పాత్ర కోసం

Soumya

  | July 19, 2025


In Progress |   4 | 2 |   766

Part 1

గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నా పేరు సౌమ్య. నేను ఇప్పుడు ఒక పెద్ద హీరోయిన్‌ని… ఎంత పెద్ద హీరోయిన్ అయినా కానీ, లైఫ్‌లో టెన్షన్లు ఉండదంటే అబద్ధమే.
ఇలాంటి టైంలోనే మనం నిజంగా హీరోయిన్‌మా అనిపించే సన్నివేశాలు వస్తుంటాయి. అసలు విషయం ఏంటంటే… ఇప్పటికీ నేను మూడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించాను. ఆ మూడు సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. అందువల్లనే నేను ప్రొడ్యూసర్స్‌కు లక్కీగా మారిపోయాను.
నాకోసం చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్లు నా డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఒక రోజు, ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా చేసే అవకాశం వచ్చింది. నా PR టీమ్, ఆ మూవీ టీమ్ మధ్య అన్ని టెర్మ్స్ మాట్లాడుకున్నారు. నా డేట్స్‌ కూడా మ్యానేజ్ చేసి ఆ మూవీకి ఏర్పాటు చేశారు. ఇక నేను వెళ్లి కాంట్రాక్ట్ పేపర్ల మీద సైన్ చేయడమే మిగిలింది.
"రేపు మంచి రోజు" అని నా PR టీమ్ చెప్పడంతో, సరే అన్నాను.
నేను చాలా హ్యాపీగా ఉన్నాను… పెద్ద డైరెక్టర్, పెద్ద హీరోతో సినిమా… ఇక నా కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనిపించింది.
అప్పుడే సడెన్‌గా నాకు ఒక కాల్ వచ్చింది… ఎవరో చూద్దాం అనుకుంటే… నాకు మొదటి అవకాశం ఇచ్చిన డైరెక్టర్. ఆయన అంటే నాకు చాలా అభిమానం. కాల్ లిఫ్ట్ చేసి, "గుడ్ ఈవెనింగ్ సర్" అని విష్ చేశాను. డైరెక్టర్ సర్ కూడా నన్ను కంగ్రాట్స్ చెప్పారు – “కొత్త సినిమా వచ్చింది” అని.
"థ్యాంక్యూ సర్" అన్నాను.
అలా నేను డైరెక్టర్ సార్‌తో దాదాపు 30 నిమిషాలు మాట్లాడాను.
అక్కడికే... సడెన్‌గా "సౌమ్యా… నాకోసం ఒకటి చేస్తావా?" అని అడిగారు.
ఎంతైనా నాకు కొత్త జీవితం ఇచ్చిన డైరెక్టర్ కదా… "సరే చెప్పండి సర్" అన్నాను.
"ఏం లేదు సౌమ్యా… నా రీసెంట్ మూవీస్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ప్రొడ్యూసర్లు ఎవరూ నాతో సినిమా చేయడానికి రాగట్లేదు… అప్పులు అయ్యాయి… నా కెరీర్ మసకబారిపోతోంది సౌమ్యా… ఈ పరిస్థితి నుంచి నన్ను నువ్వే బయటపడేయాలి," అని కోరాడు.
"అయ్యో సర్, మీరు నాకొత్త జీవితం ఇచ్చారు. మీ కోసం ఏమైనా చేస్తాను. ఎలా సహాయం చేయాలో చెప్పండి సర్," అనాను.
"ఏం లేదు సౌమ్యా… నా దగ్గర మంచి కథ ఉంది. ప్రొడ్యూసర్స్, హీరోలు అందరూ ‘బాగుంది’ అంటున్నారు. కానీ ఒక కండిషన్ పెట్టారు."
"ఏంటి సర్ ఆ కండిషన్?" అని అడిగాను.
"ఆ సినిమాలో హీరోయిన్‌గా నీవుండాలి అనేది వాళ్ల కండిషన్. నువ్వే హీరోయిన్‌గా ఉంటే, నిన్ను చూసి ప్రొడ్యూసర్స్, హీరోలు ముందుకు వస్తారు. ఏందైనా, నువ్వు ఇప్పటి హీరోయిన్స్‌ లో టాప్‌లో ఉన్నవాళ్లలో ఒకరు కదా… లక్కీ హీరోయిన్ కూడా. అందుకే నీ డేట్స్ అడ్జస్ట్ చేస్తావేమో అని అడగాలని నిన్ను కాల్ చేశాను," అన్నాడు.
"సరే కథ ఏంటో చెప్పండి సర్," అని బహుశా తడబడుతూ సమాధానమిచ్చాను.
ఆయన క్షణం నిశ్శబ్దంగా ఉన్నారు. తరువాత శాంతంగా, కానీ లోతుగా అడిగారు —
"సౌమ్యా… ఒక చిన్న సినిమా చేస్తున్నాను… కొత్త కథ, కొత్త వేదిక. నువ్వే హీరోయిన్‌గా చేస్తావా?"
నాకు ఒక్కసారిగా షాక్‌ లాగా అనిపించింది. కొత్త సినిమా… కాని పక్కనే పెద్ద స్టార్ హీరో సినిమా వేచి ఉంది. నాతో డేట్ బుక్ చేసిన నిర్మాతలు ఉన్నారు.
"సర్… ఇప్పుడునా?" అని తక్కువ శబ్దంతో అడిగాను.
ఆయన నవ్వుతూ చెప్పారు —
"ఓ సారి కథ విను. ఇది నీ కోసం. నిజంగా నీ కెరీర్‌ని నిర్వచించే అవకాశం ఇది. ఫేమ్ కంటే... నటనను కోరుకునే పాత్ర."
నాలో ఏదో నిశ్శబ్దంగా కదలడం మొదలైంది. కెరీర్ మొదలుపెట్టిన ఆ డైరెక్టర్, నన్ను తొలిసారి స్క్రీన్ మీద నడిపించిన ఆయన మాటలు... నమ్మకంతో నన్ను చూస్తున్న కళ్లు.
"కథ చెప్పండి సర్…" అనాను.
ఆయన చెప్పడం మొదలెట్టారు —
ఒక గ్రామీణ ప్రాంతంలో సొంతంగా బతికే యువతి కథ. సమాజంతో పోరాడుతూ, తాను మలచుకున్న విలువల్ని నిలబెట్టుకునే కథ. గ్లామర్ లేని పాత్ర. కానీ గుండె తడిచేలా ఆవేశభరితమైన కథ. నిజమైన నటనకు పరీక్ష.**
ఆ కథ వింటుంటే నా కళ్ళలో నీరు తేలింది. ఇది నా జీవిత కథలా అనిపించింది.
"ఓకే సర్… నేనే చేస్తాను," అన్నాను… కానీ అది చెబుతూనే… నాలోని మరో ప్రశ్న నన్ను పట్టుకుంది. "మరి ఆ పెద్ద హీరో సినిమా?"
ఆయన అర్థమైనట్లుగా నవ్వారు.
"చాలా మందికి ఆ సినిమా వస్తుంది. కానీ ఈ పాత్ర… ఇది నీ కోసమే రాసినట్టిది. నువ్వు చేయకపోతే, ఎవ్వరు చేయలేరు."
"రేపు మూవీకి సైన్ చేస్తున్నాను సర్… కానీ సైన్ చేసే ముందు మీకూ డేట్స్ అడ్జస్ట్ చేస్తానని చెబుతానన్నాను," అనగానే,
"అది విన్నందుకు చాలా థ్యాంక్స్ సౌమ్యా," అని చెప్పి డైరెక్టర్ సర్ కాల్ కట్ చేశారు.
తర్వాత, నేను నా మేనేజర్‌ని పిలిచాను.
"ఈ కొత్త సినిమా డేట్స్‌లో, మా డైరెక్టర్ సర్ సినిమా కోసం కూడా డేట్స్ అడ్జస్ట్ చెయ్యాలి," అని చెప్పాను.
అది విన్న నా మేనేజర్ ఓ చిన్న నిశ్శబ్దం తర్వాత చెప్పాడు:
"మేడమ్, అలా సాధ్యపడదు. మీరు రేపు సైన్ చేయబోయేది పాన్ ఇండియా మూవీ. మీరు ఒకసారి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే, ఆ సినిమా పూర్తయ్యే వరకూ వేరే సినిమాకి సైన్ చేయకూడదన్న క్లాజ్ స్పష్టంగా ఉంది మేడమ్."
నేను కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాను. తర్వాత ఆత్మవిశ్వాసంతో అన్నాను —
"నేను మాట ఇచ్చాను. నీవు ఏమి చేస్తావో నాకు తెలియదు… కానీ డేట్స్ అడ్జస్ట్ చేయమని చెప్పు."
"సరే మేడమ్, రేపు మాట్లాడి చూస్తాను," అన్నాడు.
ఆ రాత్రి, నా స్కిన్‌ కేర్ రొటీన్ పూర్తి చేసుకుని నా రూమ్‌కి వెళ్లి పడుకున్నాను.
అదేప్పుడు నా మనసు మాత్రం బరువుగా మారిపోయింది.
మరుసటి రోజు ఉదయం లేచి రెడీ అయిపోయి, నా ఫేవరెట్ కలర్ అయిన గ్రీన్ మాక్సీ వేసుకుని అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్ళాను.
అక్కడ అప్పటికే డైరెక్టర్ సర్, ప్రొడ్యూసర్లు వచ్చేసరికి, నేను వెళ్లి వారిని గౌరవంగా విష్ చేశాను. డైరెక్టర్ సర్ నన్ను హగ్ చేస్తూ "వెల్‌కమ్ సౌమ్యా" అన్నారు.
అన్నీ వివరాలు చెప్పి అగ్రిమెంట్ పేపర్స్ నా ముందుంచారు.
ఆ సమయంలోనే… నేను నా మేనేజర్‌కి సిగ్నల్ ఇచ్చాను —
"డేట్స్ అడ్జస్ట్ చేయమని చెప్పు" అని.
ఇంకా నా మేనేజర్ ఆ విషయాన్ని డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కి వివరంగా చెప్పాడు.
వారు విన్న వెంటనే సీరియస్‌ అయ్యారు:
"ఇది పాన్ ఇండియా సినిమా. ఇందులో హీరోకి ఎంత ప్రాధాన్యం ఉందో… నీకూ అంతే. మేజర్ లీడ్ రోల్. అందుకే నీ లుక్ బయట కనిపించకూడదు. సినిమా అయిపోకముందే వేరే సినిమాలో సైన్ చేయొద్దని కాంట్రాక్టులో క్లియర్ గా ఉంది," అన్నారు.
నిజాయితీగా, నేనూ నా మాట నిలబెట్టుకోవాలని ప్రయత్నించాను:
"నాకు ఇంకో సినిమా ఛాన్స్ వచ్చింది. అది కూడా నా కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్ సర్," అన్నాను.
అప్పుడు ప్రొడ్యూసర్ తిట్టేలా, కానీ ఓ మితిమీరి జాగ్రత్తగా అన్నాడు:
"చూడండి మేడమ్… మిమ్మల్ని, మా హీరోగారినీ నమ్మి ఈ బడ్జెట్ పెడుతున్నాం. షెడ్యూల్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. మీరు పిలిస్తే షూటింగ్‌కి వెంటనే అందుబాటులో ఉండాలి. రెగ్యులర్ సినిమాల్లో మీరు తీసుకునే రెమ్యునరేషన్ కంటే రెట్టింపు ఇస్తున్నాం.
మా రూల్స్ అంగీకరిస్తే సైన్ చేయండి. లేదంటే మేము వేరే హీరోయిన్ చూస్తాం. ఏం నిర్ణయం తీసుకుంటారో రేపు లోపలే చెప్పండి."
అంటూ నాతో మాట్లాడి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు.
________________________________________
ఇప్పుడు…
నా మనసు కలవరం. ఒకవైపు పాన్ ఇండియా సినిమా — గ్యారంటీడ్ విజయం.
ఇంకొవైపు — నా మొదటి డైరెక్టర్… నన్ను హీరోయిన్‌గా మారుస్తూ మొదటి ఛాన్స్ ఇచ్చినవాడు… ఆయన కోసం చేసిన మాట.
చివరకు ఒక నిర్ణయం తీసుకున్నాను.
"పాన్ ఇండియా సినిమాకి ఓకే చెప్తాను.
అయితే… మా డైరెక్టర్ సర్‌కి మూడేళ్ల తర్వాత అయినా డేట్స్ ఇస్తానని చెప్తాను…"
కానీ... అది సరైన నిర్ణయమా?...
ఆ రోజు సాయంత్రం… డైరెక్టర్ సర్‌కి కాల్ చేసి చెప్పాను, "సర్… నా నిర్ణయం తీసుకున్నాను."
ఆయన కొంచెం నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత, గంభీరంగా చెప్పారు —
"నాకు అంత టైం లేదు సౌమ్య. వచ్చే వారం సినిమా స్టార్ట్ కాకపోతే… ఫైనాన్సర్లు నాపై కేసు వేస్తారు."
ఆయన గొంతులోని బిగుదల విని నాకు బాధ వేసింది. కానీ మనసులోని బాధను మింగేసి… నవ్వినట్లు నవ్వి —
"అలాంటిదేమీ ఉండదు సర్," అని చెప్పి… కాల్ కట్ చేసేశాను.
అంతలోనే కొత్త సినిమా డైరెక్టర్‌కి కాల్ చేసి,
"మీరు చెప్పిన షరతుకు ఓకే సర్," అని చెప్పా.
"అలాగే… రేపు అదే ప్లేస్‌లో కలుద్దాం," అన్నారు.
"సరే సర్," అని చెప్పి ఫోన్ పెట్టి పడుకున్నాను.
________________________________________
పొద్దున్న లేచేసరికి… పానిమనిషి వచ్చి,
"అమ్మగారు, ఈ కవర్ డోర్ దగ్గర పడి ఉంది," అని నా చేతికి ఇచ్చి వెళ్లిపోయింది.
ఆ కవర్ ఓపెన్ చేసి చూశాను… నా గుండె ఉలిక్కిపడిపోయింది.
ఆ కవర్‌లో నా పాత ఫోటోలు… నేను అబ్బాయిగా ఉన్నప్పటి ఫోటోలు…
నా ట్రాన్స్ఫర్మేషన్ ఫోటోలు… అన్నీ!
ఆ ఫోటోలతో పాటు ఓ లేఖ కూడా ఉంది.
"నువ్వు నాకే డేట్స్ ఇవ్వకపోతే… నీవు అసలు అమ్మాయే కాదన్న సత్యాన్ని…
ఈ సినిమా ఫీల్డ్ మొత్తం తెలుసుకునేలా చేస్తాను. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఉంటాయి.
అప్పుడు నువ్వే కాదు… నీ సినిమా కూడా ఆగిపోతుంది."
ఈ లేఖను ఎవరు రాశారు అని చూస్తే…
అది నా జీవితాన్ని ప్రారంభించిచిన అదే డైరెక్టర్…!
________________________________________
శరీరం కంపించిపోతున్నట్టుంది. కళ్ళలో నీళ్ళు తడిచాయి. కానీ తడిపించుకోవడం లేదు.
కాల్ చేసి సూటిగా అడిగాను —
"సర్… ఇది మీరే రాశారా?"
ఆయన చలించకుండా అన్నాడు —
"అవును. ఎప్పుడో ఫిల్మ్ నగర్ రోడ్ మీద నిన్ను చూసి ఒక్క అవకాశం ఇచ్చి… నిన్ను స్టార్ చేశాను.
ఇప్పుడు నేను జైలుకు వెళ్తానంట… నువ్వూ మళ్లీ రోడ్డుమీదకే రావాలి.
నా సినిమా సైన్ చేయ్. మనిద్దరం హ్యాపీగా ఉండగలుగుతాం.
లేకపోతే… నీకు ఇచ్చిన లాస్ట్ మూవీకి వచ్చిన 'బెస్ట్ ఫిమేల్ ఆర్టిస్ట్' అవార్డు కే నువ్వు అర్హురా?
నువ్వే అసలు అమ్మాయివే కాదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను."**
అని సూటిగా బెదిరించాడు. కాల్ కట్.
________________________________________
ఇదంత విని షాక్ అయారు కదా?
"హీరోయిన్ అంటావ్… కానీ మళ్లీ అబ్బాయా?" అనిపించింది కదా?
అవును… మీరు విన్నది నిజమే.
నేను ఒక అబ్బాయిని. గత ఏడాది వరకూ…
ఇప్పుడు నేను జెండర్ ట్రాన్సిషన్ సర్జరీ చేయించుకున్నాను.
కానీ ఎంత సర్జరీ చేసినా… సమాజం మాత్రం ఇంకా అమ్మాయిగా గుర్తించలేదు.
అందుకే నా భయం.
"ఇప్పుడు నా ఫ్లాష్‌బ్యాక్‌కి వెళితే…"
నిజం చెప్పాలంటే… నేను ఒక క్రాస్‌డ్రెస్సర్‌ని.
అంటే, అమ్మాయిలా డ్రెస్ వేసుకోవడం నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం.
ఇంట్లో ఎవరూ లేనప్పుడు, బయటకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు,
డ్రెస్‌లు సీక్రెట్‌గా క్యారీ చేసి, హోటల్ రూమ్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలా డ్రెస్ వేసుకునేవాడిని.
"అసలు నేనొక అబ్బాయిని… కానీ హీరోయిన్‌ అయ్యాను. ఇప్పుడు హీరోయిన్‌గా ఉండి కూడా, నాలోని అబ్బాయి వ్యక్తిత్వాన్ని దాచుకోవడం… రోజూ నిద్రలేకుండానే నడుస్తున్న కష్టం."
నా డ్రెస్‌లు, మేకప్ స్టఫ్ అన్నీ చాలా జాగ్రత్తగా దాచేవాడిని.
ఇంకా… నా వయసు చెపలేదు కదా… ఇప్పుడు 24ఏళ్లు. తక్కువ లావుగా, మధ్యస్థ శరీరాకృతిలో ఉంటాను.
ఆన్‌లైన్‌లోని వీడియోలు చూసుకుంటూ, మేకప్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. చిన్న జాబ్ చేస్తూ, నెలలో కొంత సేవ్ చేసుకుని ఒక మంచి రియల్ హెయిర్ విగ్ కొన్నాను.
అది పెట్టుకుని, లైట్ మేకప్ వేసుకుని రెడీ అయితే… నన్ను చూసి ఎవరూ "ఇతడు అబ్బాయి" అనలేరు.
అంత అందంగా, సహజంగా కనిపిస్తాను. కానీ మాట్లాడగానే గంత లోపం వల్ల కొంతవరకు అర్ధమవుతుంది — నేను అమ్మాయిని కాదని.
ఒక రోజు, నా ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ — కెనడాలో ఉంటాడు — ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు,
"ఇది కొత్త మెడిసిన్ Sowmya. ఈ టాబ్లెట్ వేసుకుంటే 24 గంటలపాటు నీ వాయిస్ పూర్తిగా అమ్మాయిలా మారుతుంది," అంటూ ఒక టాబ్లెట్ ఇచ్చాడు.
ఆ వాడు నా డ్రెస్ హాబీ గురించి ఇప్పుడే తెలుసుకున్నాడు.
"నీకు నాకంటే బాగా ఉపయోగా వస్తుంది," అని ఇచ్చాడు.
"సరే, ఓసారి ట్రై చేస్తాను" అని తీసుకున్నాను.
________________________________________
ఆ టాబ్లెట్ వేసి బయటకి వెళ్లే అవకాశం కోసం ఎదురు చూస్తుండగా… అనుకోకుండా నాకు హైదరాబాద్‌లో వర్క్ వచ్చింది.
డ్రెస్‌లన్ని బ్యాగ్‌లో ప్యాక్ చేసి నాలుగు రోజుల ట్రిప్‌కి వచ్చేశాను.
అక్కడ నా ఆఫీసు వర్క్ రెండు రోజులు… మిగిలిన రెండురోజులు — నా స్వప్న ప్రపంచం!
నా పని చేసే చోట దగ్గరగానే ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో ఒక హోటల్‌లో రూమ్ తీసుకున్నాను. మొదటి రెండు రోజుల్లో పని పూర్తయింది.
మూడవ రోజు ఉదయం లేచి, నా బాడీ హేర్ మొత్తం షేవ్ చేసుకుని, సాఫ్ట్‌గా చుడిదార్ వేసుకున్నాను.
నాకు లైట్ మేకప్‌ బాగా సెట్ అవుతుంది.
అదే నాకిష్టం. సహజమైన అమ్మాయి లా కనిపించేందుకు.
విగ్ పెట్టుకుని, క్లీన్‌గా సెటప్ చేసి, ఒక క్లిప్ వేసుకుని… జుట్టును ఓపెన్ చేసి వదిలేశాను.
అదే రూపం – అద్దంలో నాకు నచ్చిన అమ్మాయి.
అదే టైమ్‌లో, రెండు అంగుళాల హీల్స్ వేసుకుని, హ్యాండ్‌బ్యాగ్ తీసుకున్నాను. అందులో మొబైల్, డబ్బులు వేసుకున్నాను.
మొదటిసారిగా… ఆ టాబ్లెట్ వేసుకున్నాను. వేసిన కొద్ది నిమిషాల్లోనే… గొంతు విరిగినట్టు అనిపించింది.
బాగానే బాధించింది. మాట కూడా రాలేదు. "మొదట్లో అలానే ఉంటుంది" అనుకుని, ధైర్యం తెచ్చుకుని, రూమ్ లాక్ చేసి బయటకి వచ్చాను.
ఇంత వరకూ నేను ఎన్నో సార్లు హోటల్‌లో డ్రెస్ అయ్యాను. కానీ ఎప్పుడూ బయటికి రాలేదు.
కాని ఇప్పుడు… ఆ టాబ్లెట్ ఉన్న కారణంగా, ఒకింత ధైర్యంగా ముందడుగు వేసాను.
___
హోటల్ రెసెప్షన్‌కి వచ్చేసరికి…
"మేడమ్, మీ రూమ్ నంబర్ చెప్తారా?" అని అడిగాడు.
నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.
బయటే కాదు… నా గొంతు పని చేయకపోవడం వల్ల ఏం చెప్పలేకపోయాను.
ఆయన ఇంకాస్త దగ్గరకు వచ్చి,
"ఐడీ కార్డ్ ప్లీజ్," అని అడిగాడు.
తడబడి, భయంతో… నా చెమట తడిచిపోయింది. గుండె దద్దరిల్లిపోతోంది…

Part 2

సౌమ్యగా తొలిసారి అడుగు బయట పెట్టాను…
నన్ను నేనే నమ్మలేకపోయాను…
"ఇది నిజమేనా… నిజంగా నేనా?" అనే భావం గుండెల్లో గిజగిజలాడింది.
ఒక వైపు మాటల్లో చెప్పలేని ఆనందం…
మరొక వైపు… ఎక్కడో లోతుల్లో చిన్న భయం –
"ఎవరైనా గమనిస్తారేమో…" అనే అనుమానం.
కానీ… గుండె నిండా ఆత్మవిశ్వాసం కూర్చుకొని, నేను నడక మొదలెట్టాను.
అప్పుడు…
"Excuse me, madam…" అనే ఓ స్వరం నా వెనక నుంచి వినిపించింది.
"నన్ను కాదేమో," అనుకొని నేను ఆగకుండా ముందుకే నడిచాను.
మళ్ళీ…
"Excuse me, madam…"
ఈసారి, పిలుపు మరింత స్పష్టంగా వినిపించింది.
ఈసారి మాత్రం… నన్నే పిలుస్తున్నాడేమో అనిపించి వెనక్కి తిరిగాను.
అవునే… నిజంగానే నన్నే పిలిచాడు.
"ఏమిటండి?" అన్నట్టు తల తిప్పి ప్రశ్నించాను.
"మీరు చాలా బాగున్నారు… మీకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందా?" అని అడిగాడు.
మొదట నేను చిన్నగా నవ్వుతూ,
"థ్యాంక్యూ," అన్నాను.
"కానీ… నాకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదు సర్…"
అంటూ మృదువైన గాత్రంలో చెప్పాను.
అయితే అతనికి వినిపించలేదు.
"ఏం అన్నారు?" అని అడిగాడు.
అప్పుడు నాకు కొంచెం అసహనం వేసింది.
ఇంకా ఎడితే… అది అయింది.
నా అసలు స్వరం గట్టిగా బయటపడినట్టు అనిపించింది.
కానీ…
ఆ గొంతు కూడా – లేడీ వాయిస్‌లానే వినిపించింది.
అంటే…
నా ఫ్రెండ్ ఇచ్చిన టాబ్లెట్ పనిచేసింది!
అనే విషయం అర్థమైంది.
నాలో భయం మాయమైపోయింది.
కొంచెం ధైర్యం, కొంచెం ఆనందం…
మాటల్లోకి వెళ్ళిపోయాను. స్వేచ్ఛగా మాట్లాడడం మొదలెట్టాను.
________________________________________
ఇంకా అతను తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు.
"నేను ఓ సినిమా కోఆర్డినేటర్‌ని అక్కా…
ఈరోజు షూటింగ్‌కి తీసుకెళ్లాల్సిన జూనియర్ ఆర్టిస్టులను కలెక్ట్ చేస్తున్నాను.
కానీ ఒక అమ్మాయి తక్కువైంది.
ఇంకొక అమ్మాయిని ఇప్పటికీ కనుగొనడం చాలా కష్టం.
మా డైరెక్టర్ సార్ ఆలస్యమైతే చాలా కోపంగా ఉంటారు."**
"మీరు చాలా బాగున్నారండీ…
మీరు రాగలిగితే, మిమ్మల్ని డబుల్ పే చేసేందుకు రెడీగా ఉన్నాను," అని చెప్పారు.
“అది అంతా విని, ‘అయ్యో! నాకు ఇంట్రెస్ట్ లేదు సర్…’ అని చెప్పేశాను.
ఎందుకంటే నేను అక్కడికి వచ్చినది ఇంకో పనిమీదే…
అంతేకాదు… నిజానికి నేను ఒక అబ్బాయిని…
కానీ… ఆయన నన్ను అమ్మాయినే అనుకుంటున్నాడు.
ఎంత చెప్పినా ఆయన వినడం లేదు…
ఒకటే మాట – "ఒక్కరోజే మేడమ్… ఒక్కరోజే ప్లీజ్!" అని అడుగుతూనే ఉన్నాడు.
అప్పుడే పక్కనే ఉన్న వాన్ నుంచి ఒక అమ్మాయి దిగింది.
"ఒక్క రోజు మాత్రమే కదా మేడమ్… డైలాగ్స్ ఏముంటాయో లేవ్… పర్లేదు కదా!" అని నన్ను బతిమాలింది.
చాలాసేపు ఆలోచించాను…
ఇంతవరకు ఎవ్వరినీ – హీరోనీ, హీరోయిన్‌నీ – చూడలేదు… ఏదో ఒక సరదాకైనా చేస్తే తప్పేం?
అనిపించి… "సరే, ఒక రోజు అయితే చేస్తా." అన్నాను.
వాడు చాలా సంతోషంగా,
"థ్యాంక్యూ మేడమ్!" అని చెప్పాడు.
ఇంకా మేమంతా కలిసి వాన్లో ఎక్కాము.
వాళ్లు మమ్మల్ని ఒక స్టూడియోకి తీసుకెళ్లారు.
అక్కడినుంచి మళ్లీ షూటింగ్ స్పాట్‌కి.
అక్కడ అబ్బాయిలందరిని ఒక ప్రక్కకు తీసుకెళ్లారు.
నన్ను, నాతో పాటు వచ్చిన అమ్మాయిని – ఇంకా మరో ఇద్దరిని – డైరెక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.
డైరెక్టర్ సర్ మమ్మల్ని ఒక్కసారి చూశాడు… మౌనంగా తల ఊపి, "ఓకే…" అన్నాడు.
అలానే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మమ్మల్ని మేకప్‌రూంకి తీసుకెళ్లాడు.
అక్కడ ఆ రోజు సీన్‌కి అవసరమైన కాస్ట్యూమ్స్ ఇచ్చారు.
అవి తీసుకొని మేమంతా డ్రెస్‌చేంజ్‌ రూంకి వెళ్లాము.
నాకేమో… అంతా భయం భయంగా ఉంది.
పక్కనే ఉన్న అమ్మాయి దగ్గరికి వచ్చి,
"ఎందుకంత భయపడుతున్నావ్? ఇదీ ఓ కాలేజ్ డ్రామా లాంటిదే అనుకో…"
అని నవ్వుతూ ధైర్యం చెప్పింది.
నాకు పేరు అడిగింది.
"ప్రియా" అని చెప్పింది.
ఆమె వేసుకున్న డ్రెస్సు – సింపుల్ టీషర్ట్, స్కర్ట్.
మనం అందరూ అలానే డ్రెస్‌చేంజ్ చేసుకుని బయటికి వచ్చాం.
అసిస్టెంట్ డైరెక్టర్ మేకప్‌మెన్‌కి చెప్పాడు –
"ఈమెకు మేకప్ వేయండి."
అయితే నేను వేసుకున్న మేకప్ చూసి,
అదే మీదుగా కొద్దిగా టచ్‌అప్ చేసి పూర్తి చేశాడు.
అంటే నా రహస్యం బయటపడలేదు!
నా రియల్ హెయిర్ విడ్‌కి నేను ముందు నుంచి గ్లూ వేసి సెట్ చేసుకున్నాను,
అందుకే వారు ఏవిధంగా స్టైల్ చేసినా అది కదలలేదు.
ఇంకా నేను రెడీ అయ్యాను.
అయితే ఇంతలో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సీన్ వివరించాడు:
"ఇది ఓ కాలేజ్ సీన్.
హీరో-హీరోయిన్ మధ్య చిన్న గొడవ.
పక్కన ఉన్న అమ్మాయిలు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తారు.
వాళ్లలో నువ్వూ ఒకరు."
డైలాగ్స్ లేవు.
అందరం డైరెక్టర్ చెప్పినట్టు, హీరోయిన్‌కి వెనుక నిలబడ్డాం.
నాకు నెర్వస్‌గానే ఉంది. కానీ ప్రియా నా చెయ్యిపట్టి,
"ఏం లేదు… టెన్షన్ పడకూ!" అంది.
అయినా కూడా నా చేతులు చెమట పట్టేవి.
"ఇంత టెన్షన్ వస్తే… వెనకలైన్‌లో నిలబడి ఉండు!" అంది నవ్వుతూ.
"సరే!" అనుకొని వెనక వెళ్లి నిలబడ్డాను.
అంతా సెట్ అయ్యాక, అసిస్టెంట్ డైరెక్టర్:
"All ok sir!"
అని డైరెక్టర్‌కి చెప్పాడు.
కెమెరా రెడీ… లైట్స్… "యాక్షన్!"
"యాక్షన్!" అన్న డైరెక్టర్ మాటతోనే
సెట్ మీద ఒక ఊహించని శాంతి ఏర్పడింది.
హీరో, హీరోయిన్ మధ్య ఫన్నీ గొడవ నడుస్తోంది.
వాళ్ల వెనుక మనం — బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్.
సౌమ్య వెనకే నిలబడి ఉంది. నెర్వస్… కానీ లోపల ఏదో మత్తు, ఏదో బలమైన అనుభూతి…
అందరూ నటించాలనే పని చేస్తుంటే
ఆమె మాత్రం జీవిస్తోంది!
అప్పుడు… డైరెక్టర్ ఒక్కసారిగా
కెమెరా రోలవుతున్న టైంలోనే
"ఒక నిమిషం!" అన్నాడు.
అందరూ షాక్ అయ్యారు.
అతను ముందుకొచ్చి నేరుగా సౌమ్య వైపు చూశాడు.
"ఈ అమ్మాయి ఎవరు?" అని అడిగాడు.
అసిస్టెంట్ డైరెక్టర్ పరుగెత్తుకుంటూ వచ్చి,
"సర్, లాస్ట్ మినిట్‌కి వొచ్చిన జూనియర్ ఆర్టిస్ట్. టైమ్ షార్ట్ అవుతుంది కాబట్టి మీకు చెప్పలేకపోయాం…" అన్నాడు.
డైరెక్టర్: "ఓహ్… Interesting face. Refreshing presence… ఈ సీన్‌కి చిన్న close-up వేసి చూద్దాం!"
అందరూ ఆశ్చర్యపోయారు.
జూనియర్ ఆర్టిస్టుగా వచ్చిన అమ్మాయి
ఒక క్షణం ఖంగారు పడింది.
తన పేస్ లో ఆత్మవిశ్వాసాన్ని తనే విచ్చేస్తుందేమో అనిపించింది.
"All okay," అన్నాక డైరెక్టర్ "Action!" అన్నాడు.
హీరో, హీరోయిన్ మధ్య జరిగే ఫన్నీ సీన్‌లో మేమూ ఫిట్ అయిపోయాం.
ఒకటి కాదు, ఐదు టేకులు తీసుకున్నారంట.
మేమంతా చెప్పినట్టు చేశాం.
అంతలోనే మా పార్ట్ అయిపోయింది.
హీరో, హీరోయిన్ సీన్స్ చేస్తున్నారు.
మేమైతే మేకప్ తీసేసుకుని, డ్రెస్ మార్చేసుకుని సెట్ నుంచి బయటకి రావడం మొదలెట్టాం.
కానీ నేను మాత్రం ఒక్క డ్రెస్ మాత్రమే మార్చుకున్నాను.
మేకప్ తీసేసి ఏమయిన ప్రాబ్లమ్ వస్తుందేమో అనిపించి ఆపేశాను.
ఇంకా నేను, ప్రియా కలిసి కోఆర్డినేటర్ దగ్గరకి వెళ్లాం,
పేమెంట్ తీసుకోవడానికి.
నాకు ఇచ్చింది రూ.4000.
"ఇది సౌమ్యకు వచ్చిన మొదటి ఆదాయం," అనుకుంటూ హృదయంలో ఓ చిన్న సంబరం కలిగింది.
అక్కడినుంచి వాన్న్లోకి ఎక్కిపోతుండగానే…
ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి,
"మేడమ్, మీను సర్ పిలుస్తున్నారు…" అన్నాడు.
"ఎవరు సర్?" అని ప్రియా అడిగింది.
"డైరెక్టర్ సర్…" అన్నాడు.
"ఓహ్, వస్తున్నా. సౌమ్యా, నీవెళ్లి రా. నేను వాహనంలో వేచి ఉంటా," అంది.
నాకు ఏమాత్రం అర్థం కాలేదు.
ఎందుకు పిలిచారు? ఏం జరిగిందో?
అంటూ మెల్లగా నడుస్తూ డైరెక్టర్ దగ్గరికి వెళ్లాను.
"గుడ్ ఆఫ్టర్నూన్ సర్," అన్నాను.
"నీ పేరు?" అన్నాడు.
"సౌమ్య సర్," అన్నాను.
"హం… నైస్. బాగున్నావ్."
"థ్యాంక్యూ సర్…" అన్నాను
అప్పుడే పక్కన ఉన్న కోఆర్డినేటర్ "అవును సర్," అన్నాడు.
"నీకు పేమెంట్ సెటిల్ చేసాం కదా? ఇక్కడ ఏం చేస్తున్నావ్?" అన్నాడు కోఆర్డినేటర్‌ను చూస్తూ.
అదే మాట విన్న డైరెక్టర్ ముఖం మారిపోయింది.
"నన్నే రమ్మన్నాను… ఈ అమ్మాయిని ," అన్నాడు.
అంతే… కోఆర్డినేటర్ మౌనంగా తల వంపాడు.
"ఇంతకముందు ఏ సినిమాల్లోనైనా నటించావా?" అని నన్ను అడిగాడు.
"లేదండి… ఇదే నా మొదటి సారి," అన్నాను.
"అలానా !" అంటూ ఆయన ముఖంలో ఉత్సాహం కనిపించింది.
"సరే… ఈవెనింగ్ నా ఆఫీసుకు రా. కలుద్దాం."
అంతేకాదు, అసిస్టెంట్ డైరెక్టర్‌ని పిలిచి
"ఈమె ఫోన్ నంబర్ తీసుకో. కాంటాక్ట్‌లో ఉండు," అన్నాడు.
మళ్లీ కోఆర్డినేటర్‌ని చూసి,
"ఈ అమ్మాయిని ఈవెనింగ్ నన్ను కలవడానికి తెసుకొని రా," అన్నాడు.
నాకు అర్థం కాలేదు.
కానీ, నా లోపల ఏదో కలిసిపోని కలవర…
వాన్‌లోకి ఎక్కేసరికి ప్రియా అడిగింది:
"ఏమంటున్నాడు?"
"ఈవెనింగ్ తన ఆఫీస్‌కు రావాలని అన్నాడు," అన్నాను.
"వావ్! ఏంటి లక్కీగా కొట్టేసావ్ రా! ఫస్ట్ డేలోనే డైరెక్టర్ ఆఫీస్ మీటింగ్!"
నాకేమీ ఇంట్రెస్ట్ లేదు.
"ఇష్టంలేదు ప్రియా… వద్దు అనిపిస్తోంది."
"అలాగే ఎందుకు అంటావ్… వచ్చిన ఛాన్స్ వదులుకోకు!"
ఇపుడు… నేను నిజం చెపాల్సిన టైమ్ వచ్చేసింది.
ప్రియా చెవిలో చెప్పాను…
"నిజం చెప్పాలి," అనిపించింది.
"ప్రియా… నేను అబ్బాయిని. అమ్మాయిని కాదు. నేను ఒక క్రాస్‌డ్రెస్సర్ ని."
ఆమె మొదట నవ్వింది. "జోక్ చేస్తావ్ సౌమ్యా!"
"నిజం ప్రియా… నమ్మడం లేదు కదా… నా రూమ్‌కి రా, చూపిస్తా," అన్నాను.
"సరే… పద అనింది.
"ఇప్పుడు చెప్పు సౌమ్యా, నువ్వు చెబుతున్నదే జోక్ అనీ," అంది ప్రియ.
"ఇంకా చెప్పితే అర్థం కాదు, చూపించాలి," అన్నట్టు నా విగ్ తీయడమూ, చూపించడమూ చేశాను.
అయినా తను నమ్మలేదు. "జుట్టు లేని వాళ్లు విగ్ వేసుకోవడం కామన్ కదా," అంది.
ఇంకా నేను వేసుకున్న చుడిదారూ తీసేశాను. నా బ్రెస్ట్ ఫార్మ్స్ రిమూవ్ చేసి చూపించాను.
అదంతా చూసిన ప్రియా, షాక్‌లోకి వెళ్లిపోయింది.
"అంటే నువ్వు లేడీ గెటప్ ఆర్టిస్టా?" అని అడిగింది.
"మరి వాయిస్ ఏంటి?" అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది.
"నా గురించి క్లియర్‌గా చెప్తాను. విను," అన్నాను.
"నేను అబ్బాయి. కానీ అమ్మాయిలా డ్రెస్ అయ్యినప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది.
నా వర్క్ ట్రిప్స్ మీద క్యాంపులకు వచ్చాక, ఫ్రీ టైమ్‌లో ఇలా రెడీ అవుతాను.
ఈరోజు ఉదయానికూడా అలా రెడీ అయ్యి బయటకి వచ్చాను. అదే టైంలో ఆ కోఆర్డినేటర్ నన్ను రిక్వెస్ట్ చేశాడు. వెంటనే నువ్వూ వచ్చి అడిగావు.
ఇక మిగతా సంగతి నీకు తెలిసిందే" అన్నాను.
అదంతా విన్న ప్రియా ఇంకా షాక్‌లోనే ఉంది.
నేను డ్రెస్ మార్చుకుని మేల్ నైట్ డ్రెస్ వేసుకున్నాను. కానీ బ్రెస్ట్ ఫార్మ్స్ మాత్రం తీయలేదు. మళ్లీ వేసుకున్నాను.
మేకప్, వాయిస్, బ్రెస్ట్ ఫార్మ్స్ వున్న కారణంగా మేల్ డ్రెస్ వేసుకున్నా కూడా అమ్మాయిలా కనిపిస్తున్నాను.
అప్పుడు ఎవరో డోర్ తట్టాడు. అలానే వెళ్లి తలుపు తీయగా… రూమ్ సర్వీస్ బాయ్ వచ్చాడు.
నన్ను చూసి "మేడం, వాటర్ బాటిల్," అని ఇచ్చాడు. నేను తీసుకుని "థ్యాంక్యూ" అన్నాను.
"మేడం మీ వాయిస్ చాలా స్వీట్‌గా ఉంది," అన్నాడు.
నేను చిరునవ్వుతో "థ్యాంక్యూ" అన్నాను.
"ఇప్పుడు ఏం చేద్దాం ప్రియా?" అన్నాను.
"నీ పేరు నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతవరకు నువ్వు సౌమ్య నే.
నిన్ను అలా చూసిన ప్రతి ఒక్కరికీ నువ్వు అసలైన అమ్మాయిలానే కనిపిస్తున్నావు.
అంటే నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది.
అంతేకాకుండా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.
ముందు వెళ్లి డైరెక్టర్‌ను కలవు, ఏం అంటాడో చూద్దాం. ఆ తరువాత ఆలోచిద్దాం," అంది ప్రియా.
అంతలో నాకు ఫోన్‌కాల్ వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్.
"చెప్పండి," అన్నాను.
"సౌమ్యా గారా?" అన్నాడు.
"అవును," అన్నాను మృదువుగా.
"మేడం, మీకు సర్ ఆఫీస్ అడ్రస్, లొకేషన్ పంపించాను. ఈవెనింగ్ 7కి అక్కడ ఉండండి," అన్నాడు.
నాకు స్పందించేలోపే కాల్ కట్ చేశాడు.
"ఇప్పుడు ఎలా ప్రియా?" అన్నాను.
"నీకే చెప్పా కదా – వస్తోన్న ఛాన్స్ మిస్ చేసుకోకూడదు," అంది.
"నేను ఇప్పుడెక్కడికి వెళ్ళాలి, నా దగ్గర సరైన డ్రెస్సులూ లేవు," అన్నాను.
"డోంట్ వర్రీ. నీ సైజ్, నా సైజ్ ఓకే లాంటివే. మా ఇంటికి రా.
ఇలాగూ నువ్వు రెడీ అయిన తర్వాత ఎవరు నమ్మరు నువ్వు అబ్బాయివని. మా ఇంట్లో కూడా ఎలాంటి సమస్య ఉండదు," అంది.
అది నిజమే అనిపించి "సరే" అన్నాను.
మళ్లీ నేను ముందే వేసుకున్న చుడిదార్‌నే మళ్లీ వేసుకున్నాను. గ్లూ అప్లై చేసి విజ్ సెట్ చేసుకున్నాను.
విజ్ సెట్ చేయడంలో ప్రియా సహాయపడింది. ఇప్పటి వరకు నాకు హెయిర్‌స్టైల్ చేసుకోవడం రాలేదు.
కానీ ఇప్పుడు ప్రియా సహాయపడుతుంటే చాలా హ్యాపీగా ఉంది.
"ప్రియాకి నిజం చెప్పినందుకు చాలా బాగుంది. ఒక మంచి సపోర్టివ్ ఫ్రెండ్ దొరికింది," అనిపించింది.
"థ్యాంక్యూ ప్రియా," అన్నాను.
"అయ్యో అందులో ఏముంది… నీకు ఇష్టం వచ్చినట్టే నువ్వు ఉన్నావ్. ఎవరికీ ఇబ్బంది కలగలేదు కదా.
ఒకవేళ ఆ డైరెక్టర్ నీకు ఛాన్స్ ఇచ్చినా వదలకూ…
ఒక ఛాన్స్ తో నువ్వు పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది," అంది.
ఆ మాట విని నాకు స్వల్పంగా సిగ్గేసింది.
నా హ్యాండ్‌బ్యాగ్ తీసుకుని ప్రియ వాళ్లింటికి బయలుదేరాం.
వాయిస్‌ చెంజ్ టాబ్లెట్స్ కూడా పెట్టుకున్నాను.
అలా నడుచుకుంటూ ప్రియా ఇంటి వైపు పోతున్నాం.
రోడ్డుమీద కుర్రాళ్లు చాలా మంది నన్నే చూస్తున్నారు. నాకు కొంచెం భయం వేసింది.
ప్రియ వైపు దగ్గరకి వెళ్ళాను.
"ఎందుకు టెన్షన్?" అని అడిగింది.
"అబ్బాయిలు నన్నే చూస్తున్నారే…" అన్నాను.
"అంటే అర్థం ఏంటి?" అని అడిగింది.
"ఎమో…" అన్నాను.
"ఓయ్ పిచ్చిదానా, అబ్బాయిలు అమ్మాయిని చూస్తున్నారంటే మనం బాగున్నామన్నమాట.
వాటిని మనం కాంప్లిమెంట్స్‌లా తీసుకోవాలి. నీ విషయంలో కాన్ఫిడెంట్‌గా తీసుకో," అంది.
"సరే," అన్నాను.
ఇంకా ఇరువై నిముషాలు వాకింగ్ చేసి ప్రియా ఇంటికి వచ్చాం.
అక్కడ ఆమె అమ్మ ఉండింది. ఆమెకి నమస్కారం పెట్టాను.
"ఎవ్వరు?" అని అడిగింది నన్ను చూసి.
"ఇది నా ఫ్రెండ్ సౌమ్య అమ్మా. పని మీద హైదరాబాద్ కి వచ్చింది," అని చెప్పింది ప్రియా.
"సరే, నువ్వు రా vey," అని తన రూమ్‌కి తీసుకెళ్లింది.
"సౌమ్యా, ఇక్కడ నువ్వు, vey అనే పిలవు…" అంది.
"సరే, లే vey," అన్నాను.
"ఇంకా నీకు ఏ డ్రెస్ కావాలి?" అని అడిగింది.
"నాకు ఏమీ తెలీదు, నువ్వే వెయ్," అన్నాను.
"సారీ పద, నేను రెడీ చేస్తాను," అంది.
"సరే," అన్నాను.
తన వార్డ్రోబ్ నుంచి ఒక చీర తీసి ఇచ్చింది.
"చీరనా?" అన్నాను.
"అదే వేసుకో, పర్ఫెక్ట్," అంది.
"బ్రా ప్యాంటీ ఉన్నాయా?" అని అడిగింది.
"లేవు…" అని తలదించుకున్నాను.
"సరే, నేను ఇస్తా, ఉండు," అని తన బ్రా ప్యాంటీ ఇచ్చింది.
లోపలికి వెళ్లి ప్యాంటీ వేసుకున్నాను.
ఇప్పటికే ఎన్నో సార్లు వేసుకున్నాను కానీ… ఈసారి వేసిన ప్యాంటీ వేరే ఫీలింగ్ ఇచ్చింది.
ఎందుకంటే అది ఒక అమ్మాయి వాడినది కాబట్టి…
అందులోనే ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతున్నాను.
అప్పుడే "ఓయ్ సే!" అని తలుపు తట్టింది ప్రియా.
"హా వస్తున్నా," అన్నాను.
బ్రా వేసుకుంటున్నాను కానీ… కుదరడం లేదు.
"డోర్ ఓపెన్ చెయ్యి," అంది.
"ఉండు," అన్నాను.
"పర్వాలేదు, నేను హెల్ప్ చేస్తాను," అంది.
నా చేతులతో నా బ్రెస్టు కవర్ చేసుకుని తలుపు తెరిచాను.
ప్రియా లోపలకి వచ్చింది…
అప్పుడే నేను ఓ ప్యాంటీ వేసుకుని, బ్రా నా చేతులకే వేసుకున్నాను. కాని హుక్స్ పెట్టుకోవడం కుదరడం లేదు.
ఇంతలో ప్రియా వచ్చి, నా వెనకనించి మృదువుగా బ్రా హుక్స్ వేసింది.
అప్పుడు నేను బ్రా, ప్యాంటీ వేసుకుని, లూస్ జుట్టుతో నిలబడి ఉన్నాను.
ఆ దృశ్యాన్ని చూసిన ప్రియా ఆశ్చర్యంతో –
"అబ్బా! భలే ఉన్నావ్ వే్! అబ్బాయిలు కూడా అంత అందంగా ఉంటారని ఎవరూ ఊహించరు!" అని నవ్వింది.
ఆ మాట విని నాకు కోపం కాదు, కానీ ఒక రకమైన సిగ్గు వేసింది.
అదికూడా గుర్తించగానే, "మేడం గారికి సిగ్గు వచ్చిందట!" అంటూ నవ్వుతూ నన్ను తాకింది.
"సరే రా," అంటూ నన్ను తన రూమ్ లోకి తీసుకెళ్లింది.
నేను ఇంకా సిగ్గుతో తడబడుతూ…
"చూడు వే్, ఇక్కడ అబ్బాయిలు ఎవరూ లేరు. మనం ఇద్దరం అమ్మాయిలమే కదా. ఇంకెందుకు సిగ్గు పడాలి?" అంది హాయిగా.
అంతలో, ఓ పెటికోట్ తీసి, "ఇది వేసుకో," అంది.
ఆమె చెప్పినట్టే వేసుకున్నాను.
తర్వాత ఓ బ్లౌజ్ ఇచ్చింది. అది ముందు భాగాన వి షేప్ లో ఉండి, వెనక పూర్తిగా ఖాళీ – కేవలం ఓ సింగిల్ స్ట్రింగ్ మాత్రమే.
"ఇది అవసరమా?" అని అడిగాను.
"నేను చెప్పినట్టు విను, వేసుకో," అంది ప్రేమగా.
"సరే," అన్నాను. బ్లౌజ్ వేసుకున్నాను.
వెనక నుంచి స్ట్రింగ్‌కి ముళ్లు వేయడంతో బ్లౌజ్ నా శరీరాన్ని సన్నగా హత్తుకుంది.
తర్వాత ఆమె చీర తీసి, నన్ను సావధానంగా డ్రేప్ చేసింది.
అంతే కాదు – నన్ను డ్రెస్‌ టేబుల్ ముందు కూర్చోబెట్టి గ్లామర్ మేకప్ కూడా చేసింది.
నా చర్మం అంతా ప్రకాశిస్తూ కనిపించసాగింది.
చివరగా జుట్టు అందంగా స్టైలింగ్ చేసి, ఒక వైపుగా వదిలింది.
బ్యాగ్‌కి బదులుగా ఒక క్లచ్ purse ఇచ్చింది – అందులో నా డబ్బు పెట్టుకున్నాను.
తన హీల్స్ కూడా ఇచ్చింది.
నాకు ఇప్పటికే హీల్స్ వేసుకుని నడవడం అలవాటు కాబట్టి – నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
చివరగా...
ప్రియా క్యాబ్ బుక్ చేసింది.
"ఇంకో 20 నిమిషాల్లో క్యాబ్ వస్తుంది," అంది.
అయినా నాకు గడగడలాడే ఉత్కంఠ.
మిర్రర్ ముందు నన్ను చూస్తే – నేనే నమ్మలేనింతగా అందంగా ఉన్నాను.
ఒక ఆడియో ఫంక్షన్‌కు వెళ్తున్న హీరోయిన్‌లా కనిపిస్తున్నాను.
వెనకనుంచి ప్రియా వచ్చి నా భుజం మీద చేతిని వేసి –
"చాలా అందంగా ఉన్నావ్ వే్!" అంది.
వెనక్కి తిరిగి ప్రియాను కౌగిలించుకుని –
"థ్యాంక్యూ వే్!" అన్నాను మృదువుగా.
ఆ వెంటనే ప్రియా చిన్నగా హెచ్చరిక ఇచ్చింది –
"ఏదైనా ఒప్పుకోమంటే ఓకే అన్నా పరవాలేదు… కానీ డైరెక్టర్స్ కొన్నిసార్లు 'కమిట్‌మెంట్' అడుగుతారు.
అది మాత్రం చెప్పకుండా తలొగ్గకూడదు," అంది.
"సరే," అన్నాను గంభీరంగా.
"నిన్ను చూస్తే ఎవరైనా హీరోయిన్ ఛాన్స్ ఇస్తారు లే వే్!" అని నవ్వింది.
ఇంతలో క్యాబ్ వచ్చింది.
"ఆల్ ది బెస్ట్, Sowmya!" అంటూ స్నేహభావంతో వీడ్కోలు చెప్పింది.
"థ్యాంక్యూ వే్!" అంటూ నేను క్యాబ్ ఎక్కాను.
క్యాబ్ నన్ను డైరెక్టర్ గారి ఆఫీసు దగ్గరకి తీసుకొచ్చింది.
కింద దిగి చూస్తే అసిస్టెంట్ డైరెక్టర్ ఎదురుగా కనిపించాడు.
"రండి, " అంటూ మర్యాదగా స్వాగతం పలికాడు.
"సర్ రూమ్ దగ్గర ఉండండి, త్వరలో సర్ వస్తారు," అన్నాడు.
"సరే," అన్నాను.
కానీ లోపల మాత్రం నా హృదయం గట్టిగట్టిగా కొట్టుకుంటోంది.
ఒక్కో క్షణం నరాలను ఉద్రేకంలోకి నెట్టుతోంది.
"ఏమవుతుందో… డైరెక్టర్ ఎం అడుగుతాడో ఎం చెప్తాడో … లేక ప్రియా చెప్పినట్టే ' కమిట్‌మెంట్' అడిగేస్తాడేమో…" అనే భయాలు నన్ను పట్టిపీడిస్తున్నాయి.
ఒక్క క్షణం నా గుండె క్షణం కోల్పోతున్నట్టే ఉంది…

Part 3

డైరెక్టర్ సార్ నన్ను ఆఫీసుకి రమ్మని చెప్పగానే, ప్రియ కి చెప్పేశాను.
ఆమెకి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే నన్ను తన ఇంటికి తీసుకెళ్లింది.
"నీ దగ్గర సరిపడే డ్రెస్సులు లేవు కదా? ఫర్వాలేదు! మనిద్దరం అలానే ఒక్కే సైజ్ లో ఉన్నాం. నా బట్టలే వేసుకో!" అని చెప్పి,
ఒక బ్యూటిఫుల్ డీప్ వి నెక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ తో స్టైలిష్ స్టెయిన్ శారీలో నన్ను రెడీ చేసింది.
గ్లామరస్ మేకప్ వేసి, హెయిర్ అంతా ఒక వైపు వాల్చి సెటప్ చేసి, ఒక క్లచ్ purse ఇచ్చింది.
తన హైహీల్స్ కూడా ఇచ్చింది. ఫైనల్‌గా నాకు నా లుక్ చూస్తే — ఎవరైనా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి వెళ్తున్న హీరోయిన్ అనుకుంటారు!
ఇంతలో ప్రియా క్యాబ్ బుక్ చేసింది.
నేడు ఆ క్యాబ్ ఎక్కి, నేను డైరెక్టర్ సార్ ఆఫీసుకి వెళ్లాను.
అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ నా కోసం ఎదురు చూస్తున్నాడు.
నేను క్యాబ్ దిగగానే, "రండి మేడం" అంటూ నన్ను డైరెక్టర్ రూమ్ దగ్గరకు తీసుకెళ్లాడు.
"సార్ బిజీగా ఉన్నారు, మీరు ఇక్కడే కూర్చొండి" అన్నాడు.
"సరే" అని కూర్చున్నాను. కానీ లోపల మాత్రం టెన్షన్ మొదలైంది…
"ఎందుకు నన్ను రమ్మన్నాడు? ప్రియా చెప్పినట్టు ఏదైనా కమిట్‌మెంట్ అడుగుతాడా? అలాగైతే నేను అబ్బాయినని చెపేస్తా?"
అలాంటివే ఎన్నో ఆలోచనలు నాలో పుట్టాయి.
చివరికి 30 నిమిషాల తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి,
"సార్ పిలుస్తున్నారు" అని చెప్పాడు.
లోపలికి వెళ్లాను.
"గుడ్ ఈవెనింగ్ సార్," అన్నాను నా హస్కీ వాయిస్‌లో.
నన్ను చూడగానే,
"హా సౌమ్యా, రండి, కూర్చోండి," అన్నారు.
వెళ్లి సార్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాను.
డైరెక్టర్ సార్ నన్ను పైనుంచి కిందివరకు ఓ ఎగా దిగాచూసాడు.
ఆ చూపు నన్ను కాస్త ఒత్తిడిలోకి నెట్టేసింది.
"ఎక్కడ నేను అమ్మాయి కాదు అని తెలిసిపోతుందేమో?" అన్న భయం గుండెల్లో కల్లబొల్లలాడింది.
డైరెక్టర్: "సో మిస్ సౌమ్యా… మీరు ఈరోజే కదా మొదటిసారి కెమెరా ఫేస్ చేసింది?"
నేను: "అవును సార్…"
డైరెక్టర్: "హ్మ్… చాలా బాగున్నారు."
నేను: "థాంక్యూ సార్…"
డైరెక్టర్: "ఎక్కడ ఉంటారు మీరు?"
అంతా వివరంగా చెప్పేశాను — నా నేటివ్ ప్లేస్, నేను ఎలా జాబ్ చేస్తున్నానో…
"కో ఆర్డినేటర్ అడిగినప్పుడు యాక్ట్ చేసాను. రేపు ఈవెనింగ్ ట్రైన్ ఉంది. ఊరికి వెళ్లిపోతా. సోమవారం నుంచి మళ్లీ జాబ్‌కి లాగిన్ అవ్వాలి సార్," అని అన్నాను.
సత్యాన్నే చెప్పాను…
కానీ నేను చెప్పిన ప్రతిదీ — ఒక అమ్మాయి లా చెప్పాను.
ఎక్కడా "నాకు ఓ గందరగోళం ఉంది," అన్నట్టు చెప్పలేదు.
కొంచెం కూడాసందేహం కలిగించలేదు.
అంతా విన్న డైరెక్టర్ సార్ కాసేపు నిశబ్దంగా ఉన్నారు.
డైరెక్టర్: "ఈరోజు షూటింగ్ లో మానిటర్ లో నీ ఫేస్ జూమ్ చేసి చూశాను.
ఒక అమ్మాయిలో కనిపించని ప్రత్యేకమైన కళ నీ ముఖంలో చూసాను.
అందుకే నిన్ను ఆఫీసుకు రమ్మని చెప్పాను."
నేను: "థాంక్యూ సార్…"
డైరెక్టర్:
"నేను ఎంతో మంది అందమైన అమ్మాయిలను చూశాను…
కానీ వాళ్ళెవర్లో కనిపించని ఒక ప్రత్యేకత నీ ముఖంలో చూసాను."
సౌమ్య (విస్మయంతో):
"ధన్యవాదాలు సార్…"
డైరెక్టర్:
"అందుకే… నా తదుపరి సినిమాలో నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను."
(నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు… నిజం చెప్పేసేద్దామా వద్దా అని మనసులో వాడివేడి ఆలోచనలు.)
సౌమ్య:
"సార్… నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు already జాబ్ ఉంది. ఫ్యామిలీ… responsibilities అన్నీ ఉన్నాయి."
డైరెక్టర్:
"పర్వాలేదు. షూటింగ్ అంటే పెద్దగా రోజులు కావు. కేవలం 15 రోజులు మాత్రమే.
జాబ్‌కి 15 నుండి 20 రోజుల sick leave వేయించుకుని వచ్చి, షూటింగ్ పూర్తి చేసి మళ్లీ వెళ్ళిపోవచ్చు."
సౌమ్య:
"అయినా నాకు acting అంతగా రాదు సార్…
ఇవాళ డైలాగ్ లేదు కదా అని , టైమ్ ఉందికదా అని ఓకే అన్నాను."
డైరెక్టర్:
"అవి నేను చూసుకుంటాను కదా…
అయినా షూటింగ్ వెంటనే కాదు. ఇప్పుడు జరుగుతున్న సినిమా ఆగస్ట్‌కి పూర్తవుతుంది.
ఆ తరువాతే నీ సినిమా మొదలవుతుంది. అంటే నీకు టైమ్ ఉంటుంది.
ఒక్క 15 రోజులు డేట్స్ అడ్జస్ట్ చేయి."
సౌమ్య :
"సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు."
డైరెక్టర్ (దృఢంగా):
"లేదు సౌమ్య… నా సినిమాలో నువ్వే ఉండాలి అని నేను ఫిక్స్ అయిపోయాను.
ఎంత ఖర్చయినా పర్వాలేదు… నీకు నేను ఫిక్స్ అయ్యాను.
ఈ పాత్రకు నువ్వే సరైనవు!"
(సరే, షూటింగ్ ఎప్పుడూ కాదంటున్నాడు… ఇప్పుడే నిజం చెప్పేసి అవసరం లేదు.
వీటన్నిటికీ ఓసారి ఆలోచించి చెప్తే మంచిదే… ఇంటికెళ్లాక కాల్స్‌కి లిఫ్ట్ ఇవ్వకపోతే సరిపోతుంది కదా అన్నట్టు నాలో నేను ఉద్దేశించాను.)
సౌమ్య:
"సరే సార్… నేను కాస్త ఆలోచించి, ఆఫీస్‌లో లీవ్‌కు అప్లై చేసి, ఎప్పుడు రావచ్చో చెప్తాను."
డైరెక్టర్:
"బాగుంది… బాగా ఆలోచించు.
ఇలాంటి పాత్ర మళ్లీ మళ్లీ రావు.
నువ్వు ఓకే అయితే… పెద్ద హీరోయిన్ అవుతావ్!"
(నాలో నాకే నవ్వొస్తోంది… “నాకు బాడీనే లేదు, ఇంకా నేను అమ్మాయిని కూడా కాదు… ఈ సినిమా చేస్తేనే ఎలా హీరోయిన్ అవుతాను?” అని నా మనసులో నవ్వుకున్నాను.)
సౌమ్య:
"సరే సార్… ఇక నేను వెళ్తాను."
అంటూ లేచి వెనక్కి తిరిగి నడుస్తున్నా…
ఆ సమయంలో వెనుకనుండి చూసిన డైరెక్టర్ ఒక్క మాట వేశాడు—
"పర్వాలేదు… నువ్వు అబ్బాయికంటే… అమ్మాయిగానే చాలా బాగున్నావ్!"
ఆ మాట వినగానే నా గుండె ఒక్కసారిగా పగిలిపోయినట్టైంది.
అయో… నిజం తెలిసిపోయిందా?!
షాక్‌తో, టెన్షన్‌తో డైరెక్టర్ వైపు తిరిగి,
"సార్… అది…" అంటూ ఏదో చెప్పబోయాను…
డైరెక్టర్ నన్ను చూసి:
"నాకు తెలుసు… నువ్వు అబ్బాయివి… కానీ అమ్మాయిలా వేషం వేసావని."
నాకొంచెం గమ్మత్తుగా:
"సార్… మీకిది ఎలా తెలుసింది?" అని అడిగాను.
డైరెక్టర్ చిరునవ్వుతో:
"పొద్దున్నే షూటింగ్ లోనే అర్థమైంది.
నువ్వు ఎంతవరకూ మేనేజ్ చేస్తావో చూద్దాం అనిపించింది.
అందుకే నిన్ను ఆఫీసుకి రమ్మన్నాను.
కానీ నువ్వు మాత్రం ఆశ్చర్యంగా చాలా బాగా మేనేజ్ చేసావు."
ఆ మాట వినగానే నాకు లోపల ఏదో బరువు పడినట్టే అనిపించింది. అవమానంగా తలదించుకున్నాను.
డైరెక్టర్ నన్ను చూసి:
"నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ పని చాలా అద్భుతంగా చేశావు," అన్నాడు.
"అంటే సార్… ఇది అంతా నన్ను టెస్ట్ చెయ్యడానికేనా? ఈ మూవీ ఛాన్స్ నిజమేనా?" అని అమాయకంగా అడిగాను.
డైరెక్టర్ నవ్వుతూ:
"ఆ మాటకు నవ్వే ఎందుకు రాదు? సినిమా ఛాన్స్ నిజమే!
నీ లుక్, నీ ఎక్స్‌ప్రెషన్ చూసాక నాకు ఆ పాత్రకి నువ్వే కరెక్ట్ అనిపించింది."
"ఏంటి ఆ పాత్ర సార్?" అని అడిగాను.
ఆ తరువాత డైరెక్టర్ నన్ను జాగ్రత్తగా కూర్చోమని చెప్పి కథ వివరించసాగాడు…
కథ సారాంశం:
ఒక అబ్బాయి చిన్నప్పటినుంచి అమ్మాయిలా ప్రవర్తిస్తూ ఉండడం. ఇంట్లో వారు అంగీకరించక, బయటకి పంపడం. అక్కడ అల్లరి పనులు చేస్తూ, కాస్త సంపాదన వచ్చినాక తన రూపాన్ని పూర్తిగా మార్చుకుని, కొత్త ప్రదేశానికి వలస వెళ్లి అమ్మాయిగా గౌరవంగా జీవించడం. తన గతాన్ని ఎవరికీ తెలియకుండా ఉంచడం.
ఈ సమయంలో —
హీరో తండ్రి ఒక డేంజరస్ విలన్. అతను ట్రాన్స్‌జెండర్లను ట్రాప్ చేసి, వారిని చంపి వారి శరీర భాగాలతో వ్యాపారం చేస్తూ ఉంటుంది. కొంతమంది అందంగా కనిపించే ట్రాన్స్‌జెండర్లను దుబాయ్ షేక్‌లకు అమ్మేస్తుంటాడు.
నా పాత్ర:
హీరోయిన్‌కి బెస్ట్ ఫ్రెండ్. ట్రాన్స్‌జెండర్ అనే విషయం హీరోయిన్‌కి తెలుసు, కానీ ఆమె ఎప్పుడూ నన్ను నిజమైన అమ్మాయిగా గౌరవంతో చూస్తుంది. ఇద్దరం ఒకే ఫ్లాట్‌లో ఉంటాం.
ఒకరోజు, అపరిశ్రాంతంగా ఆమె నా గురించి హీరోకి చెబుతుంది. అదే విషయం హీరో తండ్రికి తెలియడంతో అతను తన బ్యాచ్‌తో నన్ను ట్రాప్ చేయించేందుకు సిద్ధమవుతాడు.
కానీ నా పాత్ర ఆ అబ్బాయిని నిజంగా ప్రేమించడం మొదలుపెడుతుంది.
తర్వాత నన్ను చంపడానికి సిద్ధం అవుతారు.
ఆ సమయంలో హీరో, హీరోయిన్ కలిసి నాకు సహాయం చేయడానికి వస్తారు.
తుదకు హీరో తండ్రే అసలు విలన్ అని తెలుస్తుంది.
వారిని ఓడించి, నన్ను మాత్రమే కాదు — చాలా మంది ట్రాన్స్‌జెండర్లను రక్షిస్తారు.
డైరెక్టర్ చివరికి:
"ఈ కథలో నువ్వు హీరోయిన్ కాదేమో… కానీ కథంతా నీ చుట్టూనే తిరుగుతుంది.
ఈ పాత్రకి నువ్వే పర్ఫెక్ట్!" అని అన్నారు.
అంతా విని,
"సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి," అని చెప్పి అక్కడి నుంచి బయటకి వచ్చాను.
________________________________________
ప్రియ ఇంటికి వెళ్లాక:
జరిగిందంతా ప్రియకి చెప్పాను.
ఆమె కూడా ఒప్పుకోమని చెపింది —
"ఇలాంటిది మళ్లీ మళ్లీ రాదు సౌమ్యా," అని అంది.
"నాకు కాస్త టైం కావాలి," అన్నాను.
"ఆలోచించుకో… కానీ ఇది గొప్ప ఛాన్స్. వదిలేయకు!" అని బలంగా చెప్పింది.
అక్కడినుంచి నేను నా హోటల్‌కి వెళ్లి పడుకున్నాను.
రాత్రి నిద్ర కూడా రాలేదు…
తర్వాత రోజు ఉదయం:
లేస్తూనే మళ్లీ బాగాగా తయారైపోయి…
కానీ సౌమ్యలా కాదు… మళ్లీ మళ్లీ నా పాత రూపంలోకి,
అబ్బాయిగా మారిపోయాను.
ట్రైన్ ఎక్కి, నా ఊరు తిరిగొచ్చాను.
అన్నీ మామూలుగానే ఉన్నట్టు అనిపించాలి అనుకున్నాను…
కానీ రోజూ ప్రియా, డైరెక్టర్ సార్ మెస్‌జ్ చేస్తున్నారు…
"ఏం డిసైడ్ అయ్యావ్?"
ఆ మేసేజ్‌లను చూసినా… నన్ను వెనక్కి లాగే ధైర్యం నాకు రాలేదు.
అదే సమయం, నేనొక నిర్ణయం తీసుకున్నాను.
"ఇంకెప్పుడూ సినిమా చేయను!"
డైరెక్టర్ సార్‌కు కాల్ చేసాను…
ఫోన్‌లో సంభాషణ
డైరెక్టర్:
"గుడ్ మార్నింగ్ సౌమ్యా."
సౌమ్య:
"గుడ్ మార్నింగ్ సార్."
డైరెక్టర్:
"చెప్పు సౌమ్యా… ఏం డిసైడ్ అయ్యావ్?"
సౌమ్య:
"సార్… మీరు చెప్పిన పాత్ర నేను చేయలేను సార్."
డైరెక్టర్ (ఆశ్చర్యంగా):
"ఎందుకు సౌమ్యా? ఏం జరిగిందీ?"
సౌమ్య:
"ఏం కాకపోయినా సరే సార్…
నేను ట్రాన్స్‌జెండర్ పాత్ర చేస్తే… మువీ బాగుంటుంది కావచ్చు.
కానీ… నా కెరీర్‌కి ఊహించని దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది సార్.
సొసైటీ నన్ను తక్కువగానే చూస్తుంది.
సినిమాలో పేరు రావచ్చు, కానీ బంధువుల దృష్టిలో నేను ఏదో తేడాగా మారిపోతాను…
నా తల్లిదండ్రులకు చిన్నదనంగా అనిపిస్తుంది."
డైరెక్టర్ (నిదానంగా):
"అలా ఏం జరగదు సౌమ్యా…"
సౌమ్య:
"జబర్దస్త్ లో లేడీ గెటప్స్ situation ఎలాగో అందరికి తెలుసు సార్…
ఇప్పటి నుంచే దాన్ని వినోదంగా చూసే సమాజం… నాకు గౌరవాన్ని ఇస్తుందా సార్?
అందుకే… నన్ను మాఫ్ చేయండి. ఈ పాత్ర నేను చేయలేను."
డైరెక్టర్ (నిశ్శబ్దంగా, ఆలోచిస్తూ):
"హుమ్… ఇదే కదా నీ అసలు సమస్య…"
సౌమ్య:
"అవును సార్."
డైరెక్టర్ (ఒక ఉత్సాహంతో):
"అయితే… నువ్వు అబ్బాయిగా వచ్చి ట్రాన్స్‌జెండర్ పాత్ర చేస్తే కదా సమాజానికి అంత ఆలోచన ఉండదు?"
సౌమ్య:
"అవును సార్."
డైరెక్టర్:
"అయితే, నువ్వు అబ్బాయిగా కాదు… అమ్మాయిగా వచ్చి నటించు.
అప్పుడు ఈ సినిమాలో ట్రాన్స్‌జెండర్ పాత్రను ఓ అమ్మాయి చేస్తుందనీ అందరూ అనుకుంటారు."
సౌమ్య (గుండెల్లో ఒక గందరగోళం):
"అది ఎలా సాధ్యం సార్?"
డైరెక్టర్:
"నువ్వు అబ్బాయివి అన్న విషయం నాకూ, మా ప్రొడ్యూసర్‌కే తెలుస్తుంది.
బాకీ అందరూ నిన్ను నిజమైన అమ్మాయిగా అనుకుంటారు.
నిన్ను అమ్మాయిగా ప్రిపేర్ చేయడం నా బాధ్యత."
సౌమ్య:
"సరే సార్… అలాగైతే… షూటింగ్ ఎప్పుడంటే?"
డైరెక్టర్:
"ఇంకో నెలలో, రెండో తారీఖున స్టార్ట్ అవుతుంది.
కానీ నువ్వు ఆపటికే పూర్తి స్థాయిలో అమ్మాయిగా మారి ఉండాలి కాబట్టి,
ఈ నెల 15న హైదరాబాదుకి వచ్చేయి.
నిన్నుఅమ్మాయిగా ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలి కదా."
సౌమ్య:
"సరే సార్…"
అంటూ ఫోన్ కట్ చేసేశాను.
అంతే… ఇంట్లో అందరికీ “ఆఫీస్ పనిమీద విదేశానికి వెళ్తున్నా” అని చెబుతూ,
నా బట్టలు ప్యాక్ చేసుకుని హైదరాబాదు బయలుదేరాను.
హైదరాబాదు చేరాక డైరెక్టర్ సార్‌కి ఫోన్ చేశాను.
అప్పుడు ఆయన:
"సరే, నిన్ను పికప్ చేయడానికి ఒకరిని పంపిస్తున్నాను."
అని చెప్పి కాల్ కట్ చేసేశారు.
ఒక పది నిమిషాల లోపు…
ఓ కారు ఆగింది…
దాన్లోనుంచి బయటకి వొచింది – ప్రియా!
ప్రియాను చూసి నేను షాక్ అయిపోయాను.
"ఏంటి నువ్వా!? ఇక్కడ?" అని ఆశ్చర్యంతో అడిగాను.
ఆమె మాత్రం చిరునవ్వుతో:
"అవన్నీ తర్వాత చెప్తా…
రా వేయ్ సౌమ్యా! ఇక నీ ప్రయాణం మొదలైంది!"
అంటూ నన్ను డైరెక్టర్ సార్ గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్లింది.
వెళ్లి స్నానం చేసి బయటకి వచ్చాను…
ప్రియా చెబుతుంది:
"రెడీ అవు సౌమ్యా…
ఇప్పటి నుంచి నిన్ను నిజంగా సౌమ్యగానే మార్చాలి.
చాలా పనులున్నాయి!"
అప్పుడు నాకు అసలు విషయం తెలియలేదు…
ఈ పాత్ర ఒప్పుకున్నదే ఒక పెద్ద తప్పు అయ్యింది అని.
కానీ అదే తప్పు… నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందనీ కూడా
అప్పుడు నాకు అర్థం కాలేదు.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Anbeena Anbeena

Wow, great start Soumya sweety. Next part when???? 💓

Soumya Soumya (Author)

thank you sis. next week i upload next part

Rmaruthi Rmaruthi

good start soumya

Soumya Soumya (Author)

thank you