
పండగలకి, birthday లకీ కొత్త బట్టలు కొనే ప్రతీ సారి మా అమ్మ నాన్నలు ఎంత ఇబ్బంది పడ్డారో నాకు & మా అక్కకు బాగా తెలుసు. ఒకసారి నేను 6th లో ఉన్నప్పుడు ఇంట్లో వేసుకునే బట్టలు బాగా చిన్నగా అయిపోయాయి, టైట్ గా కూడా అయ్యాయి అని కొత్త బట్టలు వేసుకుంటే నాన్న నన్ను బాగా తిట్టారు. తరవాత కారణం చెప్పాక, అమ్మా నాన్నలకు గొడవ అయ్యింది. అది చూసి అక్క నాతో " ఒరేయ్, ఇంట్లోనే కదా ఉంటున్నాము... నాకు పొట్టిగా అయిన ఫ్రాక్ లు బోలెడు ఉన్నాయ్... మొన్న సారీ ఫంక్షన్ అయినప్పటి నుండి అమ్మ నన్ను చుడిదార్లే వేసుకుంటుంది. నా ఫ్రాక్ లతో మేనేజ్ చేసేయి రా ప్లీజ్. నువ్వు okay అంటే అమ్మ కు నేను చెప్తాను. నాన్న ను తనే కన్విన్స్ చేస్తుంది" అని చెప్పింది. నేను దిగాలు గా okay అన్నాను.
మొదట్లో నాన్న ఒప్పుకోకపోయినా ఆఖరికి అమ్మ ఎలాగోలా ఒప్పించింది. అప్పటి నుంచి నేను ఇంట్లో అక్క ఫ్రాక్ లు వేసుకునే వాడిని. ఫస్ట్ టైమ్ చాలా ఇబ్బందిగా ఉన్నా, మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది. బయటకు వెళ్లినప్పుడు/ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం నా బట్టలు వేసుకునే వాడిని. నా కోసం ఎప్పుడూ ఒక పంట & షార్ట్ బాత్రూమ్ లో ఉండేవి. ఇంటి బెల్ వినపడంగానే నేను బాత్రూమ్ లోకి పరిగెత్తే వాడ్ని. మా నాన్న కాకుండా ఇంకెవరు వచ్చినా అక్కో అమ్మో బాత్రూమ్ లైట్ ఒక సారి అన్ & ఆఫ్ చేసే వారు. నేను immediate గా బట్టలు మార్చుకొని ఒక సారి నీళ్ళ శబ్దం చేసి బయటకు వచ్చేవాడిని. అలా ఒక సంవత్సరం గడిచిన తరవాత ఆటోమేటిక్ గా నాకు అమ్మాయి లా mannerisms like కూర్చునే ముందు ఫ్రాక్ ను బ్యాక్ సైడ్ ఒక సారి swipe చెస్కోవడం, కాళ్ళు దెగ్గరగా పెట్టుకొని ఉండడం. కింది నుంచి పైకే ఏదైనా తియ్యాలన్నా/ఎత్తాలన్నా నడుం దగ్గర బెండ్ అవ్వకుండా మోకాళ్ళ పై కూర్చుని చెయ్యడం, ఓవరాల్ గా కొంచం కుదురుగా, నెమ్మదిగా కదలడం etc అన్ని రకాలుగా నా బిహేవియర్ లోనే కొంత softness వచ్చేసింది.
Next 2 years లో akka కి పొట్టిగా అయిన లేదా అక్కరకు రాని చుడీదార్లు కూడా నా షెల్ఫ్ లోకి వచ్చేశాయి. కొన్ని మంచి మంచి డ్రెస్ లు ఏవైతే అక్క చాలా ఇష్టంగా కొన్నవి (birthday, festivals, functions కి కొన్నవి) నాకు ఇచ్చేటప్పుడు అక్క ఎంతో బాధ తో ఇచ్చేది.
నెమ్మదిగా నేను 9th లో కీ, అక్క ఇంటర్ లోకి వచ్చాము. నాన్న పరిస్థితి ఆర్థికంగా కొంచం కొంచెం మెరుగుపడుతున్న టైమ్ లో అమ్మకు vericose veins ప్రాబ్లం ఒచ్చింది. ఎక్కువ సేపు నిలబడి స్కూల్ లో క్లాసెస్ తీసుకోవడం చాలా కష్టంగా అవ్వడంతో తను ఉద్యోగం చెయ్యడం మానేసింది. అక్క పెళ్లికోసం డబ్బులు, నగలు కూడబెట్టాలి కాబట్టి మా ఇంట్లో పిసినారితనం ఇంకా పెరిగింది. ఈ సారి నా బర్త్డే కి నాన్న నాకోసం కొత్త బట్టలు కొనలేదు. బంగారం ధర ఫ్యూచర్ లో బాగా పెరుగుతుందని రీసెంట్ గా అప్పుచేసి మరీ అక్కకు నెక్లెస్, అమ్మకు గాజులు చేయించాడు. సో "situation tight గా ఉంది, వాడికి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేయి" అని అమ్మకి చెప్పాడు నాన్న.
నేను _ "పో అమ్మా.... అక్క బర్త్డే కి మాత్రం తనకి గ్రాండ్ గా ఘాగ్ర చోలీ కొనిచ్చారు. నాకు మాత్రం ఏమి లేదు"
అమ్మ _ "అలా కాదు రా... నీకు next month పండగ కి కొంటాం రా. ప్లీజ్ రా... ఈ ఒక్క సారి మారాం చెయ్యకు రా"
నేను _ "ఎన్ని విషయాల్లో అడ్జెస్ట్ కావాలమ్మ? ఎప్పుడు చూడూ నాకు పాతావే ఇస్తారు. అక్కకు మాత్రం కొత్త కొత్త డ్రస్సులు కొనిస్తారు. అక్కేమో హీరోనే లా రెడీ అవుతుంది.... నేనేమో హీరోయిన్ పక్కన ఉండే సైడ్ క్యారెక్టర్ లా ఏవో పాత చుడీదార్లు వేస్కుని ఉంటా ఎప్పుడూ..." అని ఒక మూల లో ఏడుస్తూ కూర్చున్నా.
నా బాధ చూడలేక అమ్మ అక్క& నాన్న తో ఏదో మాట్లాడింది. ముగ్గురూ నా దగ్గరకు వచ్చి నాకు sorry చెప్పారు. నాన్న కంటిలో చెమ్మా చూడడం అదే ఫస్ట్ టైమ్.
నేను _ " సరేలే... ఈ సారికి అడ్జెస్ట్ అవుతాలే"
అక్క _ "మనస్పూర్తి అంటున్నావా?"
నేను _ "నా గురించి నీకెందుకు? నువ్వు మాత్రం అన్నీ దక్కించుకుంటున్నావు కదా...!"
ఆ మాట తో అక్క ఏడుస్తు వెళ్ళిపోయింది.
అమ్మ _ "ఏంట్రా అంత పెద్ద మాట అన్నావు? తప్పు కదా.."
నేను _ " ఇప్పుడు నేనేమన్నానని?"
నాన్న _ "రే భరత్... నువ్వు చేసింది తప్పు. మమ్మలి అక్కెప్పుడూ 'వాడికి తక్కువ చేసి నాకు ఎక్కువ చెయ్యండి' అని అనలేదు. నువ్వు తనని హార్ట్ చేశావు"
నేను_ (అక్క దెగ్గరకు వెళ్ళి) "అక్కా.... అలా ఏడవకే... Sorry వే"
అక్క _ " వద్దు రా... నీ sorry నాకేమొద్దు. ఎన్నో సార్లు special కర్రీస్, స్వీట్స్ లాంటివి చేసినప్పుడు నా కడుపు మార్చుకుని నీకోసం దాచి పెట్టాను. అవ్వేం నీకు కనపడలేదు. అమ్మ నాన్నలు చేసిన దానికి నన్ను మాటలు అన్నావు చూడూ... You have hurt me."
నేను _ " sorry చెప్తున్నాను కదవే"
అక్క _ " మనస్పూర్తిగా చెప్తున్నావా?"
నేను _ " నిన్నెల నమ్మించాలి ఇప్పుడు?"
అక్క_ " ఇప్పుడు కాదు... రేపు పొద్దున నీకు బర్త్డే విషెస్చెప్పినప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నమ్ముతా. వెళ్ళి పడుకో. రేపు సాయంత్రం నీతో కట్ చేయించడానికి కేక్ నేనే తయారు చేద్దాం అనుకున్న... మొత్తం మూడ్ స్పాయిల్ చేశావ్. రేపు మార్నింగ్ నేనే లేపి నీకు ఫస్ట్ విషెస్ నేనే చెప్తా... ఇప్పుడు వెళ్ళి పడుకో...."
Friends.... How is the story so far ...?
బర్త్డే రోజు అంతా భారత్ వాళ్ల అమ్మ అడుగుతూనే ఉంది "ఏరా... చీర తీసేసి వేరే బట్టలు వేసుకుంటావా?" అని. అతనికి తన పాత బట్టల లో birthday day spend చెయ్యడం ఇష్టం లేదు. "పర్లేదు లే అమ్మ. బానే ఉంది. ఉంచుకుంటాను లే" అన్నాడు. "జాగ్రత్త రా ... అసలే చాలా costly ది. ఏవైనా మరకలు పడి పాడవుతుందేమో" అని భయం గా చెప్పింది అమ్మ.
ఆ రోజు ముగిసేసరికి, అతనికి చీర బాగా అలవాటు అయ్యింది. ఆ రాత్రి పడుకునే ముందు చీర తీసేసి రోజు లానే పాత బట్టలు వేసుకుని పడుకున్నాడు. పట్టు చీర మాత్రం జాగ్రత్త గా మడిచి అమ్మ కి ఇచ్చేశాడు. Inners గట్రా అన్ని వాషింగ్ బుట్ట లో వేసేశాడు.
తర్వాతి రోజులు చిన్నచిన్న మార్పులతో మొదలయ్యాయి. ఇంట్లో అక్క వాడిని భారతి అని పిలవడం స్టార్ట్ చేసింది. "ఆట పట్టించకు అక్క" అంటే...., "నిన్ను అలా చీర లో చూసినప్పటి నుంచి నాకు ఒక చెల్లి కావాలి అని అనిపిస్తుంది. ఎలాగూ నా బట్టలే వేసుకుంటున్నావుగా... నిన్ను నా చెల్లి లా ఫీల్ అవ్వనీ రా..." అంది.
మొదట — ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే (అంటే అమ్మా నాన్నలు లేని సమయం లో) అలా పిలిచేది.
తర్వాత — అలవాటు అయిపోయి అమ్మ నాన్నల ఉన్నప్పుడు కూడా అక్కా - చెల్లెళ్ల లా మాట్లాడుకునే వారు.
కొద్ది రోజులకి — అది common అయిపోయింది. అమ్మ కూడా 'చెల్లి ని పిలువు... చెల్లి కి ఇది ఇవ్వు...' అలా అనడం స్టార్ట్ చేసింది.
ఇంకొన్ని రోజులకి -- నాన్న కూడా భారతీ అని పిలవడం.... తన గురించి మాట్లాడినప్పుడు 'చిన్న కూతురు ' అనడం స్టార్ట్ చేశారు.
ఈ మార్పులు నాచురల్ గా జరిగిపోయాయి... కొన్ని రోజులకు అమ్మ గమనించింది.
“ఇప్పుడేం కంప్లైంట్ లేదు కదా నీ బర్త్డే గురించి?” అని నవ్వుతూ వాడిని అడిగింది.
అతను చిన్నగా నవ్వాడు.
“బెస్ట్ బర్త్డే.”
నాన్న కూడా సంతోషంగా చూసేవాడు.
ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ బర్త్డే రోజు ఏదో అసంతృప్తి ఉండేది.
ఈసారి మాత్రం అతను ప్రశాంతంగా ఉన్నాడు.
ఒక రోజు పొద్దున్నే ఇంట్లో హడావిడి గా ఉంది. ఏంటని గమనిస్తే భరత్ కి అర్ధం అయ్యింది ఏంటంటే అమ్మ అక్కకు ఆ Birthday పట్టు చీర కట్టుకోవడం లో హెల్ప్ చేస్తుంది. భరత్ లో ఏదో తెలియని బాధ ఉండింది. రాత్రి ఆలస్యంగా అక్క తిరిగివచ్చింది. అతను వెంటనే చీర తీసుకుని చూసాడు.
దానిపై చిన్న చిన్న మరకలు ఉన్నాయి.
అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
“ఇది ఏమిటి?” అన్నాడు కోపంగా.
“అరే... చిన్నదే లే… డ్రై క్లీనింగ్కి ఇస్తే పోతుంది” అంది అక్క.
“Careful గా ఉండొచ్చు కదా.... ఎంత మంచి చీర... ఎలా పాడు చేశావో చూడు...." అన్నాడు కోపంగా.... "అంత లా react అవుతున్నావు ఏంటీ? నా చీర! నా ఇష్టం " అని కోపంగా అరిచింది అక్క. "అది నా చీర" అన్నాడు గట్టిగా.
అలా అంటూనే అమ్మ దగ్గరకు వెళ్లిపోయాడు.
“అమ్మా… చూసావా? నా చీర చెడగొట్టింది!”
అక్క - (వెంటనే)నీ చీరా? అది అది నాకు వచ్చిన గిఫ్ట్. ఏదో పాపం లే అని నేనే అమ్మా నాన్నలను ఒప్పించి నీకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాను!
భరత్ - ఎలాగైతే ఏంటి? నాకు ఇచ్చారు కదా!
నాన్న - (గొడవ లో జోక్యం చేసుకుంటూ) ఇంట్లో ఆడాళ్ళందరికీ ఆ చీర పై హక్కు ఉంది. గొడవ పడకండి.
అమ్మ - భరత్ నువ్వు ఆగు. ఏమే హేమ (అక్క పేరు) వాడు మగాడు అయ్యి ఉండి కూడా, first time అయ్యి ఉండి కూడా ఒక రోజంతా జారత్త గా ఉంచుకున్నాడు. నువ్వంటే ఒక్క రోజులోనే ఇలా పాడు చేశావు?
చివరికి అక్క కోపంగా అంది — “సరే. నిజంగా ఆ చీర నీకే కావాలా?”
భరత్ - కోపం గా “అవును.”
హేమ - “అయితే ఒక కండిషన్ — ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు చీరలే కట్టుకోవాలి. అప్పుడే అది నీది అవుతుంది.”
అతను కాసేపు ఆలోచించాడు.
భరత్ - (ఎలాగూ ఇప్పటికే ఎక్కువ సమయం అక్క బట్టల లోనే గడుపుతున్నాడు కాబట్టి) “ఓకే.”
అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దం.
అమ్మ ఆలోచించి ఒక పందెం పెట్టింది.
“సరే… మీరు ఇద్దరూ ఆ చీర కోసం పోటీ పడాలి.”
ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు.
“నేను నా రోజువారీ చీరలు మీ ఇద్దరికీ ఇస్తా. ఎవరు ప్రతిరోజూ బాగా వేసుకుని, ఇంటి పనుల్లో సహాయం చేస్తారో — ఆ వ్యక్తికే ఆ పట్టు చీర. చీర అంటే ఆట కాదు… బాధ్యత కూడా.”
హేమ - “చూద్దాం… భారతి. ఆ చీర ఎలాగైన నేనే గెలుచుకుంటా”
భరత్ - “చూద్దాం.”
తరవాత పడుకునేటప్పుడు భరత్ వాళ్ళ నాన్న ఇలా అన్నాడు...
నాన్న - ఎంటే ఇలా competition పెట్టావు? చీర ఎలాగు హేమ కీ నీకే గా...? మధ్యలో వాడిని ఎందుకు లాగావు?
అమ్మ - నాకూ ఆ మరకలు చూస్తే కోపం వచ్చింది. హేమ కీ కూడా ఇంటి పనులు, వంట పనులు నేర్పించాలి. ఎప్పుడూ నేర్పుదాం అనుకున్నా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంది. ఇదో మంచి అవకాశం.
నాన్న - ఏమో.... వాడి ఎమోషన్స్ తో ఆడుకోవడం తప్పు.
అమ్మ - తప్పేముంది? వాడు ఓడిపోతే వాడే ఇష్టంగా ఇచ్చేస్తాడు.
నాన్న - మరి వాడు గెలిస్తే?
అమ్మ - ఏముంది? వాడికే ఇచ్చేస్తాను. వాడు ఆ చీర కట్టుకొని ఎక్కడకు వెళ్తాడు? నాకు అవసరం వచ్చినప్పుడల్లా వాడిని అడిగి తీసుకుంటా. అప్పుడు కానీ హేమ తిక్క కుదరదు.
నెక్స్ట్ డే నుండి అమ్మ ఇద్దరికీ వాళ్ళ వాళ్ళ సైజ్ లలో 3 బ్లౌజ్ లు ఆల్టర్ చేసి మూడేసి చీరలు, లంగాలు ఇచ్చింది. హేమ మాత్రం భరత్ ను పందెం లో నుంచి తప్పుకునే లా ఎలా చేద్దాం అని ఆలోచించి ఇలా అంది.
హేమ - ఇంద.. ఈ బ్రా లు ప్యాంటీ లు తీసుకో. ఏదో చీర ఒక్కటే కట్టుకుంటే సరిపోదు. మొత్తం ఆడదానిల ఉండాలి.
భరత్ - నీకు ఆ చీర కట్టుకునే అర్హత లేకుండా చేస్తా... ఇలా ఇవ్వు.
ఇద్దరూ లో దుస్తులు వేసుకొని, లంగా - బ్లౌజులు వేసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి చీర కట్ట మన్నారు. అమ్మ మొదలు అక్క కి కట్టి తరవాత జడ వేసింది. అక్కకు కడుతుంటే చూసి నేర్చుకుంటూ భరత్ కూడా కట్టుకోవడం స్టార్ట్ చేశాడు. అమ్మ వాడి దగ్గరకు వచ్చే సరికి 80% కరెక్టుగా నే కట్టుకున్నాడు. అమ్మ సంబరపడి "హేమ..., చూస్తుంటే చెల్లి చేతిలో ఓడిపోయే లా ఉన్నావు" అని అంది.
హేమ - this is not fair. నాకు జడ వేశావు. వాడికి ... Sorry sorry... దానికి కూడా జడ ఉండాలి. ఈ సవరం తీస్కొని పెట్టు దానికి.
అన్ని షరతులకు ఒప్పుకున్నాడు భరత్. కేవలం school కి వెళ్లినప్పుడు తప్ప మిగతా టైమ్ అంతా చీరల లోనే ఉన్నాడు. ఇద్దరూ పోటీ పడి మరీ అమ్మకి సహాయం చేశారు. రెండు రోజుల్లో ఇద్దరూ చీర కట్టుకోవడం లో పెర్ఫెక్ట్ అయ్యారు. ఇంకో రెండు రోజుల్లో హాండిల్ చెయ్యడం లో కూడా పెర్ఫెక్ట్ అయ్యారు. పందెం గడువు దెగ్గరకు వస్తుండడం తో హేమ కు టెన్షన్ మొదలు అయ్యింది. ఎలాగైనా గెలవాలన్న తపన తోక చిన్న కుట్ర పన్నింది. ఒక రోజు కావాలనే తన ఫ్రెండ్ కావ్య అండ్ వాళ్ళ చెల్లి కవిత (భరత్ క్లాస్మేట్) లను ఇంటికి ఇన్వైట్ చేసింది. వాళ్ల ముందు భరత్ సీక్రెట్ బయట పెడితే ఆ సిగ్గు తో నైనా భరత్ పందెం నుండి తప్పుకుంటాడు అనుకుంది. వాళ్లకు ఏమీ చెప్పలేదు. జస్ట్ "నేను ముందు వెళ్తాను... నా వెనక అరగంట తరవాత నువ్వు మీ చెల్లెలిని తీసుకుని ఏదో ఒక పని ఉంది అని మా ఇంటికి రా. నేనే పిలిచినట్టు మా వాళ్ళకి తెలియకూడదు" అని చెప్పింది. కావ్య సరే అని అలాగే చేసింది.
కరెక్టుగా వాళ్ళు వచ్చే సమయానికి దూరం నుండి వాళ్ళని చూసి కావాలనే బాత్రూమ్ కి వెళ్ళింది. As usual బెల్ మ్రోగగానే బాత్రూమ్ వైపు వెళ్ళి ఎన్ని సార్లు కొట్టినా హేమ బయటకు రాలేదు. వాళ్ల అమ్మ డోర్ తెరిచి వాళ్లను బయట నిలబెట్టడం సరికాదు అని లోపలికి ఆహ్వానించింది. చేసేది ఏమి లేక భరత్ బెడ్రూం లో కి వెళ్ళి దాక్కుందాం అనుకున్నాడు. కానీ అంతలో వాళ్ళు చూసేసారు. ఇక తప్పక వాళ్ళు గుర్తుపట్టేశారు అనుకోని భరత్ 'Hai' అని పలకరించాడు.
కవిత - ఎవరు ఆంటీ ఈవిడ? అచ్చం భరత్ లాగే ఉన్నారు?
అమ్మ - అదీ.... అదీ....
హేమ - (అప్పుడే బయటకి వస్తూ) హాయ్ కావ్య... ఏంటి ఇలా వచ్చారు? అయ్యో sorry భరత్... కొంచం ఎక్కువ టైమ్ తీసుకున్నా నా?
కవిత - wow... ఏంటి? ఇది భరత్ ఆ??? అమేజింగ్....! ఏంటి ఈ surprise? నేను ఇంకా మీ చుట్టలు ఎవరో వచ్చారు అనుకున్నా.
కావ్య - seriously? ఇది మీ తమ్ముడా? ఎంత చక్కగా ఉన్నాడు... Sorry sorry... Enta చక్కగా ఉందీ... రా పిల్లా.... కూర్చో మాతో...
అమ్మ - మీరు మాట్లాడుతు ఉండండి... నేను కాఫీ కాస్తాను.
హేమ - రా... కూర్చో...
భరత్ వచ్చి వారి మధ్యలో కూర్చున్నాడు.
కవిత - So..., ఎందుకు ఇదంతా చేస్తున్నావ్? Tell me everything....!
భరత్ - ఏమి లేదు ఊరికే సరదా గా...
కావ్య - నేను నమ్మను. సరదాగా ఎవరైనా ఇలా చేస్తారా? ఏదో reason ఉండి ఉండాలి.
కవిత - అవును. సవరం కూడా పెట్టుకున్నావ్. మీ ఇంట్లో వాళ్లు కూడా accept చేశారు.... అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉండాలి. మా తో షేర్ చేసుకోవా please....!
భరత్ సిగ్గు తో తలదించుకుని ఏమి లేదు అన్నాడు. హేమ "మాత్రం నన్ను అడుగు నేను చెప్తాను...." అంది.
హేమ - అదేంటంటే మా ఇద్దరికి ఒక పందెం ఉంది. ఎవరు చీర ను బాగా క్యారీ చేస్తే వాళ్లకు మా అమ్మ ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పింది. అందుకే ఇలా...
కావ్య - అదేంటి??? ఇదో వింత పందెం లా ఉందే??? మీ అమ్మ నాన్నలు ఏమి అనలేదా?
భరత్ - అసలు ఈ పందెం పెట్టింది మా అమ్మ.
కవిత - wow... Aunty super అసలు...! పందెం లో గెలిసిన వాళ్లకు ఏం prize ఉంటుంది మరీ??
భరత్ - ఏమి లేదు... జస్ట్ ఫర్ ఫన్ అంతే. NO prizes...
హేమ - మరైతే ఆ ప్రైజ్ నేనే తీసుకోనా?
భరత్ - అక్కా... నువ్వు కొంచెం ఆపుతావా.... (కోపం గా)
కావ్య & కవిత - ఏమైంది మీ ఇద్దరికీ??
ఇంతలో అమ్మ "భారతీ... " అని పిలిచింది.
భరత్ - ఆ అమ్మా....
అమ్మ - అక్కడనుంచే పలుకుతావెంటే.... ఇలా వచ్చి ఈ కాఫీ తీసుకెళ్ళు.
భరత్ - వస్తున్ననమ్మ...
Oh shit... అని మనసులో అనుకుని లేగిచి చీర సర్దుకుని కిచెన్ లోకి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ "ఒసేవ్... నేను లేనప్పుడు చూసి వీళ్ళకు ఏమన్నా చెప్పావో, అక్కవని కూడా చూడను..." అంటూ కొంగు జాడించుకుంటూ వెళ్ళిపోయాడు
భరత్ - ఏంటమ్మా... మా క్లాస్మేట్ ముందు భారతీ అని పిలిచేసావు?
అమ్మ - అలవాటు అయిపోయింది లే వే.... మరి నువ్వెందుకు పలికావు?
భరత్ - నాకు అలవాటు అయిపోయింది అమ్మ...
అమ్మ - ఏంటంట కబుర్లు?
భరత్ - వాళ్ళు గుచ్చి గుచ్చి అడుగుతున్నారు, అక్క మొత్తం చెప్పేస్తుంది. నువ్వు మా ఇద్దరికి ఒక పందెం పెట్టావని, ఎవ్వర్తి గెలిస్తే దానికి ప్రైజ్ ఇస్తావు అనీ... (తనని తాను కూడా ఒక అమ్మాయి గా సంబోధించుకున్నాడు)
అమ్మ - నువ్వీ ట్రే పట్టుకెళ్లు.... నేనొచ్చి చెబుతా దాని సంగతి...
సరే అని తన కొంగుని వెనక నుంచి ముందుకి నడుం లోకి చెక్కుకుని కాఫీ & బిస్కెట్స్ ఉన్న ట్రే పట్టుకుని బయటకు వెళ్ళాడు. వీడ్ని చూసి నవ్వుతూ మాట్లాడుతున్న ఆ ముగ్గురూ shh shh అని ఆపేశారు. భరత్ కి మండింది. కావాలనే కాఫీ ఇస్తూ ఇస్తూ అక్క దగ్గరికి వచ్చే సరికి కప్ స్లిప్ అయ్యి అక్క చీర మీద పడే లా చేశాడు.
హేమ - అమ్మ చూడవే... చెల్లి నా పై కాఫీ పడేసింది. నా చీరంత నాశనం చేసింది.
అమ్మ ఆ కప్ పడ్డ శబ్దానికీ, హేమ అరుపు కి బయటకు వచ్చింది.
భరత్ - నేనేం కావాలని చెయ్యలేదమ్మా.... కప్ చేయి జారింది అంతే...
హేమ - అబద్ధాలు ఆడకే రాక్షసి...
భరత్ - నిజం అక్కా....
అమ్మ - ఆపండి ఇక.... హేమ, నువ్వు వెళ్ళి చీర మార్చుకో పో.... భారతీ..., ఆ చీర అండ్ లంగా పై పడ్డ మరకలు పోయేలా నువ్వే ఉతకాలి. మరక పోలేదో... నీ చీరలోంచి ఒకటి అక్కకు ఇచ్చేసి నువ్వే ఆ చీర కట్టుకోవాల్సి వస్తుంది. ఇద్దరికి బుద్ధి లేదు.... ఇంకా నయం... పాత చీర కాబట్టి సరిపోయింది. అదే కొత్త చీర అయ్యుంటే??? ఇంక మీ మొహాలకు పట్టు చీర పందెం ఒకటీ... ఇద్దరిలో ఎవర్తికీ ఇవ్వను. నేను ఉంచేసుకుంటా చెప్తున్నా...!
హేమ - అలా చెప్పమ్మా దానికి. (అంటూ లేచి బెడ్రూం లోకి వెళ్ళిపోయింది)
భరత్ - అమ్మా..., అది నా ఫస్ట్ చీరే... నేనేమైనా అక్క లాగా నగలూ నట్రా అడిగానా, జస్ట్ ఒక చీరే కదా... నా memories నాకు కాకుండా చేస్తావా? (అని కన్నీళ్లు పెట్టుకున్నాడు)
ఇదంతా గమనించిన కావ్యా - కవిత లు "పోనీ లెండి ఆంటీ... ఏదో పొరపాటు జరిగింది లెండి. ఇందులో ఇద్దరి తప్పు లేదు" అన్నారు.
అమ్మ - పోనీ లేవే... నువ్వు ఏడవడం ఆపు... ఆ చీర నీకే ఇస్తా... కానీ అప్పుడప్పుడు నాకు గాని అక్కకు గానీ అవసరం వచ్చినప్పుడు షేర్ చేసుకోవాలి. ఒకే నా??
భరత్ - okay ( అని కళ్ళు తుడుచుకున్నాడు)
కవిత - ఓహ్ ఇదంతా ఒక చీర కోసమా? మాకు చూపిస్తారా అంటీ ఆ చీర??
అమ్మ - అవునమ్మా... మొన్న birthday రోజు ఫస్ట్ టైమ్ చీర కట్టాము వీడికి... ఆ రోజు నుంచి స్కూల్ లో భరత్ , ఇంట్లో మా చిన్న కూతురు భారతీ గా చూసుకుంటున్నాం. చూడండి పిల్లలూ... మీరు నాకొక మాట ఇవ్వాలి... ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియొద్దు... మేము ఎంతో కష్టపడి ఈ విషయం సీక్రెట్ గా ఉంచాము. దయ చేసి అర్థం చేసుకోండి.
కావ్య - okay ఆంటీ... మీరేం భయపడొద్దు. మా ఇద్దరికి మీ ఫ్యామిలీ బాగా నచ్చింది. నేను హేమ ఎలాగూ బీట్ ఫ్రెండ్స్... ఇక నుంచి కవిత కి కూడా ఒక మంచి ఫ్రెండ్ దొరికింది అనుకుంటున్నాను. ఏమంటావే?
కవిత - కాదు అక్కా... నాకు ముగ్గురు ఫ్రెండ్స్ దొరికారు... ఈ ముగ్గురికి తప్ప ఎవ్వరితోనూ డిస్కస్ చెయ్యను.
కావ్య - ఎవరే వాళ్ళు?
కవిత - హేమ అక్క, భరత్ & భారతి....
అందరూ నవ్వుకున్నారు. అంతలో హేమ వచ్చి what did I miss? అని అడిగింది.
కావ్య - నేను చెప్తాను కానీ ఒకసారి ఇంటి బయటకు రావే... నీతో మాట్లాడాలి. ఆంటీ..., మీరా చీర తీసుకురండి... కవితా...., నువ్వూ భారతీ మాట్లాడుకుంటూ ఉండండి... One minute లో వస్తాము. (అని హేమ ను బయటకు లాక్కెళ్ళింది)
కావ్య - ఏమే..., ఎందుకే ఇలా చేశావ్?
హేమ - నేనేం చేశానే?
కావ్య - నంగనాచి... నీ తమ్ముడిని ఇబ్బంది పెట్టాలనే మా ఇద్దరిని ఇంటికి రమ్మన్నావు కదా...? పాపం వే... నీకా చీర పొందే హక్కే లేదు. నేనీ విషయం వాళ్ళకి చెప్పానో, నీ పరువే పోతుంది. నీ బెస్ట్ ఫ్రెండ్ గా నీకు చెప్తున్నా... తప్పే ఇదీ.
హేమ - sorry వే...
కావ్య - నాకు కాదు... భారతి కి చెప్పు. అది కూడా మేం వెళ్ళిపోయాక.
అలా మందలించి హేమ ను లోపలికి తీసుకువెళ్లింది. అంతలో అమ్మ ఆ పట్టు చీర తెచ్చి చూపెట్టింది. కావ్య & కవిత లు ఇద్దరికీ అది బాగా నచ్చింది. కావ్య ఆ చీరని హేమ పై & భరత్ పై పెట్టి "ఇది భారతి కే బాగా సెట్ అయ్యింది ఆంటీ" అంది. కవిత కూడా అవునంది.
హేమ - సరే అమ్మా... ఇది చెల్లికే ఇచ్చేయి. అప్పుడప్పుడు నాకు ఇస్తే చాలు.
భరత్ - okay అక్కా.
అమ్మ - సరే... ఈ పందెం ఇక అయిపోయినట్టే... వెళ్ళి నార్మల్ బట్టల్లోకి మార్చుకోండి. భారతీ..., ఈ చీర నీకే.... కానీ నా బీరువా లో దాస్తాను.
కావ్య & కవిత - ఆగండి ఆగండి... మేం వెళ్ళాక మార్చుకుందురు. ఆంటీ మీరేం భయపడకండి. మీ సీక్రెట్ మా దగ్గర సేఫ్. కాకపోతే ఒక కండీషన్... అప్పుడప్పుడు ఈ ఇద్దరు అక్క చెల్లెళ్లు కూడా మా ఇద్దరి అక్క చెల్లిళ్ల తో ఆడుకొనివ్వాలి.
అమ్మ - okay.