అలాగే భారతక్క టీం పేరుతో నేను తయారు చేసిన కోయ యువతుల గ్రూప్ డాన్స్ లో మేం అందరం చేసిన డాన్స్ అందరికీ చాలా బాగా నచ్చింది. మాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు.
దాంతో భారతక్క టీం లో ప్రతిఒక్కరికీ నేనంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఆ రోజు రాత్రి లీల, నిరోషా నా గదిలో పడుకోవడానికి వచ్చారు. ఇంక మా ముగ్గురికి రాత్రంతా జాతరే.
మరుసటి రోజు, భారతక్క మమ్మల్ని విల్లుపురంలోని ముగయ్యూర్ ప్రాంతంలోని డాక్టర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొనటానికి తీసుకువెళ్ళింది. నాకు మరాఠీ స్టైల్ లో పట్టుచీర కట్టింది. . నా శైలి మరియు విశ్వాసాన్ని ప్రదర్శించడానికి జాగ్రత్తగా ఎంచుకున్న అద్భుతమైన పట్టుచీరను ధరించాను అని అందరూ పొగిడారు. . నేను భరతనాట్యం నర్తకి శైలిలో నడుస్తున్నప్పుడు, ప్రేక్షకులు నా సమతుల్యత మరియు చక్కదనాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.
నా సమాజానికి ప్రాతినిధ్యం వహించడం నాకు సాధికారత మరియు గర్వంగా అనిపించింది. న్యాయనిర్ణేతలు నా ఆత్మవిశ్వాసాన్ని మరియు వేదిక ఉనికిని ప్రశంసించారు మరియు నేను ఫైనల్స్‌కు చేరుకున్నాను.
భారతక్క టీం లో అందరూ భిన్న భిన్న దుస్తులను ధరించి చక్కని నడకలు నడిచారు. మా బృందంలో అందరి నడకలు అందరికీ నచ్చాయి.