మరునాడు ఉదయం 7.00 గంటలకు భారతక్క తలుపు తట్టేవరకూ నేను, కుష్బూ ఒకళ్ళనొకళ్ళు వాటేసుకుని పడుకున్నాం. భారతక్క పిలుపుకి ఖుష్బూ బుగ్గ మీద నాకో ముద్దిచ్చి మరీ లేచి తలుపు తీసి "భారతక్క, మధు is a very sweet girl" అంది.
"అంటే రాత్రంతా పిల్లని ఉతికేశావన్నమాట." అంది అక్క. నా వైపు తిరిగి "మధు, నిన్న రాత్రి ఖుష్బు నీ దగ్గరకి వచ్చింది నీకు తోడుగా పడుకోడానికి మాత్రమే కాదు. నీలో స్త్రిత్వం ఎంతుందో తెలుసుకోవడానికి. నువ్వు చాలా మంచి పిల్లవి. తొందరగా నువ్వు స్నానం చేసి రా. మా హాల్లో ముస్తాబు చేస్తారు లే నిన్ను. అక్కడే నాస్తా చేసి మనం నెహ్రూ కమ్యూనిటీ హాల్ కి వెళ్దాం. అక్కడ డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి. సోలో డాన్స్, గ్రూప్ డాన్స్ పోటీలు ఉంటాయి." అని చెప్పింది. "అలాగే అక్కా" అని చెప్పి ఇరవై నిమిషాల్లో స్నానం పూర్తి చేసుకుని మరో కొత్త నైటీలో దూరి, అక్కదగ్గరకి, నా లగేజ్ తో వెళ్ళాను. అక్కడ నాకు బెంగాల్ కాటన్ యెల్లోశారీ, గ్రీన్ బ్లౌజు ధరింప చేసి కొప్పు చుట్టి , కొప్పు చుట్టూ మల్లెపూల కదంబమాల చుట్టారు. అక్కడ నేను ఫోక్ డాన్స్ చెయ్యాలన్నారు. నేను తలూపాను.
కూవాగం ట్రాన్స్ జెండర్ ఫెస్టివల్ వేడుకల్లో భాగంగా ట్రాన్స్ ఉమెన్ కోసం నిర్వహించిన పోటీలలో పాల్గొన్న నా అనుభవాన్ని పంచుకోవడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మూడు రోజుల పాటు విల్లుపురం అంతటా వివిధ కమ్యూనిటీ హాళ్లలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
మొదటి రోజు విల్లుపురం పట్టణ ప్రాంతంలోని నెహ్రూ కమ్యూనిటీ హాల్‌లో నృత్య పోటీతో ప్రారంభమైంది. నా కదలికలను ప్రదర్శించడానికి ఆసక్తిగా నా స్నేహితులతో నేను ముందుగానే వచ్చాను. సంగీతం ప్రారంభమైనప్పుడు, నా అభిరుచిని ప్రకాశింపజేస్తూ నేను ప్రధాన వేదికను తీసుకున్నాను. "మొక్కజొన్న తోటలో, ముసిరిన చీకట్లలో'" అనే పాటకి డాన్స్ చేశాను.
ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, నా ఉత్తమ ప్రతిభను చూపించమని నన్ను కోరారు. స్థానిక కళాకారులు మరియు కమ్యూనిటీ నాయకులతో కూడిన న్యాయనిర్ణేతలు నా ప్రతిభను చూసి ముగ్ధులయ్యారు. నేను మొదటి మూడు పోటీదారులలో ఒకరిగా నిలిచాను, ఇది అద్భుతమైన ఆశ్చర్యం.