అప్పుడు నాకు 26 సంవత్సరాల వయస్సు. నేను నా అలవాటు ప్రకారం శుక్రవారం సాయంత్రం మా అక్క వాళ్ళింటికి వెళ్దామని సాయంత్రం బయల్దేరాను. ఎప్పుడూ చీర కట్టుకునే దాన్ని ఆరోజున మాత్రం సల్వార్, లో నెక్ కమీజ్ కట్టుకున్నాను. నే కట్టుకున్న సల్వార్ నడుం దగ్గర్నుంచి మోకాళ్ళవరకూ చాలా టైట్ గా ఉంది. పై కమీజ్ లో నెక్ కావడం, శాటిన్ క్లాత్ తో కుట్టింది, మరియు చాలా టైట్ గా ఉండటం వల్ల నా ఎద పొంగుల్ని నేను లోపల వేసుకున్న బ్రా లోంచి తన్నుకు వచ్చేలా చేస్తోంది. అయితే నేను ఒక సైడుకు మాత్రమే వేసుకున్న నైలాన్ చున్నీ నా పొంగుల్ని కప్పలేక జారిపోతోంది. జావకారిపోతోంది. నా పొంగులకు కిందనున్న కమీజు నా పొట్టకు అతుక్కుపోయి నా నాభి లోతుని చూసే వాళ్ళ కళ్ళతో కూడా కొలవడానికి దారి చూపిస్తుంది. కమీజు మరికొంచెం కిందకు వెడితే నడుము నుంచి ఊరువుల వరకూ నాకు మంచి ఆకృతిని ఇచ్చింది. నేను ఫ్లాట్ చెప్పులు వేసుకుని ఉన్నాను. మా అక్కతో సెల్ఫోన్ లో మాట్లాడుతూ పరుగెత్తుకుంటూ బస్ ఎక్కి స్త్రీల సీట్లలో ముందునుంచి మూడవ వరుసలో కిటికి సీటు పక్క సీటులో కూర్చున్నాను. నా కిటికీ సీటులో ఎవరో యువతి కూర్చుని ఉంది. బస్సు కదలగానే నేను ఫోన్ లో మాట్లాడటం ఆపేశాను. బస్ కొంచెం ముందుకు కదిలిన తరువాత "హాయ్ సిస్టర్, నా పేరు అనిత" అని చెప్పింది. నేను "సంతోషం అక్కా. నాపేరు మధు." అని చెప్పా. "నీ డ్రెస్ చాలా బాగుంది." అని చెప్పింది. ఇంకా "మీ అక్కగారింటికి వెడుతున్నారా!" అని అడిగింది. "అవునక్కా!" అన్నాను. అనిత గొంతు కొంచెం వేరేగా ఉంది. ఆమెకి నా గొంతు కూడా అలాగే ఉంది. "అక్కా, మీరు...?" అన్నాను. "అవును సిస్టర్! నేనొక ట్రాన్స్ జెండర్ ని. మీరు కూడా...?" ... అని ఆగింది. "అనితక్కా! మీరు అనకండి. ఏకవచనం కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇంకా నాగురించి చెప్పాలంటే నేను పుట్టుకతో మగపిల్లవాణ్ణే. కాని అయిదుగురు అక్కల తరువాత పుట్టడం వల్ల నాకు పదేళ్ళ వరకు మగపిల్లల బట్టలు కట్టలేదు. అందుచేత ఆ తరువాత కూడా మా అక్కల బట్టలే కట్టడం అలవాటైంది. కేవలం స్కూల్ లో, కాలేజీలో మాత్రమే మెగా బట్టలు కట్టడం అలవాటు. ఇంట్లో కాని, ఇలా ఊళ్ళెళ్ళినప్పుడు కానీ ఆడ దుస్తులే ధరిస్తాను." అని చెప్పాను. "అవును చెల్లీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ గొంతు కూడా ఎక్కువగా ఆడపిల్లల గొంతులాగే ఉంది." అని చెప్పింది. అలా అలా ఎన్నో విషయాలుమాట్లాడుకుంటున్నాం. మాటల సందర్భంలో అనిత చెప్పింది. ఇంకో నెలరోజుల్లో తమిళనాడు విల్లుపురానికి దగ్గర కూవాగం లో ఒక పెద్ద ట్రాన్స్జెండర్ పండుగ జరుగుతుంది. నువ్వు కూడా రాకూడదు? అక్కడ ఆ పండుగలో కొన్నివేలమంది ట్రాన్స్ జెండర్ లు దేశం నలు మూలలనుంచి వస్తారు." అని చెప్పింది.. "వివరంగా చెప్పక్కా!" అని అడిగాను. "వెంటనే నా చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుని, ఇన్నాళ్ళకు జనరల్ పబ్లిక్ లో నన్ను అసహ్యించుకోకుండా అక్కా అని ఆప్యాయంగా పిలిచిన ఒక చెల్లిని చూశాను. చాలా థాంక్స్ చెల్లీ" అని చెప్పి కూవాగం గురించి చెప్పడం మొదలు పెట్టింది.
గరిమ కథలు 9 అనిత చెప్పింది... ఛలో కూవాగం
Part 1
Part 2
కూవాగం అనేది తమిళనాడులోని విల్లుపురం జిల్లా నుండి 25 కి.మీ దూరంలో ఉన్న ఉలుందూర్‌పేట తాలూకాలోని ఒక గ్రామం. ఇది లింగమార్పిడి మరియు లింగమార్పిడి వ్యక్తుల వార్షిక ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది, ఇది తమిళ నెల చితిరై (ఏప్రిల్/మే)లో పద్దెనిమిది రోజుల పాటు అరవాన్ ఆలయమైన కూతండవర్ ఆలయంలో జరుగుతుంది.
చరిత్ర
పాండవ యువరాజు అర్జునుడి కుమారుడు అరవాన్, మహాభారతంలోని ఒక చిన్న పాత్ర. అతను తిరునంగై అంటే దక్షిణ భారతదేశంలో అరవాణి , మరియు దక్షిణాసియా అంతటా హిజ్రా అని పిలువబడే ప్రసిద్ధ లింగమార్పిడి వర్గాలకు భర్తగా గౌరవింపబడుతున్నవాడు. మహాభారతం అరవాన్‌ను 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో (మహాభారత యుద్ధం) తన ప్రాణాలను త్యాగం చేసిన పురాణ వీరుడిగా వర్ణించింది. కూతాండవర్ పండుగ అరవాన్ ఆత్మబలిదానానికి గౌరవంగా కృష్ణుడు ఇచ్చిన మూడు వరాలలో ఒకదానిపై దృష్టి పెడుతుంది. అరవాన్ మరణానికి ముందు వివాహం చేసుకోవాలనుకున్నాడు. కృష్ణుడు స్త్రీ రూపం మోహినిని ధరించి అరవాన్‌కు వరం ఇచ్చాడు. మరుసటి రోజు, అరవాన్ తన ప్రాణాన్ని త్యాగం చేశాడు మరియు మోహిని వితంతువులా దుఃఖించింది. ఈ మోహినులే నేటి అరవాణులు. లేక హిజ్రాలు.
కూవాగం పండుగ
ఈ పండుగ కోసం భారతదేశం అంతటా మరియు పొరుగు దేశాల నుండి ట్రాన్స్‌జెండర్లు మరియు క్రాస్-డ్రెస్సర్లు కూవాగంను సందర్శిస్తారు. ట్రాన్స్‌జెండర్లు మరియు పురుష గ్రామస్తులు (అరవణుడికి ప్రతిజ్ఞ చేసినవారు) కూతండవర్ ప్రభువును వివాహం చేసుకుంటారు, తద్వారా పురాతన పురాణాన్ని తిరిగి ప్రదర్శిస్తారు. మరుసటి రోజు, వారు కూతండవర్ మరణానికి ఆచార నృత్యాలు, ఒప్పారి మరియు వారి గాజులు విరగ్గొట్టడం మరియు తాళి (వివాహ హారము) తెంచుకోవడం ద్వారా గొల్లున ఏడుస్తారు.
అరవాణులకు అరవాన్ తో వివాహం
ముందురోజు రాత్రి అరవాన్ తో హిజ్రాలందరికీ వివాహం జరుగుతుంది. ఆచారం ప్రకారం వేలాది మంది ట్రాన్స్‌జెండర్లు అరవన్‌కు వధువుల వేషధారణలో ఆలయానికి నడిచి వెళ్లి తాళి కట్టుకుంటారు. ట్రాన్స్‌జెండర్లు చిన్న చిన్న మంటల చుట్టూ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ, తమ వివాహాన్ని జరుపుకుంటూ, తమ 'జీవిత భాగస్వామి'ని సంతోషపరుస్తారు. వారికి, ఈ పండుగ ప్రేమ, బాధ మరియు త్యాగం గురించి. ఆలయంలో తాళి కట్టిన తర్వాత , 'మొదటి రాత్రి'ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. గ్రామం మొత్తం మేల్కొని ఉంది మరియు బయటి వ్యక్తులు ప్రార్థనలు చేయడానికి ఆలయానికి వస్తారు.
అరవాణులు త్యాగం చేసే రోజు
అరవాన్ విగ్రహం ఉన్న రథం గ్రామం చుట్టూ ఊరేగింపు ప్రారంభించగానే, తాళి కట్టుకున్న వారు దానిని తెంచుకోవడం ప్రారంభిస్తారు. తరువాత వారు తమ గాజులు విరగ్గొట్టి, వితంతువులుగా తమ ను ప్రకటించుకుని తెల్లటి చీరలు ధరించి, అతని మరణానికి సంతాపం తెలుపుతూ పాటలు పాడతారు.
Part 3
అరవాణులకు లేక హిజ్రాలకు లేక ట్రాన్స్ జెండర్ లకు ఇది ఎంతో గొప్ప పండుగ. అని అనిత కూవగం విశేషాలనన్నింటినీ చాలా వివరంగా చెబుతూనే "నువ్వు తప్పనిసరిగా పైనెలలో నాతో కూవాగం కు రా" అనిచెబుతూ నెమ్మదిగా నా భుజం మీద నిదురపోయింది.
మా బస్ సాలూరు చేరుకున్నాక అనితను లేపి అనిత నుంచి ఫోన్ నెంబరు తీసుకుని నా ఫోనెంబరు తనకిచ్చి అక్క వాళ్ళింటికి దగ్గర దిగిపోయాను. బస్సు ముందుకు వెళ్ళిపోయింది.
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
Comments

Awesome sis. Chala detailed ga aa koovagam festival gurinchi explain chesaru

Thanks a lot sister. In future I am going add some of my experiences there. I wish your encouraging comments more and more LB,🤝